Roja Fires on Pawan Kalyan: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఎన్నికల ఓటమి అనంతరం నోరు మెదపని మాజీ మంత్రి రోజు.. ఆరునెలల తర్వాత మాట్లాడుతున్నారు. దమ్ముంటే వైసీపీ నేతల్ని అరెస్ట్ చేయండి.. భయపడేది లేదని నిన్న సన్సెషనల్ కామెంట్స్ చేశారు. మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని చెప్పారు. మళ్లీ వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారని ఇప్పటి నుంచే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఇప్పటికీ తమ వైపే ఉన్నారని ఆమె చెబుతున్నారు.
తాజాగా.. ఇవాళ రోజా మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంప నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలనలో ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. ప్రజలకు ఇప్పటికీ వైసీపీపై విశ్వాసం ఉందని అన్నారు.
కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చిన 6 నెలల్లోనే సీఎం చంద్రబాబు లక్ష కోట్ల రూపాయల అప్పు చేశారని ఫైరయ్యారు. కేవలం 6 నెలల్లోనే రూ.15500 కోట్ల విద్యుత్ చార్జీలను కూటమి ప్రభుత్వం పెంచి ప్రజలపై భారం వేసిందని అన్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడలేదని.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజలు నానా కష్టాలకు గురిచేస్తుందని ఫైరయ్యారు.
Also Read: తక్కువ ఒత్తిడితో ఎక్కువ సాలరీ జాబ్స్ ఇవే..
అనునిత్యం ప్రజల్లో ఉండే పార్టీ వైసీపీ అని అన్నారు. విద్యుత్ చార్జీలు పెంచుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు హామీలకు ష్యూరిటీ లేదని.. మాటలకైతే వారంటీ లేదని ఎద్దేవా చేశారు. కరెంట్ చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీలు ఇసుక రేట్లు విపరీతంగా పెంచారని ఫైరయ్యారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై అదనపు భారాన్ని మోపుతోందని తీవ్రంగా విమర్శలు చేశారు.