E-Paper
Advertisement

Virat Kohli: విరాట్ కోహ్లీకి మ‌రో కొడుకు ఉన్నాడా? ఎవ‌డ్రా వీడు అచ్చం దించేశాడు

Virat Kohli: విరాట్ కోహ్లీకి మ‌రో కొడుకు ఉన్నాడా? ఎవ‌డ్రా వీడు అచ్చం దించేశాడు
Advertisement

Virat Kohli: విరాట్ కోహ్లీ ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ కోసం రెడీ అవుతున్నారు. విరాట్ కోహ్లీ నెట్స్ లో విపరీతంగా ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తున్నారు. కాగా, ఈ క్రమంలోనే కోహ్లీని చూడడానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలి వస్తున్నారు . ఆ సమయంలో కూహ్లీని చూడడానికి వచ్చిన అభిమానులకు అతను ఆటోగ్రాఫ్ ఇచ్చారు. అందులో ఓ చిన్నారి అచ్చం యంగ్ కోహ్లీ లానే కనిపించి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిన్నారి అచ్చం యంగ్ కోహ్లీ లానే ఉన్నాడని కామెంట్లు చేస్తున్నారు. దీంతో యంగ్ కోహ్లీకి ఆటోగ్రాఫ్ ఇస్తున్న సీనియర్ కోహ్లీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. జనవరి 11 ఆదివారం నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ మొదటి వన్డే కోసం వడోదరకు వచ్చాడు. కోహ్లీ వన్డే సిరీస్ లో ఏ విధంగా తన ఆట తీరును కొనసాగిస్తాడో చూడాలని తన అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Also Read: Sarfaraz Khan-Abhishek Sharma: అభిషేక్ శర్మ ఓవర్‌లో 6, 4, 6, 4, 6, 4..15 బాల్స్‌లో స‌ర్ఫ‌రాజ్ అర్ధ సెంచ‌రీ

వన్డేలు మాత్రమే ఆడుతున్న కోహ్లీ

Advertisement

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టులు, T20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోహ్లీ వన్డేలు, ఐపీఎల్ మ్యాచ్లు మాత్రమే ఆడుతున్నాడు. కాగా, ఆదివారం నుంచి న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా ఆడనున్నాడు. కాగా.. 11, 14, 18 తేదీలలో మూడు వన్డేలు జరుగుతాయి. ఇది ఇలా ఉండగా, ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. వచ్చే సీజన్ కు సంబంధించిన మ్యాచ్ లు చిన్నస్వామి స్టేడియం వేదికగా నిర్వహించకూడదని రాయల్ చాలెంజర్స్ యాజమాన్యం అలాగే విరాట్ కోహ్లీ నిర్ణయం తీసుకున్నారట. త‌న హోం మ్యాచ్ ల‌ను ఇండోర్ లేదా రాయ్ పూర్ ఆడాల‌ని అనుకుంటోంద‌ట ఆర్సీబీ.

విరాట్ కోహ్లీ పర్సనల్ విషయాలు

విరాట్ కోహ్లీ ( Virat Kohli) ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి లండన్ లో సెటిల్ అయ్యారు. కేవలం మ్యాచ్లు ఉన్న సమయంలోనే లండన్ నుంచి తిరిగి వచ్చి మ్యాచ్ పూర్తయిన వెంటనే మళ్ళీ లండన్ కు బయలుదేరుతారు. విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరమైనట్లుగా తెలుస్తోంది. తన పూర్తి సమయాన్ని కేవలం తన భర్త పిల్లలకు మాత్రమే కేటాయిస్తోంది. వీరిద్దరూ ఎలాంటి హడావిడి లేకుండా చాలా సంతోషంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి లండన్ లో ఉంటున్నారు. అక్కడ అయితే వారిని ఎవరు ఎక్కువగా గుర్తుపట్టరనే కారణంతోనే కోహ్లీ, అనుష్క శర్మ లండన్ లో సెటిల్ అయినట్టుగా తెలుస్తోంది.

Advertisement

Also Read: Shivang Kumar: SRHలో మ‌రో మిస్ట‌రీ మెండిస్..రూ.30 ల‌క్ష‌ల‌కే కొనేసిన కావ్య‌పాప‌, 5 వికెట్ల‌తో ఇర‌గ‌దీసిన‌ శివంగ్

 

Related News

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

విరాట్ కోహ్లీ నాలాగే ఉంటాడు కానీ, పెద్ద అంద‌గాడు కాదు !

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

టీమిండియాకు ఏది చేత‌కాదు, ఇప్ప‌టికే విండీస్ సిరీస్ గెలిచింది, ట్రోఫీ ఇచ్చేయండి

టీమిండియా రూ.250 కోట్లు దొబ్బుకుపోతే, మాకు ఒక్క రూపాయి ఇవ్వ‌డం లేదు

నోటికి ప్లాస్ట‌ర్ వేసి, 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీశారు!

విడాకులు త‌ర్వాత ప‌చ్చి తాగుబోతున‌య్యా..ధ‌న శ్రీపై యుజ్వేంద్ర చాహల్ సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×