BigTV English

Bigg Boss 9 Promo: కొత్త టాస్క్.. డేంజర్ జోన్ లో వారే.. తప్పెవరిది?

Bigg Boss 9 Promo: కొత్త టాస్క్.. డేంజర్ జోన్ లో వారే.. తప్పెవరిది?

Bigg Boss 9 Promo: బుల్లితెర ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ మంచి ఎంటర్టైన్మెంట్ షో గా నిలిచింది బిగ్ బాస్. ఇప్పటికైనా తెలుగులో ఎనిమిది సీజన్లు పూర్తయ్యాయి.. అంతేకాదు 9వ సీజన్ కూడా ప్రారంభమై నాలుగు వారాలు ముగిసిపోయాయి. ఐదవ వారం కూడా వచ్చేసింది. ఐదవ వారానికి సంబంధించి నామినేషన్స్ నుంచి తప్పించుకోవడానికి కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ టాస్కులు నిర్వహిస్తున్నారు. ఈ టాస్కులు శారీరక బలం పై ఆధారపడినవని వీటిని చూస్తే అర్థమవుతుంది. అయితే ఇప్పుడు కూడా తాజాగా మరో టాస్క్ నిర్వహించగా.. డేంజర్ జోన్ లో ఉన్న వారి మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయేమో అనిపించక మానదు. మరి తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.


డేంజర్ జోన్ లో ఉన్నది వేరే..

తాజాగా 31 వ రోజుకు సంబంధించి మొదటి ప్రోమోను నిర్వహకులు విడుదల చేశారు. ఇందులో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కంటెస్టెంట్స్ మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ప్రోమో విషయానికి వస్తే.. డేంజర్ జోన్ లో ఉన్న ఇంటి సభ్యులకు నేను ఇస్తున్న మరో టాస్క్ హోల్డ్ ఇట్ లాంగ్.. అంటూ బజర్ మోగించారు. అందులో భాగంగానే పవన్ – రీతూ చౌదరి , కళ్యాణ్ – తనూజ, భరణి శంకర్ – దివ్య నిఖిత , సంజన – ఫ్లోరా , శ్రీజ -సుమన్ శెట్టి జంటలుగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ను ప్రారంభించారు.

పాపం కనుకరించని కెప్టెన్..

మధ్యలో ఉన్న బల్లను అటు ఇటు తాడు సహాయంతో స్ట్రైట్ గా బ్యాలెన్స్ చేయాలి. మధ్యలో అప్పుడప్పుడు ఆ బెంచ్ పై మిగతావారు బరువులు వేస్తారు. ఎవరైతే ఎండ్ బజర్ మోగే వరకు ఆ బల్లను బ్యాలెన్స్ గా మోస్తారో.. వారే ఆ టాస్క్ విజేత అంటూ బిగ్ బాస్ ప్రకటించారు. టాస్క్ మొదలవగానే కెప్టెన్ రాము రాథోడ్ తో పాటు సేఫ్ జోన్ లో ఉన్న ఇమ్మానుయేల్ అన్ని జంటల బ్యాలెన్సింగ్ బల్లలపై ఒక్కొక్క మూట పెట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వాటి సంఖ్య పెంచుతూ పోయారు. ఇక సంజన మేము ఉన్నది ఇద్దరం ఆడవాళ్ళమే కాస్త చూసి వెయ్యండి అని చెప్పినా కూడా పాపం కనికరించలేదు.


ALSO READ:MAD 3: సైలెంట్ గా షూటింగ్ మొదలైన మ్యాడ్ క్యూబ్.. రిలీజ్ అప్పుడే?

తప్పు ఎవరిది?

ఇక చివరిలో కళ్యాణ్ , తనూజ బ్యాలెన్సింగ్ బోర్డు కాస్త కళ్యాణ్ వల్ల కింద పడిపోతుంది. ఇక దాంతో మండిపడ్డ తనూజ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చూసుకోవాలి కదా అంటూ ఫైర్ అవుతుంది. అటు కళ్యాణ్ కూడా టాస్క్ ఓడిపోవడంతో మరింత గట్టిగా అరుస్తూ తన బాధను బయట పెట్టేశాడు. ఆ తర్వాత ఒక్కొక్క జంట బరువులు మోయలేక బయటకు వచ్చేస్తారు. ఇక చివరిగా ఎవరు మిగిలారు.. ఎవరు ఈ టాస్క్ విజేత అనే విషయం తెలియాలి అంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే. అయితే శారీరక బలం ఉపయోగించి ఈ టాస్కులు నిర్వహిస్తున్నారు బిగ్ బాస్. మరి ఇందులో ఈ వారం నామినేషన్స్ నుంచి బయటపడి సేఫ్ జోన్ లోకి ఎవరు వెళ్తారో తెలియాల్సి ఉంది.

 

Related News

Bigg Boss 9: మొదటిసారి టాస్క్ గెలిచింది, కానీ.. వరస్ట్ గేమ్ ఆడిన హౌస్ మేట్స్

Bigg Boss 9 Promo : తప్పుదారిలో గేమ్స్ ఆడిన హౌస్ మేట్స్, బిగ్ బాస్ స్ట్రాంగ్ వార్నింగ్

Bigg Boss : బిగ్ బాస్ హౌస్‌లో కాస్ట్యూమ్స్ కష్టాలు… కొత్త బట్టలు కావాలంటే తిప్పలే

Bigg Boss 9 Promo: ముదిరిన లవ్ ట్రాక్.. నవ్వులే కాదు కన్నీళ్లు కూడా!

Bigg Boss: బిగ్‌ బాస్‌కి షాక్.. షో ఆపేయాలంటూ ప్రభుత్వం నోటీసులు!

Bigg Boss 9 Telugu : రీతూ లవ్ స్టోరీ పై మాస్క్ మ్యాన్ షాకింగ్ కామెంట్స్.. నెక్స్ట్ ఎలిమినేట్ ఆమె..?

Bigg Boss 9 Promo : వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ… హౌస్‌మేట్స్ బెండ్ తీస్తున్న బిగ్ బాస్!

Big Stories

×