OTT Movies: మనసుకు హాయి కలిగించే మాంచి రొమాంటిక్ మూవీని చూడాలని ఉందా? అయితే, ఈ ఇటాలియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా ‘ది హాటెస్ట్ సమ్మర్’ (The Hottest Summer) తప్పకుండా నచ్చేస్తుంది. దీని ఒరిజినల్ టైటిల్ L’estate più calda. ఈ మూవీ 2023లో విడుదలైంది. దీనికి మాట్టియో పిలాటి (Matteo Pilati) దర్శకత్వం వహించారు. ఈ మూవీ సిసిలీలోని ఒక చిన్న సముద్రతీర గ్రామంలో జరుగుతుంది. తీవ్రమైన వేసవి కాలంలో సాగే ప్రేమ కథ ఇది. ప్రేమ, మతపరమైన బాధ్యతలు, స్నేహం, వ్యక్తిగత నిర్ణయాలు వంటి సంఘర్షణలతో సాగుతుంది.
ఇదీ కథ:
లూసియా (Nicole Damiani) అనే యువతి తన బాయ్‌ఫ్రెండ్ ఒమర్ (Mehdi Meskar)తో రోమ్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంది. అక్కడ ఆమె యూనివర్సిటీలో చదువుకోవాని అనుకుంటుంది. అయితే, ఒమర్ తల్లిదండ్రులు ఆమెతో సంబంధాన్ని అంగీకరించరని భయపడుతూ ఉంటాడు. దీంతో వారి భవిష్యత్తు అనిశ్చితంగా ఉంటుంది. లూసియా తన బాల్యం నుంచి ఆసక్తి కలిగిన ఒక విల్లాలో సమయం గడుపుతుంది. అక్కడ ఆమె చర్చి సమ్మర్ క్యాంప్‌లో స్వచ్ఛందంగా పనిచేస్తుంది. ఆమె నన్‌లు, పిల్లలతో కలిసి ఉంటుంది. ఆమెకు ఆ విల్లా చాలా ఇష్టం. అందుకే దాన్ని ఎవరికీ అమ్మకూడదని కోరుకుంటుంది.
నికోలాతో లుసియా ఫ్రెండ్ ప్రేమ
అదే సమయంలో చర్చి ఫాదర్ గాబ్రియేల్ వెళ్లిపోతాడు. దీంతో అతడి స్థానంలో డీకన్ నికోలా (Gianmarco Saurino) వస్తాడు. నికోలా ఒక ఆకర్షణీయమైన మంచి మనసున్న వ్యక్తి. అందుకే అతడిని చూసి.. విల్లాలోని అమ్మాయిలంతా మనసుపడతారు. ముఖ్యంగా లూసియా బెస్ట్ ఫ్రెండ్ వాలెంటినా (Alice Angelica) నికోలా ప్రేమలో పడిపోతుంది. ఆమె నికోలాతో శారీరక సంబంధం కోరుకుంటుంది. ఈ విషయాన్ని లూసియాకు చెప్పి.. హెల్ప్ చేయాలని అడుగుతుంది. కానీ లూసియా అయిష్టంగానే తన స్నేహితురాలికి సాయం చేయడానికి ప్రయత్నిస్తుంది.
వాలెంటినాపై నికోలా ఆగ్రహం
వాలెంటినా నికోలాను ఆకర్షించడానికి చాలా ప్రయత్నిస్తుంది. చివరికి తన స్టైలే మార్చేసుకుంటుంది. ఒక రోజు అతడి ముందు కావాలనే తన బికినీని జారేలా చేసి.. నికోలాను ఆకట్టుకోవాలని అనుకుంటుంది. ఆమె అలా చెయ్యడం లూసియాకు నచ్చదు. వాలెంటినాను హెచ్చరిస్తుంది. కానీ వాలెంటినా వినదు. వాలెంటినా ప్రయత్నాలను గుర్తించి నికోలా ఆమెకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. లూసియా అదే సమయంలో నికోలాతో మాట్లాడి వాలెంటినా గురించి చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ నికోలా దానిని తేలికగా తీసుకుంటాడు. ఒక ట్రిప్‌లో వాలెంటినా మరింతగా నికోలాను లోబరుచుకొనే ప్రయత్నం చేస్తుంది. దీంతో లూసియా వద్ద తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు నికోలా. ఆమె తన మత విశ్వాలను ఎగతాళి చేస్తోందంటూ కోప్పడతాడు.
వాలెంటినాకు లూసియా ద్రోహం
మరోవైపు.. చర్చి కమ్యూనిటీలోని కార్మెన్ (Stefania Sandrelli) నికోలాపై ఓ కన్నేసి ఉంచుతుంది. అతడిని ఆ చర్చికి ఫాదర్ కాకుండా చేయడానికి కారణాలు వెతుకుతుంది. ఒక సంఘటనలో కార్మెన్ సిగరెట్ వల్ల అగ్ని ప్రమాదం జరుగుతుంది. లూసియా, నికోలా కలిసి విల్లాలను పిల్లలను, జంతువులను కాపాడతారు. ఈ సంఘటన వారి మధ్య బంధాన్ని బలపరుస్తుంది. దీంతో లూసియా.. ఊహించని బంధాల్లో చిక్కుకుంటుంది. ఒమర్, నికోలాలతో ప్రేమ.. మరోవైపు తన ఫ్రెండ్ వాలెంటీనాకు ద్రోహం చేస్తున్నానా అనే భావాలు ఆమెకు నిద్ర లేకుండా చేస్తాయి. అయినా సరే.. లూసియా తనని తాను కంట్రోల్ చేసుకోలేదు. నికోలాతో ఏకాంతంగా కలుస్తుంది. వారి సంబంధాన్ని ఇద్దరూ రహస్యంగా ఉంచుతారు.
ఒమర్ ఎంట్రీతో.. ఊహించని ట్విస్ట్, కానీ..
అలా వారిద్దరు.. తమ సీక్రెట్ రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తారు. వాలెంటినాకు అనుమానం కలుగుతుంది. నిజం తెలిసిన తర్వాత వాలెంటినా.. లూసియా మధ్య స్నేహం ముక్కలవుతుంది. ఒమర్ తండ్రి ఎలాగో తమ ప్రేమను అంగీకరించరని, నికోలాతో జీవితం ప్రారంభించాలని అనుకుంటుంది లూసియా. సరిగ్గా రోమ్‌కు వెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలో ఒమర్ ఎంట్రీ ఇస్తాడు. తన తండ్రి.. తమ ప్రేమను అంగీకరించారని చెబుతాడు. కానీ, అప్పటికే ఆమెకు ఒమర్‌పై ఆసక్తి పోతుంది. దీంతో ఒమర్‌ను దూరం పెట్టి.. నికోలాకు దగ్గర అవుతుంది. ఆ తర్వాత నికోలాతో ఓ విషయంలో స్పర్థలు వస్తాయి. ఇద్దరూ విడిపోతారు. మరో ఐదేళ్ల తర్వాత నికోలాను కలుస్తుంది లూసియా. కానీ, అప్పటికే అతడికి పెళ్లయిపోతుంది. ఇప్పుడు అతడు ఫాదర్ కాదు.. ఫ్యామిలీ మ్యాన్. మరి లూసియా చివరికి ఏమవుతుంది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మూవీ ప్రస్తుతం అమెజన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్, సబ్ టైటిల్స్‌తో చూడొచ్చు. పెద్దల సన్నివేశాలు ఉంటాయి. ఒంటరిగా చూడండి.