BB Telugu 8: తెలుగు ప్రేక్షకులకు దాదాపు 105 రోజులుగా మంచి వినోదాన్ని పంచుతూ అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందించిన షో బిగ్ బాస్ (Bigg Boss). ఎట్టకేలకు ఈరోజు పూర్తి కాబోతోంది. ఇకపోతే నిన్నటి ఎపిసోడ్లో టాప్ ఫైనలిస్టులందరూ ఒకచోట చేరి, తమ జీవితంలో తాము ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన పరిస్థితిని చెప్పుకొని బాధపడ్డారు. అంతేకాదు మీరు చెప్పిన మాటలు కూడా నిజమే అని కన్నీళ్లు పెట్టుకున్న ఆడియన్స్ కూడా లేకపోలేదు. సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా సెలబ్రిటీలకు కష్టాలు ఉండవని, అసలు వారికి డబ్బు ఇబ్బందులు ఉండవని అందరూ అనుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం జీవితంలో అనుభవించిన దానికంటే ఎక్కువ దరిద్రాన్ని అనుభవించి, సెలబ్రిటీలుగా మారారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏ సెలబ్రిటీ జీవితాన్ని మనం కదిలించినా సరే వారి ఫ్లాష్ బ్యాక్ మొత్తం దుఃఖంగానే ఉంటుంది.
అందులో భాగంగానే నిన్న నిఖిల్ కూడా తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇకపోతే నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ కూడా మీ జీవితంలో బెస్ట్ మూమెంట్స్ అలాగే వరస్ట్ మూమెంట్స్ ని చెప్పుకోండి అని తెలుపగా నిఖిల్ మాట్లాడిన మాటలు ఉద్యోగం లేని ప్రతి కుర్రాడికి కూడా కనెక్ట్ అయిపోయాయి. వాస్తవానికి సినీ రంగంలోకి రాకముందు ఒక ఆర్కిటెక్ట్ స్టూడెంట్ గా కొనసాగేవారు నిఖిల్. ఒకవేళ నిఖిల్ అదే లైన్లో వెళ్లి ఉంటే ఈరోజు ఇంత మంచి జీవితం ఆయన సొంతం కాదేమో.. సినిమాల మీద విపరీతమైన వ్యామోహంతోనే ఆర్కిటెక్ట్ చదువును కూడా పక్కన పడేసి సినిమా రంగం వైపు అడుగులు వేశారు.
ఇకపోతే సినిమాలలో అవకాశాలు వెతుక్కునే సమయంలో సీరియల్ లో హీరోగా అవకాశం వచ్చింది. అయితే ఆ కన్నడ సీరియల్లో మొదటి ఎపిసోడ్ నుండి కాదు ఆ సీరియల్ లో అప్పటివరకు పనిచేసిన హీరో హ్యాండ్ ఇవ్వడంతో మధ్యలో ఈయనను తీసుకొచ్చారు. అలా అవకాశం వచ్చింది. అయితే ఆ గ్యాప్ మొత్తంలో నిఖిల్ దగ్గర రూపాయి కూడా ఉండేది కాదట. కనీసం 10 రూపాయలు కావాలన్నా తన అమ్మానాన్నలను అడిగేవారట. ఒక్కొక్కసారి వాళ్ళ తల్లిదండ్రులే సిగ్గు లేదా? మా మీద పడి బ్రతకడానికి అంటూ సూటిపోటి మాటలతో మనసు నొచ్చుకునేలా చేశారట. ఇంటికి భారం అయ్యావు.. నిన్ను పోషించడమే కాకుండా డబ్బులు కూడా మేమే ఇవ్వాలా? ఇంత వయసొచ్చింది కనీసం సొంత సంపాదన లేకపోతే ఎలా? అంటూ తనను చాలా మానసికంగా ఇబ్బందులకు గురి చేశారట. వాస్తవానికి నిఖిల్ తల్లిదండ్రులు మాత్రమే కాదు వయసుకు వచ్చి ఎలాంటి పని పాట లేకుండా ఉండే ప్రతి ఒక్క అబ్బాయి కైనా, అమ్మాయి కైనా తల్లిదండ్రుల నుంచి ఎదురయ్యే అనుభవమే ఇది. ఆ బాధలు భరిస్తున్న సమయంలో అనుకోకుండా కన్నడ సీరియల్ లో అవకాశం లభించడం, రోజుకు రూ.2500 ఇస్తామని ఆ సీరియల్ నిర్మాత చెప్పారట. దీంతో నెలకి రూ.75000 వస్తుంది కదా ఎలాగో అలా కష్టపడి పనిచేద్దామనుకొని ఆ సినిమా షూటింగ్ లోకి అడుగుపెట్టాడు. అయితే కేవలం పది రోజుల్లోనే ఆ షూటింగ్ కూడా అయిపోయింది. మళ్లీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు నిఖిల్ పరిస్థితి మారిపోయింది. ఇక తర్వాత స్టార్ మా చానల్లో గోరింటాకు సీరియల్ లో హీరోగా అవకాశం రావడంతో అది పెద్ద హిట్ అయింది. ఇక అప్పటినుంచి వెను తిరిగి చూడలేదట నిఖిల్. ఎకల డబ్బే ప్రధానం , డబ్బు లేకపోతే ఏమీ చేయలేమని చెప్పుకొచ్చారు నిఖిల్. ఇక ఇప్పుడు తన స్ట్రాటజీతో , లీడర్షిప్ క్వాలిటీతో అందరినీ మెప్పించిన ఈయన.. ఈ సీజన్ కి విన్నర్ గా నిలవబోతున్నారని సమాచారం. ఒకవేళ విన్నర్ అయితే రూ.55 లక్షల ప్రైజ్ మనీ నిఖిల్ సొంతం అనడంలో సందేహం లేదు. ప్రైజ్ మనీతో పాటు మారుతీ కార్ అలాగే తన రెమ్యూనరేషన్ అన్నీ కూడా ఆయన ఖాతాలో చేరబోతున్నాయి. ఇది చూసిన నెటిజెన్స్ అదృష్టం అంటే నీదే అంటూ కామెంట్లు చేస్తున్నారు.