Best Streaming Services : స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇంట్లో ఎంటర్టైన్మెంట్ పరిస్థితి మారిపోయింది. స్ట్రీమింగ్ సర్వీసెస్ సంప్రదాయ కేబుల్ టీవీను డామినేట్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ జోన్ ను మార్చేశాయి. మంత్లీ సబ్ స్క్రిప్షన్ తో వచ్చేసిన ఈ స్ట్రీమింగ్ సర్వీసెస్ ప్లాట్ఫామ్స్ ఎన్నో సదుపాయాలను అందిస్తున్నాయి. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా టీవీ షోస్ నుంచి డాక్యుమెంటరీస్, సినిమాలు, వెబ్ సిరీస్ వరకూ ప్రతీ విషయాన్ని యూజర్స్ కు అందిస్తున్నాయి. సినిమాలతో పాటు డ్రామాలకు సంబంధించిన సిరీస్, ఒరిజినల్ సిరీస్ సైతం అందిస్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఇండియాలో ఎక్కువగా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి రావడంతో వినియోగదారులు దేనిని ఎంచుకోవాలనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఇండియాలో ఉండే బెస్ట్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్స్ ఏంటి? అవి అందించే ప్లాన్స్ ఏంటో ఒకసారి చూద్దాం.
Netflix (నెట్ ఫ్లిక్స్) – ఇండియాలో ఉన్న పాపులర్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్స్ లో నెట్ఫ్లిక్స్ ఒకటి. ఇందులో వచ్చే కంటెంట్ మొబైల్ డివైస్ తో పాటు టీవీల్లో సైతం చూసే అవకాశం ఉంటుంది. లాప్టాప్ తో పాటు టెలివిజన్స్ లో చూడాలనుకునే వారికి బేసిక్ ప్లాన్ రూ.199 నుంచే అందుబాటులో ఉంది. ప్రముఖ టెలికాం ఆపరేటర్స్ ఎయిర్టెల్, జియో తమ ప్లాన్స్ లో భాగంగా నెట్ ఫిక్స్ సర్వీసెస్ ను సైతం అందిస్తున్నాయి.
Amazon Prime Video (అమెజాన్ ప్రైమ్ వీడియో) – వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ను అందిస్తున్న స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో. ఈ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ ప్లాన్ రూ.299 నుంచే మొదలవుతుంది. రూ.1499 వరకూ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. స్ట్రీమింగ్ తో పాటు ప్రైమ్ వీడియోస్, అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్స్ సైతం ఇందులో ఉంది. ఈ మెంబర్షిప్ తో అమెజాన్ సేల్స్, డీల్స్, రెండు రోజుల్లో షిప్పింగ్ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. ప్రైమ్ మ్యూజిక్ తో పాటు ప్రైమ్ గేమింగ్ వంటి ప్లాన్స్ సైతం అందుబాటులో ఉన్నాయి.
Disney+Hotstar (డిస్నీ + హాట్ స్టార్) – ఓటీటీ ప్లాట్ఫామ్స్ కు స్పెషల్ ఆఫర్స్ ను అందిస్తుంది ఈ స్ట్రీమింగ్ ఫ్లాట్ఫామ్. వెబ్ సిరీస్, టీవీ సీరియల్స్, స్పోర్ట్స్ తో పాటు మరింత కంటెంట్ ను అందిస్తుంది. ఇందులో భాగంగా మంత్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.249 నుంచి ప్లాన్స్ అందుబాటులో ఉండగా రూ.1499 ఇయర్ ప్లాన్ పొందే అవకాశం ఉంది.
Sony LIV (సోనీ లివ్) – కల్వర్ మాక్స్ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న సోనీ లివ్ ఇండియాలోనే టాప్ స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్స్ లో ఒకటిగా ఉంది. ఇది 2013లో మొదలవగా మొదట్లో ఓటీటీ సర్వీసెస్ అందించేది. స్పోర్ట్స్ తో పాటు ఇతర కంటెంట్ సైతం అందిస్తుంది. ఇక రూ.299 నుంచే మొదలవుతున్న ఈ ప్లాన్స్ రూ.999 వరకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా ఓటీటీ సర్వీసెస్, మూవీస్, టీవీ షోస్, సీరియల్స్, రెగ్యులర్ కంటెంట్ అందుబాటులో ఉంది.
ZEE5 – జీ5 ఓటీటీ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ రూ.149 నుంచే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ టీవీలో పనిచేసే ఈ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ 90 లైవ్ ఛానల్స్ ను అందిస్తుంది. ఒకటి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మలయాళం, తమిళం, కన్నడ, మరాఠీ, ఒరియా, భోజ్పురి, గుజరాత్, పంజాబీ వంటి భాషల్లో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అందుబాటులో ఉంది. ఇక వీటితో పాటు జియో సినిమా ప్రీమియం, జియో స్టార్ వంటి ఫ్లాట్ ఫామ్స్ సైతం బెస్ట్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తున్నాయి.
ALSO READ : స్మార్ట్‌వాచ్‌లు vs ఫిట్‌నెస్ బ్యాండ్‌లు.. మీ ఫిట్నెస్ లక్ష్యాన్ని చేరుకోటానికి ఏది బెస్ట్?