MAD 3:సాధారణంగా కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తాయి అంటే వాటి సీక్వెల్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తూనే ఉంటారు. అలాంటి చిత్రాలలో మ్యాడ్ కూడా ఒకటి. కుర్ర హీరోలుగా పేరు తెచ్చుకున్న నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, అనంతిక సనిల్ కుమార్, గోపిక ఉద్యన్ , శ్రీ గౌరీ ప్రియా రెడ్డి కాంబినేషన్లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మ్యాడ్ . కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అనుకున్న దానికంటే రెట్టింపు స్థాయిలోనే నిర్మాతలకు లాభాలను అందించింది అని చెప్పవచ్చు.
అంతేకాదు ఈ సినిమాకి సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ కూడా వచ్చి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినా సరే కమర్షియల్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్తో వచ్చిన ఈ సినిమాలో విష్ణు ఓయ్ పాత్ర సినిమాకే హైలెట్ అని చెప్పాలి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన నటించిన ‘మిత్రమండలి’ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న విష్ణు ఓయ్.. అనూహ్యంగా మ్యాడ్ క్యూబ్ గురించి ఆసక్తికర అప్డేట్ పంచుకున్నారు. త్వరలోనే ఈ సినిమా అప్డేట్స్ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా అందిస్తాము అంటూ స్పష్టం చేశారు..
విష్ణు ఓయ్ మాట్లాడుతూ.. “మ్యాడ్ క్యూబ్ ప్రాజెక్టును 2026 వేసవి సందర్భంగా విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నాము. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయింది. వేగంగా షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా వదులుతాము” అంటూ క్లారిటీ ఇచ్చారు.మొత్తానికి అయితే మ్యాడ్ ఫ్రాంఛైజీలో భాగంగా రాబోతున్న మ్యాడ్ క్యూబ్ సినిమాపై అంచనాలు పెంచేశారు విష్ణు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ALSO READ:#VD15: విజయ్ కొత్త మూవీ పూజా కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్.. షూటింగ్ అప్పుడే?
మ్యాడ్ స్క్వేర్ కథ విషయానికి వస్తే.. కాలేజీ జీవితానికి వీడ్కోలు చెప్పిన తర్వాత మనోజ్, దామోదర్, అశోక్ తమ కెరియర్ ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలోనే తమ గ్యాంగ్ లోని సభ్యుడైన లడ్డు (విష్ణు)కి పెళ్లి కుదిరిందని తెలుస్తుంది. అతని పెళ్లికి హాజరవడానికి వెళ్తారు. కానీ పెళ్లి జరిగే ముందు లడ్డు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి పారిపోతుంది. పెళ్లి కాకుండానే గోవా కి హనీమూన్ కి బయలుదేరుతుంది ఈ గ్యాంగ్. గోవాకు వెళ్ళిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఒక మ్యూజియంలో బంగారు గొలుసు దొంగతనం అవుతుంది. ఈ కేసులో ఈ నలుగురు ఇరుక్కుంటారు. లడ్డు తండ్రి (మురళీధర్ గౌడ్) ను గ్యాంగ్ లీడర్ భాయ్ (సునీల్) కిడ్నాప్ చేస్తాడు. అసలు గ్యాంగ్ లీడర్ భాయ్.. లడ్డు తండ్రిని ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది సినిమా కథ. ఇక ఆ తర్వాత వచ్చే కథకు కొనసాగింపుగా ఇప్పుడు మ్యాడ్ క్యూబ్ ను రూపొందించనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.