Asia Cup Trophy 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup Trophy 2025) ఫైనల్ టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో తొమ్మిదో సారి టీమిండియా చాంపియన్ గా నిలిచింది. అయితే 9 సారి ఛాంపియన్ అయిన టీమిండియా మాత్రం ఆసియా కప్ 2025 ట్రోఫీని మాత్రం దక్కించుకోలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా పాకిస్తాన్ దేశానికి చెందిన మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) ఉన్నారు. అతని చేతిలో మీదుగా ట్రోఫీ అందుకోవాల్సిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో…. దాన్ని రిజెక్ట్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India ) అలాగే టీమిండియా క్రికెట్ సభ్యులు. ఈ నేపథ్యంలో దుబాయ్ నుంచి వచ్చేసిన టీమిండియా… ట్రోఫీ లేకుండానే అడుగు పెట్టింది. ఇలాంటి నేపథ్యంలో ఆసియా కప్ 2025 ట్రోఫీని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ వైస్ చైర్మన్ ఖలీద్ అల్ జరూని ( Emirates Cricket Board Vice-Chairman Khalid Al Zarooni)… అతి త్వరలోనే ఇండియాకు అందించబోతున్నారట.
Also Read: Arshdeep Singh: పాకిస్థాన్ ను దారుణంగా ట్రోల్ చేసిన అర్ష్ దీప్…Final Match, What’s Happening…అంటూ
భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య ఇటీవల యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. రెండు బద్ధ శత్రువులుగా ఇప్పటికే ఉండగా.. యుద్ధం మరింత అగ్గి రాజేసింది. అయితే ఇలాంటి నేపథ్యంలో రెండు దేశాల మధ్య క్రికెట్ అస్సలు ఉండకూడదని మొదట అందరూ అన్నారు. కానీ ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో రెండు దేశాలు కూడా క్రికెట్ ఆడాల్సి వచ్చింది. ఈ టోర్నమెంట్లో ఏకంగా మూడుసార్లు రెండు జట్లు తలపడగా టీమిండియా మూడుసార్లు గెలిచింది. ఫైనల్స్ మొన్న ఆదివారం జరగగా అందులో కూడా టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టి ఛాంపియన్ గా నిలిచింది.
అయితే చాంపియన్ అయినప్పటికీ ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup Trophy 2025) మాత్రం దక్కించుకోలేదు టీమిండియా. దీనికి ముఖ్య కారణం ACC చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అన్న సంగతి తెలిసిందే. అయితే ట్రోఫీని తన ఇంటికి తీసుకు వెళ్లిన నఖ్వీ…. ఇండియాకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారట. తాను ఇస్తే తీసుకోవడం లేదన్న నేపథ్యంలో…. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ద్వారా అందించేందుకు సిద్ధమయ్యారట. ఇందులో భాగంగానే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్ చైర్మన్ ఖలీద్ అల్ జరూని ద్వారా టీం ఇండియాకు అందించేందుకు నిర్ణయం తీసుకున్నారట పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్, ACC చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ). అంటే త్వరలోనే…ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్ చైర్మన్ ఖలీద్ అల్ జరూని చేతుల మీదుగా ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ను టీమిండియా అందుకోనుందన్న మాట.
Also Read: Asia Cup 2025 : రింకూ సింగా మజాకా.. కార్డు పైన రాసి మరి… విన్నింగ్ షాట్ ఆడాడు.. అదృష్టం అంటే అతడిదే
Respect for Team India. They refused to take the Asia Cup trophy from Pakistani Mohsin Naqvi.
They celebrated without the trophy and Suryakumar Yadav did the Rohit Sharma celebration 🇮🇳❤️ pic.twitter.com/mqwA5e3fSv
— Rahul (@meri_mrziii) September 28, 2025