BigTV English
Advertisement

YouTube : యూట్యూబ్ లో ఏం చూడాలో కన్ఫూజ్ అవుతున్నారా! ఈ కొత్త ఫీచర్ గైడెన్స్ మీ కోసమే!

YouTube : యూట్యూబ్ లో ఏం చూడాలో కన్ఫూజ్ అవుతున్నారా! ఈ కొత్త ఫీచర్ గైడెన్స్ మీ కోసమే!

YouTube : ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్పామ్ యూట్యూబ్ లో కంటెంట్ కు కొదవేముంది. యూట్యూబ్ ఓపెన్ చేయగానే కుప్పలు తెప్పలుగా వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఇందులో మనకు కావాల్సిన అవసరమైన వీడియోలను మాత్రమే చూడాలంటే కాస్త కష్టమే. అయితే మీ సమయం వృథా కాకుండా కేవలం అవసరమయ్యో కటెంట్ ను మాత్రమే యూట్యూబ్లో అందించడానికి ఓ సరికొత్త ఫీచర్ వచ్చేసింది. అదే “ప్లే సమ్‌థింగ్”.


యూట్యూబ్ తాజాగా తీసుకొచ్చిన “ప్లే సమ్‌థింగ్” బటన్.. వినియోగదారులు ఒకే ట్యాప్‌తో కంటెంట్‌ని కనుగొనడంలో సహాయపడుతుంది. ఈ ఫీచర్ షార్ట్‌లు, సాధారణ వీడియోలను సైతం ప్లే చేస్తుంది. యూజర్స్ కు మరింత మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. ఒక ఏడాది పాటు ఈ ఫీచర్ పై మరిన్ని ప్రయోగాలు జరిపాక YouTube “ప్లే సమ్‌థింగ్” ఫీచర్ ను మరింత మంది యూజర్స్ కు అందుబాటులోకి వస్తోంది.

ఇప్పటికే యూట్యూబ్ యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎన్నో రకాల ఫీచర్లను జోడించింది. కొత్త వర్టికల్ స్క్రోల్ ఫీచర్, AI- పవర్డ్ ఆటో డబ్బింగ్ ఫీచర్ తో పాటు మరిన్నింటితో సహా కొత్త ఫీచర్‌లను విడుదల చేసింది. కాగా తాజా అప్‌డేట్‌లో ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్..  ఏ కంటెంట్ చూడాలనుకుంటున్నారో తెలియక గందరగోళంగా ఉన్న వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. “ప్లే సమ్ థింగ్” ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ (FAB)గా పిలవబడే ఈ ఫీచర్ సెలెక్టెడ్ వీడియోలను ప్లే చేయడం ద్వారా సమస్యను పరిష్కరిస్తుంది. తెలియని వారి కోసం, ఈ ఫీచర్ ఒక ఏడాది పాటు ప్రోగ్రస్ లో ఉండనుంది. ప్రస్తుతం Android వెర్షన్ 19.5తో  వినియోగదారులకు అందుబాటులో ఉంది.


ఇక ఈ ఫీచర్ వినియోగం గురించి చెప్పాలంటే, బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్‌తో హోమ్ ట్యాబ్ పైన అందుబాటులో ఉన్న “సమ్‌థింగ్ ప్లే” బటన్…  వినియోగదారులను స్క్రోల్ సర్చ్ లేదా ఫైండ్ సమ్ థింగ్ కంటెంట్‌లోకి నేరుగా తీసుకుపోవటంలో సహాయపడుతుంది. ఈ బటన్‌పై నొక్కిన తర్వాత, ఫీచర్ నేరుగా Shorts ప్లేయర్‌లో వీడియోను ప్లే చేయడం ప్రారంభిస్తుంది. ఈ ఫీచర్ కేవలం షార్ట్‌లకే పరిమితం కావడం గమనార్హం. అయితే ఇది సాధారణ వీడియోలను పోర్ట్రెయిట్ రూపంలో కూడా ప్లే చేయగలదు.

టైమ్‌లైన్ స్క్రబ్బర్ బటన్ కిందవైపు కనిపిస్తున్నప్పుడు.. కుడి వైపున ఉంచిన లైక్, డిస్‌లైక్, కామెంట్, షేరింగ్ కోసం పెద్ద బటన్‌లతో వీడియో కంట్రోలింగ్ మరింత తేలికగా ఉంటుంది. మల్టీప్లేయర్ సక్రియంగా ఉంటే, ప్లే సమ్‌థింగ్ బటన్ స్క్రీన్ నుండి అదృశ్యమవుతుందని కూడా వినియోగదారులు తెలుసుకోవాలి.

ఈ కొత్త ఫీచర్‌తో, ప్లాట్‌ఫారమ్ వినియోగదారు అనుభవాన్ని సులభతరం చేయడంతో పాటు లేటెస్ట్ కంటెంట్ ను వినియోగదారులు చూడటాన్ని ప్రోత్సహిస్తుంది. వినియోగదారులు శోధించాల్సిన అవసరం లేకుండానే ఫీచర్ రీసెంట్ గా అప్లోడ్ అయిన వీడియోస్ ను ఆటోమెటిక్ గా చూపిస్తుంది. అయితే యూట్యూబ్ నెలల తరబడి ఎన్నో ప్రయత్నాలు జరిపాక Play సమ్‌థింగ్ ఫీచర్ అందుబాటులోకి రాబోతుంది.

ALSO READ : పక్కదారి పట్టిస్తున్న చాట్ జీపీటీ! చెప్పేవన్నీ తప్పులేనా!

Tags

Related News

iQOO 15 Mobile: లుక్‌, స్పీడ్‌, కెమెరా మూడు కలిసిన మాస్టర్‌పీస్‌ ఐక్యూ 15.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Vivo V40 Pro 5G: ఫోన్‌ కాదు, మినీ కెమెరా స్టూడియో.. ట్రెండ్‌ మార్చిన వివో వి40 ప్రో 5జి పూర్తి వివరాలు

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Redmi Note 16 Pro 5G: కేవలం రూ.18 వేలలో ఫ్లాగ్‌షిప్‌ లుక్‌.. రెడ్‌మి నోట్ 16 ప్రో 5జి పూర్తి వివరాలు

Flight Mode: మీ ఫోన్లో దాగున్న సూపర్ ఫీచర్.. ఫ్లైట్‌మోడ్‌తో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసా?

AI Smart Glasses: సోనీ కెమెరా, AI అసిస్టెంట్‌.. లెన్స్‌ కార్ట్ స్మార్ట్‌ గ్లాసెస్‌ చూస్తే మతిపోవాల్సిందే!

OPPO A6 Pro Mobile: 7000 mAh భారీ బ్యాటరీతో ఒప్పో ఎంట్రీ.. ఏ6 ప్రో 5జి ఫుల్ డీటెయిల్స్ ఇండియాలో ఇవే..

Big Stories

×