Arshdeep Singh : ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్స్ లో టీమిండియా సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్స్ లో పాకిస్థాన్ పై టీమిండియా ఏకంగా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో అర్ష్ దీప్ సింగ్ చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. Final Match, What’s Happening…అంటూ ఓ వీడియో తీసి సోషల్ మీడియలో పంచుకున్నాడు అర్ష్ దీప్ సింగ్. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ అభిమాని టీమిండియా వైపునకు చూస్తూ హాయ్ చెప్పాడు. అయితే అర్ష్ దీప్ కూడా హాయ్ చెప్పడంతో అసలు టీమిండియాకి తాను హాయ్ ఎందుకు చెప్పానురా అని పాకిస్తాన్ అభిమాని అనుకునే లోపే అతనికి కౌంటర్ ఇచ్చాడు అర్ష్ దీప్ సింగ్. అది మాటల్లో చెప్పలేము కానీ.. వీడియో చూస్తే మీకే అర్థం అవుతోంది. దీంతో ఆ పాకిస్తాన్ అభిమాని ఏడిచేది ఒక్కటే తక్కువ. టీమిండియాతో పెట్టుకుంటే అట్టుంటది మళ్లా అన్నట్టు స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చాడు.
Also Read : IND VS PAK: మరోసారి టీమిండియా వర్సెస్ పాక్ మ్యాచ్… ఎప్పుడంటే ?
ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ అభిమాని టీమిండియా బౌలర్ అర్ష్ దీప్ సింగ్ వైపునకు చూస్తూ హాయ్ హర్షిత అని చెప్పాడు. అయితే అర్ష్ దీప్ కూడా హాయ్ అని చెప్పడంతో అసలు ఇతనికి తాను హాయ్ ఎందుకు చెప్పానురా అని పాకిస్తాన్ అభిమాని అనుకునే లోపే అతనికి కౌంటర్ ఇచ్చాడు అర్ష్ దీప్ సింగ్. అది మాటల్లో చెప్పలేము కానీ.. వీడియో చూస్తే మీకే అర్థం అవుతోంది. దీంతో ఆ పాకిస్తాన్ అభిమాని ఏడిచేది ఒక్కటే తక్కువ. ముఖ్యంగా పాకిస్తానీయులకు టీమిండియా ఆటగాళ్లు అయినా.. అభిమానులు అయినా కౌంటర్ ఇవ్వడంలో చాలా ముందుంటారు. పైనల్ మ్యాచ్ లో గెలిచినప్పటికీ ఏసీసీ చీఫ్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు టీమిండియా నిరాకరించిన విషయం తెలిసిందే.
ఏసీసీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ ఇటీవల భారత్, ఆపరేషన్ సింధూర్ పై కాంట్రవర్సి కామెంట్స్ చేసాడు. ఇంతటి వివాదానికి కారణమైన నఖ్వీ.. ఇప్పుడు సొంత దేశంలోనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మరోవైపు నఖ్వీని పదవీ నుంచి కూడా తొలగించనున్నట్టు సమాచారం. సెప్టెంబర్ 28న పాకిస్తాన్ చేతిలో ఓటమి తరువాత పాకిస్తాన్ అభిమానులు.. తమ దేశ ఆటతీరుపై మండిపడుతున్నారు. కెప్టెన్ సల్మాన్ అఘా, జట్టులోని చాలా మంది ఆటగాళ్లతో పాటు వారి పేలవమైన ప్రదర్శన పై విమర్శలు గుప్పిస్తున్నారు. PCB, ACC ఛైర్మన్‌గా ఉన్న నఖ్వీ పాకిస్తాన్ ప్రభుత్వంలో కీలక మంత్రి పదవి బాధ్యతలు చేపడుతున్నాడని తెలిసిందే. ఆసియా కప్ ట్రోఫీ ప్రస్తుతం ఏసీసీ హెడ్ క్వార్టర్స్ లో లేదని.. చైర్మన్ నఖ్వీ తన కస్టడిలోనే ఉంచుకున్నట్టు తెలుస్తోంది. దుబాయ్ లో జరిగే ఏసీసీ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో ఈ అంశాన్ని లేవనెత్తుకునేందుకు బోర్డు సిద్దం అవుతున్నట్టు సమాచారం.