Chevella Incident: చున్నీతో ఉరేసి ఫెన్సింగ్ పిల్లర్ రాయితో మోది భార్యను చంపాడు ఓ భర్త. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని వెంకన్నగూడ గ్రామానికి చెందిన జంగయ్య.. హైదరాబాద్‌లో డ్రైవింగ్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి ఇద్దరు భార్యలు ఉండగా, మొదటి భార్యతో కలిసి ఉంటున్నాడు. రెండో భార్య రజిత విడిగా ఉంటూ జీవనం కొనసాగిస్తుంది.
చున్నీతో ఉరివేసి.. తలపై రాయితో కొట్టి.. చంపిన భర్త
వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగి చాలా రోజులు గడిచింది. మళ్లీ మనమిద్దరం కలిసి జీవిద్దాం అని రెండో భార్య రజితతో చెప్పాడు జంగయ్య. ఊర్లో మాట్లాడదాం అని చెప్పి పెద్దల సమక్షంలో మాట్లాడారు. వెంకన్నగూడ గ్రామానికి వచ్చి రాత్రి తన తమ్ముడి దగ్గరే ఉన్నాడు. రజిత కలిసి ఉండడానికి అంగీకరించలేదు. తర్వాతి రోజు హైదరాబాద్ వెళ్ళిపోదామని ఇద్దరు కలిసి సాయంత్రం బయలుదేరారు.
హత్య తర్వాత మొదటి భార్యకు ఫోటోలు పెట్టిన జంగయ్య
ఇద్దరు వెంకన్నగూడ గ్రామ సమీపంలోకి వెళ్లి మద్యం తాగారు. అనంతరం స్కార్ఫ్‌తో మెడకు బిగించి చంపాడు. ఆమె చావలేదని అనుమానంతో పక్కనే ఉన్న ఫెన్సింగ్ వేసే సిమెంట్ రాయిని ఛాతీ మీద బలంగా కొట్టాడు. అనంతరం ఫోటోలు తీసి తన మొదటి భార్యకు చంపానంటూ పంపాడు. వెంటనే పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని.. పోస్టుమార్టం కోసం చేవెళ్లలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: నల్గొండ హాలియా SBIలో అగ్నిప్రమాదం..
చున్నీతో ఉరివేసి.. తలపై రాయితో కొట్టి..
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం వెంకన్నగూడలో దారుణ హత్య
కుటుంబ కలహాలతో భార్య రజితను హత్య చేసిన భర్త జంగయ్య pic.twitter.com/27U4HF7OTb
— BIG TV Breaking News (@bigtvtelugu) October 8, 2025