సేఫ్టీ పిన్స్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మహిళలు చీరను కట్టుకునే సమయంలో కుచ్చిళ్లు సరిగా ఉండేందుకు పెట్టుకుంటారు. సాధారణంగా దీని ధర రూ. 10 లేదంటే రూ. 20 ఉంటుంది. చూడ్డానికి కాస్త ఫ్యాన్సీగా ఉంటే ఎక్కువలో ఎక్కువ రూ. 100 వరకు ఉంటుంది. కానీ, తాజాగా ఓ కంపెనీ చీర పిన్నులను ఏకంగా రూ. 69,000 అమ్మడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ధరకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు.
లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ యాక్సెసరీలను పెట్టింది పేరు అయిన కంపెనీ ప్రాడా. ఈ కంపెనీ తాజాగా సేఫ్టీ పిన్ లను అమ్మకానికి ఉంచింది. చిన్నగా అల్లికలను కలిగిన ఒక మెటల్ సేఫ్టీ పిన్ బ్రూచ్ ధర $775గా నిర్ణయించింది. భారత కరెన్సీలో ఈ ధర సుమారు రూ. 68,758. నిజానికి ఈ కంపెనీ తయారు చేసే చాలా బ్రోచెస్ వజ్రాలు, అరుదైన రత్నాలతో పొదిగి ఉంటాయి. అందుకే ధర లక్షల్లో ఉంటుంది. కానీ, ప్రాడా బ్రూచ్ కేవలం బంగారు సేఫ్టీ పిన్, దాని చుట్టూ రంగురంగుల దారాలు చుట్టబడి ఉన్నాయి.
Read Also: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!
ఇక సోషల్ మీడియాలో ప్రాడా మెటల్ సేఫ్టీ పిన్ బ్రూచ్ లను $775 అమ్మడంపై నెటిజన్లు క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు. ప్రాడా యాక్సెసరీని ఎగతాళి చేస్తూ పోస్టులు పెడుతున్నారు. “మీరు మీ డబ్బుతో ఏమి చేస్తున్నారని నేను మరోసారి ధనవంతులను అడుగుతాను. ఎందుకంటే, ఇలాంటి పిన్స్ అంత ధర పెట్టి కొంటున్నారంటే డబ్బును వృథా చేస్తున్నట్లే. ఆ డబ్బుతో చాలా మంది ఎన్నో పనులు చేయలగరని తెలుసుకోవాలి” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “మా అమ్మమ్మ ఈ సేఫ్టీ పిన్ ను తలదన్నేలా తయారు చేస్తుంది. ఖర్చు జస్ట్ రూ. 10.. రూ. 20 కంటే ఎక్కువ ఉండదు” అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. ప్రాడా కంపెనీ తన వస్తువులకు నిర్ణయించే ధర మీద కూడా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనికి మాలిని వస్తువులకు వేలా రూపాయలు ఏంటని మండిపడుతున్నారు. ప్రజలు కూడా డబ్బులను గాలికి ఖర్చు పెట్టకూడదని సూచిస్తున్నారు. ఇలాంటి కంపెనీలు పెట్టే దిక్కుమాలిన వస్తువులను అంత అంత ధరలు పోసి కొనడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ప్రాడా సేఫ్టీ పిన్ గురించి నెట్టింట తెగ రచ్చ జరుగుతోంది.
Read Also: సోనీ కెమెరా, AI అసిస్టెంట్.. లెన్స్ కార్ట్ స్మార్ట్ గ్లాసెస్ చూస్తే మతిపోవాల్సిందే!