Pooja Hegde: బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొంతకాలంగా పూజా హెగ్డే ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అని ముద్రతోనే కాలం గడిపేస్తుంది. ఇప్పటివరకు అమ్మడు నటించిన ఏ సినిమా కూడా విజయాన్ని అందుకోలేకపోయింది. ఎప్పుడెప్పుడు ఈ చిన్నది ఒక హిట్టు అందుకుంటుందా అని అటు అభిమానులతో పాటు ఇటు ఇండస్ట్రీ కూడా ఎంతగానో ఎదురుచూస్తుంది.
ఇండస్ట్రీకి వచ్చి పూజా పదేళ్లు అయిపోయింది. కెరీర్ ప్రారంభంలో ఎంతో కొంత స్టార్ హీరోల సరసన ఛాన్సులు పట్టేసి స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకున్న పూజా హెగ్డే రాధే శ్యామ్ సినిమా నుంచి పరాజయాలను అందుకుంటూనే వస్తుంది. రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కీసీకా భాయ్.. కిసీకా జాన్, దేవా, రెట్రో లాంటి స్టార్ హీరోల సినిమాలు చేసినా కూడా పూజాకు విజయం మాత్రం దక్కలేదు.
ఇక మధ్యలో ఎఫ్ 3, కూలీ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసిన అవి అమ్మడి ఖాతాలో పడలేదు అని అంటే అతిశయోక్తి లేదు. ఇక ఇంత ఐరన్ లెగ్ అని అనిపించుకున్నా కూడా పూజా పాపకి అవకాశాలు మాత్రం వరుసగా క్యూ కడుతూనే ఉన్నాయి. తాజాగా ఈ చిన్నది మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన నటించే లక్కీ ఛాన్స్ పట్టేసింది. మూడేళ్ల తర్వాత పూజా పాప తెలుగులో స్ట్రైట్ గా ఒక సినిమా చేస్తుంది. రవి నేలకుదుటి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ఒక తెలుగు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
లక్కీ భాస్కర్ తరువాత దుల్కర్ సల్మాన్ తెలుగులో చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రంలో దుల్కర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ చిన్నది రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ లో డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు పూజా దాదాపు మూడు కోట్లు అందుకుంటుందని తెలుస్తుంది.
నిజం చెప్పాలంటే ఈ అమౌంట్ పూజకు చాలా ఎక్కువ. కానీ, పాన్ ఇండియా సినిమా కావడంతో దానికి తగ్గట్టే మేకర్స్ అందరికీ ఇస్తున్నారని సమాచారం. అంతేకాకుండా అన్ని భాషల్లో పూజా పాపకు అంతో ఇంతో గుర్తింపు ఉండడంతో నిర్మాతలు కూడా అంతా రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారని టాక్. ఏది ఏమైనా కూడా విజయాలు లేకున్నా రెమ్యూనరేషన్ విషయంలో పూజా పాప డిమాండ్ మామూలుగా లేదు అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఈ సినిమాతో పూజా హెగ్డే సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందా లేదా అనేది చూడాలి.