Amit Mishra: విరాట్ కోహ్లీతో ( Virat Kohli) పాటు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ( Gautam gambhir) బండారం బయటపెట్టాడు మాజీ స్టార్ ఆటగాడు అమిత్ మిశ్రా. ఇద్దరు ఊర కుక్కలు లాగా కొట్టుకున్నారని మండిపడ్డారు. 2023 లో లక్నో వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( RCB vs LSG match) మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీతో పాటు గౌతమ్ గంభీర్ మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటనపై తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా స్పందించారు. ఈ సంఘటనలో మొదట గెలికింది విరాట్ కోహ్లీ అని, ఆ తర్వాత గౌతమ్ గంభీర్ కూడా రెచ్చిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ ను మొదట విరాట్ కోహ్లీ బండబూతులు తిట్టడంతో రంగంలోకి గంభీర్ దిగాడని సంచలన విషయాలు బయట పెట్టారు అమిత్ మిశ్రా ( Amit Mishra ).
విరాట్ కోహ్లీ వర్సెస్ గౌతమ్ గంభీర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే అంత పగ ఉన్న సంగతి తెలిసిందే. టీమిండియా హెడ్ కోచ్ అయిన తర్వాత గౌతమ్ గంభీర్ తో గొడవలు మర్చిపోయాడు విరాట్ కోహ్లీ. కానీ అంతకుముందు వీళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. లక్నో జట్టు మెంటల్ గా ఉన్న గౌతమ్ గంభీర్, బెంగళూరు జట్టుకు చెందిన విరాట్ కోహ్లీ మధ్య గొడవ జరిగింది. 2023 మే ఒకటవ తేదీన మ్యాచ్ పూర్తయిన తర్వాత లక్నో బౌలర్ నవీన్ తో గొడవ పెట్టుకున్నాడు విరాట్ కోహ్లీ. దీన్ని ఆపే ప్రయత్నంలో విరాట్ కోహ్లీతో గంభీర్ కూడా గొడవ పెట్టుకోవడం జరిగింది. ఈ సంఘటనపై అప్పుడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న లక్నో మాజీ బౌలర్ అమిత్ మిశ్రాస్ స్పందించారు. ఇందులో విరాట్ కోహ్లీ తో పాటు గౌతమ్ గంభీర్ తప్పిదం కూడా ఉందని బాంబు పేల్చారు.
సీనియర్ క్రికెటర్లు అయి ఉండి ఊర కుక్కలు లాగ కొట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అమిత్ మిశ్రా. మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత షేక్ అండ్ సమయంలో నవీన్ ను విరాట్ కోహ్లీ బండ బూతులు తిట్టినట్లు తెలిపారు. అలా ఒక ప్లేయర్ ను దూషించడం చాలా తప్పు.. ఆ సమయంలో గంభీర్ జోక్యం చేసుకొని రెచ్చిపోయాడు.. దీంతో పరిస్థితి అదుపు తప్పిందని క్లారిటీ ఇచ్చారు. ఈ గొడవలో విరాట్ కోహ్లీతో పాటు గంభీర్ తప్పిదం ఉందన్నారు. కానీ సీనియర్ ప్లేయర్లు మహేంద్ర సింగ్ ధోని అలాగే సచిన్ టెండూల్కర్ లాంటివాళ్ళు ఇలా దిగజారి ప్రవర్తించలేదని పేర్కొన్నారు. వాళ్లు జట్టును బాగా లీడ్ చేసేవారని గుర్తు చేశారు. కానీ గౌతమ్ గంభీర్ అలాగే విరాట్ కోహ్లీ మాత్రం దారుణంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు.
🚨 Amit Mishra reveals the reason behind the Virat Kohli vs Naveen-ul-Haq & Gautam Gambhir clash during the RCB vs LSG match 🚨
Amit Mishra Said :
“The issue started after the match was over, during the handshake, when Virat Kohli again abused Naveen-ul-Haq, which escalated the… pic.twitter.com/dGTBHt1IKT
— Mahi Patel (@Mahi_Patel_07) January 9, 2026