BigTV English
Advertisement

Heavy Discount On Mobile: 5G స్మార్ట్‌ఫోన్.. హెవీ డిస్కౌంట్.. కిక్కిస్తున్న ఫీచర్లు!

Heavy Discount On Mobile: 5G స్మార్ట్‌ఫోన్.. హెవీ డిస్కౌంట్.. కిక్కిస్తున్న ఫీచర్లు!

Heavy Discount On Mobile: టెక్ ప్రపంచంలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల సెగ్మెంట్‌పై పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఈ సెగ్మెంట్‌లో తమ అధిపత్యాన్ని చెలాయించడానికి అనేక కంపెనీలు పోటీపడుతున్నాయి. అలానే భారీ లాభాలు గడించేందుకు ప్రయత్నిస్తున్నాయి. వరుసగా స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేస్తున్నాయి. ఫోన్లపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో మోటో కూడా చేరింది. మోటో తన G సిరీస్ ఫోన్‌పై మంచి డీల్ తీసుకొచ్చింది. తక్కువ ధరకే మొబైల్ కొనాలనే వారికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.


మీరు రూ.15 వేల లోపు ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే మీకు శుభవార్త ఉంది. ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ మోటరోలా G సిరీస్ Motorola G64 5G పవర్‌‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ బంపర్ తగ్గింపుతో అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.14,999. వెయ్యి రూపాయల తగ్గింపుతో సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపు కోసం మీరు Axis లేదా HDFC బ్యాంక్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లించే వినియోగదారులు అదనరంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో మీరు ఈ ఫోన్ ధరను రూ.9,200 తగ్గించవచ్చు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అనేది మీ ఫోన్ బ్రాండ్, కంపెనీ పాలసీపై ఆధారపడి ఉంటుందని వెల్లడించింది. మరిన్ని వివరాలకు అఫిషియల్ పేజ్‌ని తనిఖీ చేయండి.


Also Read: Mobiles Under 8000: రూ.8 వేల లోపే అదిరిపోయే ఫోన్లు.. కెమెరా, స్టోరేజ్ అమేజింగ్!

Motorola G64 5G Specifications
మోటరోలా జీ 64 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఈ ఫోన్‌లో మీరు 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.5 అంగుళాల IPS LCD ప్యానెల్‌ను చూడవచ్చు. డిస్‌ప్లే ప్రొటక్షన్ కోసం కంపెనీ ఈ ఫోన్‌లో గొరిల్లా గ్లాస్‌ను కూడా అందిస్తోంది. ఈ ఫోన్ గరిష్టంగా 12 GB RAM + 256 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. కంపెనీ ఫోన్‌లో MediaTek Dimension 7025 చిప్‌సెట్‌ ప్రాసెసర్ అందిస్తోంది.

ఫోటోగ్రఫీ కోసం మీరు 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో కూడిన 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను ఫోన్‌లో చూస్తారు. అదే సమయంలో ఈ ఫోన్‌లో సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది.

Also Read: Flipkart Offers: బెస్ట్ ఆఫర్.. రూ.1.43లక్షలు ఫోన్‌పై కళ్లు జిగేల్ మనే డిస్కౌంట్!

ఫోన్‌లో అందించిన బ్యాటరీ 6000mAh. ఈ బ్యాటరీ 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.ఈ Motorola ఫోన్ Android 14లో రన్ అవుతుంది. కంపెనీ ఆండ్రాయిడ్ 15 OS అప్‌డేట్‌ను కూడా అందించబోతోంది. Dolby Atmos సౌండ్‌తో కూడిన ఈ ఫోన్‌లో మీరు డ్యూయల్ సిమ్, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, USB టైప్-C పోర్ట్,  3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Related News

iQOO 13 Review: ఐక్యూ 13 టెక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. ఒక్క ఫోన్‌తో మొత్తం ట్రెండ్ మార్చేసింది

Samsung Galaxy S25 Ultra: టెక్ ప్రపంచాన్ని షేక్ చేసే మోడల్.. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా కొత్త ఫీచర్లు లీక్

Amazon Bumper offer: మ్యూజిక్ లవర్స్‌కు అమెజాన్ అదిరిపోయే ఆఫర్.. ఇదే సరైన సమయం

Oppo 5G: 210ఎంపి కెమెరాతో ఒప్పో గ్రాండ్ ఎంట్రీ.. 7700mAh బ్యాటరీతో మాస్టర్‌ బ్లాస్టర్ ఫోన్

Redmi Note 15: రూ.12,000లకే ఫ్లాగ్‌షిప్ లుక్‌.. రెడ్మీ నోట్ 15 ఫోన్‌ సూపర్ ఫీచర్లు తెలుసా..

Fastest Electric Bikes: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లు, ఒక్కోదాని స్పీడ్ ఎంతో తెలుసా?

Vivo 78 Launch: వివో 78 కొత్త లుక్‌.. ఫోటో లవర్స్‌, గేమర్స్‌కి డ్రీమ్ ఫోన్‌..

Kodak HD Ready LED TV: రూ. 16 వేల కొడాక్ టీవీ జస్ట్ రూ. 8 వేలకే, ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే డిస్కౌంట్!

Big Stories

×