టికెట్ లేకుండా రైల్లో ప్రయాణించకూడదని అధికారులు చెప్తున్నప్పటికీ, ఇప్పటికీ చాలా పట్టించుకోవడం లేదు. టికెట్ తీసుకోకుండానే జర్నీ చేస్తూ, టీసీలకు అడ్డంగా దొరికి జరిమానాలు కడుతున్నారు. కేవలం సెంట్రల్ రైల్వే పరిధిలోనే 5 నెలల్లో ఏకంగా రూ. 100 కోట్లకు పైగా జరిమానా విధించారు. తాజాగా ఇందుకు సంబంధించిన వివరాలను రైల్వే అధికారులు వెల్లడించారు. “5 నెలల్లో మొత్తం 17.19 లక్షల మంది టికెట్ లేని ప్రయాణీకులు పట్టుబడ్డారు. వారి నుంచి రూ. 100.05 కోట్లు జరిమానా వసూలు చేశాం. ఏప్రిల్- ఆగస్టు 2025 మధ్య కాలంలో ఈ ఫైన్ తీసుకున్నాం” ” అని అధికారులు వెల్లడించారు. ప్రయాణీకులకు సురక్షితమైన, న్యాయమైన ప్రయాణాన్ని నిర్ధారించాలనే ఉద్దేశంతోనే జరిమానాలు విధిస్తున్నట్లు వెల్లడించారు.
ఆగస్టు 2025లోనే సెంట్రల్ రైల్వే చెకింగ్ టీమ్స్ 2.76 లక్షల మంది టికెట్ లేని ప్రయాణికులను పట్టుకున్నాయి. ఇది ఆగస్టు 2024తో పోలిస్తే 18 శాతం పెరుగుదల. ఈ నెలలో వసూలు చేసిన జరిమానాలు కూడా రూ.13.78 కోట్లకు పెరిగాయి. గత సంవత్సరం రూ.8.85 కోట్లు ఉండగా, ఇప్పుడు ఏకంగా 55 శాతానికి పైగా పెరుగుదల నమోదయ్యింది.
⦿ భూసావల్ డివిజన్: 4.34 లక్షల జరిమానాలు- రూ. 36.93 కోట్లు వసూళు
⦿ ముంబై డివిజన్: 7.03 లక్షల జరిమానాలు- రూ. 29.17 కోట్లు వసూళు
⦿ నాన్ పూర్ డివిజన్: 1.85 లక్షల జరిమానాలు- రూ. 11.44 కోట్లు వసూళు
⦿ పూణే డివిజన్: 1.89 లక్షల జరిమానాలు- రూ. 10.41 కోట్లు వసూళు
⦿ సోలాపూర్ డివిజన్: 1.04 లక్షల జరిమానాలు- రూ. 5.01 కోట్లు వసూళు
⦿ ప్రధాన కార్యాలయం: 1.04 లక్షల జరిమానాలు- రూ. 7.54 కోట్లు వసూళు
టికెట్ లేని ప్రయాణీకులను పట్టుకునేందుకు సెంట్రల్ రైల్వే UTS మొబైల్ యాప్ లో స్టాటిక్ QR కోడ్‌ల ద్వారా బుకింగ్‌లను నిలిపివేసింది. ప్రయాణీకులు, ముఖ్యంగా సబర్బన్ రైళ్లలో ఈ యాప్ ను దుర్వినియోగం చేస్తున్నట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. పేపర్ లెస్ టికెటింగ్ దుర్వినియోగాన్ని ఆపడానికి, ఆదాయ నష్టాన్ని తగ్గించడానికి UTS యాప్ ను నిలిపివేశారు.
Read Also: టికెట్ లేదు, పైగా దబాయింపు.. నెట్టింట టీచర్ వీడియో వైరల్!
ముంబైలో AC లోకల్ రైళ్లు, ఫస్ట్ క్లాస్ కోచ్ లలో అనధికార ప్రయాణాన్ని తగ్గించడానికి రైల్వే అధికారులు చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను చూపిస్తున్నారు. అనధికార ప్రయాణికులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల ద్వారా చెకింగ్ చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు, AC లోకల్ రైళ్లలో 59,029 కేసులు నమోదు కాగా, రూ.1.68 కోట్లు వసూళు అయ్యాయి. ఫస్ట్ క్లాస్ కోచ్‌ల నుంచి 70,900 కేసుల కేసులు నమోదు కాగా, రూ.2.26 కోట్లు వసూలు చేయబడ్డాయని అధికారులు వెల్లడించారు.
Read Also: ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే స్టేషన్, మన దేశంలోనే ఉంది తెలుసా?