BigTV English
Advertisement

Xiaomi 14 Civi: లైకా కెమెరాతో కొత్త స్మార్ట్‌ఫోన్.. షార్ట్ ఫిల్మ్స్ కోసం కెమెరాలు అవసరమే లేదు.. రెండు 32MP ఫ్రంట్ కెమెరాలు కూడా!

Xiaomi 14 Civi: లైకా కెమెరాతో కొత్త స్మార్ట్‌ఫోన్.. షార్ట్ ఫిల్మ్స్ కోసం కెమెరాలు అవసరమే లేదు.. రెండు 32MP ఫ్రంట్ కెమెరాలు కూడా!

Xiaomi 14 Civi Launch Date in India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. అదే ‘Xiaomi 14 Civi’ ఫోన్. Xiaomi 14 Civi సరసమైన ధరలో ఫ్లాగ్‌షిప్ ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లను అందించనుంది. ఇప్పుడు రాబోయే ఈ Xiaomi 14 Civi స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో ఎప్పుడు లాంచ్ అవుద్ది.. దాని ధర, స్పెసిఫకేషన్ల గురించి తెలుసుకుందాం.


Xiaomi 14 Civi Launch date

Xiaomi తన కొత్త స్మార్ట్‌ఫోన్ Xiaomi 14 Civiని జూన్ 12, 2024న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. లాంచ్ ఈవెంట్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ లాంచ్ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారాన్ని కంపెనీ అధికారిక YouTube ఛానెల్‌లో చూడవచ్చు.


Xiaomi 14 Civi Expected Specifications

Xiaomi 14 Civi స్మార్ట్‌ఫోన్ ప్రీమియం డిజైన్‌తో రానుంది. ఇది క్రూజ్ బ్లూ, మ్యాచా గ్రీన్, షాడో బ్లాక్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. Xiaomi 14 Civi 120Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది. ఫోన్ స్క్రీన్ పరిమాణం 6.55 అంగుళాలు ఉంటుంది. డిస్‌ప్లేలో HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్, అలాగే స్టీరియో స్పీకర్‌లు, 68 బిలియన్ల కంటే ఎక్కువ కలర్‌లను ప్రదర్శించే సామర్థ్యం ఉంటుందని కంపెనీ తెలిపింది.

Also Read: నమ్మలేకపోతున్నా.. 8GB ర్యామ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌ ఫోన్‌పై రూ.40 వేల డిస్కౌంట్‌.. ఈ సరుకు వదలకండి..!

Xiaomi 14 Civi Camera

కంపెనీ ఈసారి లైకా బ్రాండ్‌కు చెందిన సరికొత్త కెమెరాలను అందిస్తోంది. ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి. ప్రధాన కెమెరా 50MP లైకా సమ్మిలక్స్ సెన్సార్, రెండవది 50MP పోర్ట్రెయిట్ టెలిఫోటో లెన్స్, మూడవది 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరాతో వస్తుంది. Xiaomi 14 Civiలో డ్యూయల్ ఫ్రంట్ కెమెరా సెటప్ ఉంటుందని Xiaomi తెలిపింది. ఇది 32-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 32-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. Xiaomi 14 Civi 4,700mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 67W టర్బో ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీని బట్టి చూస్తే హెచ్‌డీ క్వాలిటీలో రీల్స్ చేయాలన్నా లేక చిన్న చిన్న షార్ట్‌ఫిల్మ్స్ తీయాలన్నా కెమెరాల అవసరం లేకుండా.. ఈ ఫోన్ ఉంటే సరిపోతుంది.

Xiaomi 14 Civi Expected Price

Xiaomi 14 Civi ధర ఎంత అనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ రూ.50 వేల లోపు ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనేక నివేదికల ప్రకారం.. ఈ ఫోన్ బేస్ వేరియంట్ సుమారు రూ. 45,999కి లాంచ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అసలు ధర ఎంతన్నది జూన్ 12న జరగనున్న లాంచ్ ఈవెంట్‌లోనే తేలిపోనుంది. లాంచ్ అయిన వారం రోజుల్లోనే ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

Tags

Related News

Motorola Edge 50 Ultra: రూ.10వేల తగ్గింపుతో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా.. ప్రీమియం ఫోన్‌ బడ్జెట్‌ ధరలో..

Email Assistant: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్‌‌కు మీ స్టైల్లోనే రిప్లై!

iQOO 15 Mobile: లుక్‌, స్పీడ్‌, కెమెరా మూడు కలిసిన మాస్టర్‌పీస్‌ ఐక్యూ 15.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Vivo V40 Pro 5G: ఫోన్‌ కాదు, మినీ కెమెరా స్టూడియో.. ట్రెండ్‌ మార్చిన వివో వి40 ప్రో 5జి పూర్తి వివరాలు

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Redmi Note 16 Pro 5G: కేవలం రూ.18 వేలలో ఫ్లాగ్‌షిప్‌ లుక్‌.. రెడ్‌మి నోట్ 16 ప్రో 5జి పూర్తి వివరాలు

Flight Mode: మీ ఫోన్లో దాగున్న సూపర్ ఫీచర్.. ఫ్లైట్‌మోడ్‌తో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసా?

Big Stories

×