Bigg Boss 9 Promo: తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 కార్యక్రమం చాలా ఘనంగా ప్రారంభం అయింది. 6 మంది కామనర్స్, 9 మంది సెలబ్రిటీలు హౌస్ లోకి అడుగుపెట్టారు. ముఖ్యంగా జబర్దస్త్ , సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ను కూడా తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే సినీ సెలబ్రిటీలు భరణి శంకర్, సుమన్ శెట్టి, సంజన, ఫ్లోరా షైనీ వంటి వారిని తీసుకోగా.. సీరియల్ నటి తనూజ కూడా హౌస్ లోకి అడుగు పెట్టింది. ఇలా వీరంతా కూడా తమ పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిపరీక్ష అంటూ మొత్తం 6 మంది ఈ షో ద్వారా ఎంపికై బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు.
మొదటివారం లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ అవ్వగా.. రెండవ వారం కామనర్ మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యారు. మూడవ వారం మరో కామనర్ ప్రియా శెట్టి కూడా ఎలిమినేట్ అయింది. మరొకవైపు వైల్డ్ కార్డు ద్వారా కామనర్ దివ్యా నికిత హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు నాల్గవ వారానికి సంబంధించి ఎలిమినేషన్స్ కోసం నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు బిగ్ బాస్. అందులో భాగంగానే నిన్నటి ఎపిసోడ్ లో ఇమ్యూనిటీ టాస్క్ నిర్వహించి అందులో గెలిచిన వారికి నామినేషన్స్ నుంచి తప్పించుకునే అవకాశం కల్పించారు.
నామినేషన్స్ లో వ్యాలీడ్ లేని పాయింట్స్..
అయితే ఈరోజు టాస్కులు పెట్టి అందులో ఓడిన వారిని గెలిచినవారు నామినేట్ చేసే అవకాశం కల్పిస్తూ గేమ్స్ స్టార్ట్ చేశారు బిగ్ బాస్. అందులో భాగంగానే తాజాగా కొన్ని టాస్కులు నిర్వహించగా.. అందులో గెలిచినవారు ఓడిన వారిపై కామెంట్లు చేస్తూ నామినేట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే వీరు నామినేషన్స్ లో చెప్పిన పాయింట్స్ వ్యాలీడ్ గా లేవని ఇటు చూసే ఆడియన్స్ కి కూడా అనిపిస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ALSO READ:TV: ఘోర విషాదం..పెళ్లి పీటలెక్కకుండానే నటి కాబోయే భర్త ఆత్మహత్య!
కంటెస్టెంట్స్ మధ్య వాగ్వాదం..
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో.. ముగ్గురు వ్యక్తులు ఒక టీం గా చేరి.. రోప్ ను నడుముకు కట్టుకొని ఆ రోప్ సహాయంతో అక్కడున్న రెండు బ్లాక్స్ లో ఒక బ్లాక్ ను ముట్టుకోకుండా రోప్ సహాయంతోనే గార్డెన్ ఏరియాకు తీసుకువచ్చి అక్కడున్న ప్లాట్ఫామ్ పైన పెట్టాలి అంటూ టాస్క్ వివరిస్తారు బిగ్ బాస్. అలా ఎవరి టీం వాళ్ళు బాగానే కష్టపడినా.. చివరికి సుమన్ రాము రాథోడ్, ఫ్లోరా షైనీ, సుమన్ శెట్టి టీం గెలుస్తుంది. గెలిచినవారు ఓడిన వారిలో ఒకరిని నామినేట్ చేయాలి అని చెప్పగా.. సుమన్ శెట్టి రీతు చౌదరిని నామినేట్ చేస్తారు. అటు రాము రాథోడ్ సంజనాను నామినేట్ చేశారు.. ప్రతి గొడవలో సంజన ఉన్నారు అంటూ చెప్పాడు రాము. అటు సుమన్ రీతు చౌదరితో ఇక్కడి మాటలు అక్కడ.. అక్కడి మాటలు ఇక్కడ చెబుతూ డబుల్ గేమ్ ఆడుతున్నావంటూ కామెంట్లు చేశారు. ఇలా మొత్తానికైతే వీళ్ళు చెప్పిన పాయింట్లు నామినేట్ కి తగ్గవి కాదు అని ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.