Arjun Tendulkar : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న విషయం విధితమే. నిశ్చితార్థం చేసుకోవడం వల్ల తన జీవితంలో రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. అయితే సోషల్ మీడియాలో వీళ్లు ఓ వినాయకుడి విగ్రహం వద్ద కనిపించారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఎంగేజ్ మెంట్ తరువాత సచిన్ టెండూల్కర్ ఫ్యామిలీ గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతుంది. సచిన్ కోడల్ సానియా కి జోష్యంలో ఏమైనా దోషం కూడా ఉందా..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం విశేషం.
Also Read : Asia Cup : ఆసియా కప్ లో ఎక్కువ మ్యాచ్ లు గెలిపించిన తోపు కెప్టెన్లు వీళ్లే… ధోనినే రియల్ మొనగాడు
గుళ్లు తిరగడానికి కారణం అదేనా..?
సానియా చందోక్ తో అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే. ఇంతలోనే ఇటు సచిన్ ఫ్యామిలీ, అటు సానియా ఫ్యామీలీ అంతా కలిసి గుళ్లు, గోపురాలు తిరుగుతున్నారేంటి..? ఇందులో ఆంతర్యం ఏంటి..? అని ప్రశ్నిస్తున్నారు. నిశ్చితార్థం జరిగిన కొద్ది రోజులకే అర్జున్ తనకు కాబోయే భార్యతో కలిసి బహిరంగంగా తిరుగుతున్నాడు. 25 ఏళ్ల అర్జున్ టెండూల్కర్. 26 ఏళ్ల సానియా చందోక్ తో ఆగస్టు 13న ఉంగురాలు మార్చుకున్నారు. మరోవైపు సచిన్ టెండూల్కర్ కంటే కూడా ఆయన భార్య అంజలి కూడా పెద్దదే కావడం గమనార్హం. నిశ్చితార్థం చేసుకోవడంతో అర్జున్ తన కెరీర్ పరంగా బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. ఆగస్టు 28 నుంచి జరుగుతున్న దులీప్ ట్రోఫీలో అతనికి అవకాశం దక్కలేదు. వాస్తవానికి చాలా మంది టీమిండియా స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నమెంట్ లో ఆడుతున్నారు. కానీ సచిన్ కుమారుడికి చోటు దక్కలేదు.
దులీప్ ట్రోఫీ నుంచి అర్జున్ ఔట్..
గోవా తరపున దేశవాళీ క్రికెట్ ఆడే అర్జున్ టెండూల్కర్ దులీప్ ట్రోఫీలో ఆడాలనుకున్నాడు. కానీ నార్త్ ఈస్ట్ జోన్ జట్టు అతని ఆశలను ఆవిరి చేసింది. రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ లో నాలుగు మ్యాచ్ లలో 16 వికెట్లను తీసిన అర్జున్ టెండూల్కర్.. దులీప్ ట్రోఫీ కోసం నార్త్ ఈస్ట్ జోన్ జట్టులో చోటు సంపాదించుకోలేకపోయాడు. మరోవైపు టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుబ్ మన్ గిల్, వెటరన్ బ్యాట్స్ మెన్ రుతురాజ్ గైక్వాడ్ దులీప్ ట్రోఫీలో ఆడనున్నారు. శార్దూల్ ఠాకూర్ కెప్టెన్సీలో రుతురాజ్ గైక్వాడ్ వెస్ట్ జోన్ జట్టు తరపున ఆడనున్నారు.ఇదిలా ఉంటే.. దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ జట్టుకు శుబ్ మన్ గిల్ కెప్టెన్సీ గా వ్యహరిస్తున్నాడు. ఆగస్టు 28 నుంచి 31 వరకు జరిగే ఈ టోర్నమెంట్ తొలి మ్యాచ్ లో నార్త్ జోన్, ఈస్ట్ జోన్ తో తలపడనుంది. ఈస్ట్ జోన్ కి కెప్టెన్ గా ఇషాన్ కిషన్ వ్యవహరిస్తున్నాడు. నార్త్ ఈస్ట్ జోన్ సెంట్రల్ జోన్ తో తలపడనుంది. దులీఫ్ ట్రోఫీ ఫైనల్ సెప్టెంబర్ 11 నుంచి 15 వరకు జరుగుతుంది.