WI Vs NEP : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. చిన్న జట్లు పెద్ద జట్లను ఓడించడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. రోజు రోజుకు ఏ జట్టు ఎప్పుడూ పుంజుకుంటుందో గుర్తించలేకపోతున్నాం. ఎవ్వరిలో ఎప్పుడూ టాలెంట్ ఉంటుందో ఊహించడమే కష్టం. ఇటీవల ఆసియా కప్ 2025లో ఒమన్ జట్టు.. పాకిస్తాన్, టీమిండియా వంటి జట్లకు ముచ్చెమటలు పట్టించింది. తాజాగా నేపాల్ క్రికెట్ జట్టు కూడా వెస్టిండీస్ కి చుక్కలు చూపించడమే కాదు.. ఏకంగా టీ 20 సిరీస్ నే కైవసం చేసుకుంది. ప్రస్తుతం వెస్టిండీస్-నేపాల్ మధ్య టీ-20 సిరీస్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ లో కేవలం 19 పరుగుల తేడాతో విజయం సాధిస్తే.. రెండో మ్యాచ్ లో ఏకంగా 90 పరుగుల తేడాతో విజయం సాధించడం విశేషం.
Also Read : Chahal-Dhanashree : పెళ్లైన రెండు నెలల్లోనే అడ్డంగా దొరికిపోయాడు
ఇటీవలే తొలి టీ 20 లో వెస్టిండీస్ పై నేపాల్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఘన విజయం సాధించింది నేపాల్. దీంతో వెస్టిండీస్ జట్టుకు షాక్ ఇచ్చింది. ముఖ్యంగా దుబాయ్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన టీ-20 మ్యాచ్ లో పసికూన నేపాల్ చారిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. 90 పరుగుల తేడాతో వెస్టిండీస్ ను చిత్తు చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 173 పరుగులు చేసింది. దీంతో ఛేదనలో వెస్టిండీస్ జట్టు 83 పరుగులకే కుప్ప కూలింది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో గెలిచిన నేపాల్ 2-0 తేడాతో మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ ను కైవసం చేసుకుంది. ఫుల్ మెంబర్ టీమ్ పై నేపాల్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. దీంతో వెస్టిండీస్ జట్టుకు ఇప్పుడు కష్టకాలం మొదలైంది. వెస్టిండీస్ వచ్చే టీ-20 వరల్డ్ కప్ కి అర్హత సాధించడం చాలా కష్టం అనే చెప్పాలి.
ప్రమాదంలో వెస్టిండీస్..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నేపల్ జట్టు 173 పరుగులు చేసింది. అయితే ఓపెనర్ ఆసిఫ్ షేక్ 47 బంతుల్లో 68 పరుగులు నాటౌట్ గా నిలిచి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ కుశాల్ 2 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. మరో బ్యాటర్ సందీప్ జోరా 39 బంతుల్లో 63 పరుగులు చేశాడు. కుశాల్ మల్లా 7, గ్లూసన్ జా 6, మహ్మద్ అదిల్ అలాం 11 పరుగులు చేయడంతో నేపాల్ 173 పరుగులు చేయగలిగింది. లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ జట్టు జాసన్ హోల్టర్ 21 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక మిగతా బ్యాటర్లు అంతా విఫలం చెందడంతో కేవలం 83 పరుగులకే వెస్టిండీస్ కుప్ప కూలింది.దీంతో 90 పరుగుల తేడాతో నేపాల్ ఘన విజయం సాధించింది.వెస్టిండీస్ జట్టు ఇప్పుడు పడిందనే చెప్పాలి. టీ 20 అర్హత సాధించాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమి చెందడంతో ఇప్పుడు ఈ జట్టు అర్హత సాధిస్తుందా లేదా అనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది.