Ind vs Pak Toss: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ గెలిచిన టీమిండియా తన ఖాతాలో 9వ టైటిల్ వేసుకుంది. ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన సూర్య కుమార్ యాదవ్ సేన…. టైటిల్ తీసుకోకుండానే ఇండియాకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే టీమిండియా విజయం సాధించడంతో పాకిస్తాన్ తీవ్ర నిరాశకు లోనైంది. ఇలాంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ సరికొత్త కుట్రలకు తెర లేపుతోంది. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ సందర్భంగా టాస్ ప్రక్రియ ఫిక్సింగ్ అయినట్లు… కొన్ని వీడియోలు వైరల్ చేస్తున్నారు పాకిస్తాన్ నెటిజన్స్. కావాలనే ఫిక్సింగ్ చేసి పాకిస్తాన్ ను ఓడించారని కూడా అంటున్నారు. టాస్ ఫిక్సింగ్ జరిగిందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా పేర్కొనడం గమనార్హం.
Also Read: Arshdeep Singh: పాకిస్థాన్ ను దారుణంగా ట్రోల్ చేసిన అర్ష్ దీప్…Final Match, What’s Happening…అంటూ
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ సందర్భంగా సూర్య కుమార్ యాదవ్ అలాగే పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ టాస్ ప్రక్రియలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇద్దరు ప్రజంటర్లు వచ్చారు. ఇందులో పాకిస్థాన్ వ్యక్తి ఒకరైతే…రవి శాస్త్రి మరొకరు. ఇక ఈ తరుణంలోనే మైక్ అందుకున్న రవి శాస్త్రి టాస్ వెయ్యాలని సూర్యకుమార్ యాదవ్ కు సూచనలు చేశారు. దీంతో టాస్ వేసిన సూర్య కుమార్ యాదవ్…. నేలపై కాయిన్ పడిపోగానే…దాన్ని చూడకుండానే తాము బౌలింగ్ తీసుకుంటామని ప్రకటించాడు. వాస్తవానికి నేలపైన పడ్డ కాయిన్ హెడ్ పడిందా? టేల్ పడిందా ? అనేది చూడకుండానే సూర్య కుమార్ యాదవ్ తాము బౌలింగ్ చేస్తామని ప్రకటించడం అనుమానలకు తావు ఇస్తోంది.
ఇక్కడే పాకిస్తాన్ కు కూడా పెద్ద అనుమానం వచ్చి పడింది. అసలు టాస్ ఏం పడిందో తెలియకుండానే సూర్య కుమార్ యాదవ్.. బౌలింగ్ తీసుకుంటానని ఎలా చెబుతాడని పాకిస్తాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీడియోలు. వాస్తవానికి పక్కనే ఉన్న రవి శాస్త్రి… సూర్య కుమార్ యాదవ్ ఇద్దరూ కలిసి టాస్ ఫిక్సింగ్ చేశారని ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఈ టోర్నమెంట్ రద్దు చేయాలని… ఆసియా కప్ ట్రోఫీని టీమిండియాకు అస్సలు ఇవ్వకూడదని కూడా పాకిస్తాన్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి అందులో ఫిక్సింగ్ జరుగలేదని టీమిండియా ఫ్యాన్స్ అంటున్నారు. సూర్య కుమార్ యాదవ్ కాన్ఫిడెంట్ తో అని ఉండొచ్చు అని కౌంటర్ ఇస్తున్నారు.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ విజేతగా టీమిండియా నిలిచినప్పటికీ…ఇంకా ట్రోఫీ అందుకోలేదు. ఏసీసీ చీఫ్ గా ఉన్న నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ట్రోఫీ అందుకోవడం ఇష్టలేక… ఖాళీ చేతులతోనే ఇండియాకు వెళ్లింది సూర్య కుమార్ యాదవ్ సేన. ఇక ఇప్పుడు టాస్ ఫిక్సింగ్ జరిగిందని పాకిస్థాన్ కొత్త డ్రామాలు ఆడుతోంది.
Also Read: Asia Cup 2025 : రింకూ సింగా మజాకా.. కార్డు పైన రాసి మరి… విన్నింగ్ షాట్ ఆడాడు.. అదృష్టం అంటే అతడిదే
See how the toss is fixed🤫
#indvspak2025#INDvPAK pic.twitter.com/UOmav4y8ho
— Muhammad Awais (@muhamma84583033) September 28, 2025