Xiaomi 17 Max: టెక్ ప్రియుల్లో షావోమీ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ ధరలో మంచి ఫీచర్లు అందిస్తుందని ఈ ఫోన్లకు భలే డిమాంట్ ఉంటుంది. అయితే ఇప్పుడు షావోమీ తమ కొత్త మోడల్ Xiaomi 17 Maxతో మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ముఖ్యంగా ఫోన్ బ్యాటరీ, కెమెరా విషయంలో కంపెనీ పెట్టిన ఎఫర్ట్ చూస్తుంటే టెక్ ప్రపంచం నోరెళ్లబెడుతోంది. పూర్తి వివరాల్లో వెళితే..
సాధారణంగా ఫోన్‌కు ఒక కెమెరా 200 మెగాపిక్సెల్ ఉంటేనే అబ్బో అంటాం. కానీ షావోమీ ఏకంగా వెనుక ఉన్న మూడు కెమెరాలను 200 ఎంపీతోనే తీసుకొస్తోంది. దీని కోసం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లైకా సంస్థతో చేతులు కలిపింది. దీని వల్ల ఫొటోలు అచ్చం కెమెరాతో తీసినట్టే వస్తాయి. ఎంత జూమ్ చేసినా క్లారిటీ మిస్ అవ్వదు. పండగలకు, ఫంక్షన్లకు ఈ ఫోన్ పట్టుకెళ్తే ఇక కెమెరామెన్ అవసరమే ఉండదన్నమాట.
Also Read: Galaxy S26 యూజర్ల కోసం One UI 9 బీటా లాంచ్.. మీ ఫోన్ లుక్ మార్చేసే 5 క్రేజీ ఫీచర్లు ఇవే!
ఈసారి షావోమీ బ్యాటరీ విషయంలో పెద్ద సాహసమే చేసింది. Xiaomi 17 Maxలో ఏకంగా 8,000mAh బ్యాటరీని పెట్టింది. దీంతో ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే రెండు రోజుల వరకు హాయిగా వాడుకోవచ్చు. మళ్లీ అంత పెద్ద బ్యాటరీని నిమిషాల్లో ఛార్జ్ చేయడానికి సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. దీంతో తక్కువ టైమ్‌లోనే బ్యాటరీ ఫుల్ అయిపోతుంది.
ఈ Xiaomi 17 Maxలో పవర్‌ఫుల్ ప్రాసెసర్ వాడటం వల్ల గేమ్స్ ఆడినా, పెద్ద పెద్ద యాప్స్ వాడినా ఫోన్ అస్సలు స్లో అవ్వదు. ఇక డిస్‌ప్లే క్వాలిటీ అయితే సూపర్ అని చెప్పాలి. దీనిలో వాడిన స్క్రీన్ వల్ల సినిమాలు చూస్తున్నప్పుడు కలర్స్ చాలా నీట్‌గా, కళ్లకు ఇంపుగా కనిపిస్తాయి. అలాగే ఫోన్ పట్టుకుంటే ప్రీమియం లుక్ వచ్చేలా దీన్ని డిజైన్ చేశారు.
ఈ ఫీచర్లు అన్నీ చూస్తుంటే షావోమీ 17 మాక్స్ ఫోన్ రాబోయే రోజుల్లో ఫోన్ మార్కెట్‌ను ఒక ఊపు ఊపేలా ఉంది. 200MP కెమెరాలు, 8,000mAh బ్యాటరీ అంటే మామూలు విషయం కాదు. త్వరలోనే ఇండియాలోకి రానున్న ఈ ఫోన్ ధర ఎంత ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంచి క్వాలిటీ ఫోన్ కావాలనుకునే వారికి ఇదొక మంచి ఆప్షన్ కానుంది.
Also Read: OPPO Find X9 సిరీస్ ఊరమాస్ ఎంట్రీ.. ఐఫోన్ రేంజ్‌లో ఫీచర్లు, ధర తెలిస్తే మాత్రం కళ్లు మెలేస్తారు!