Women World Cup 2025: భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ వేటకు వేళ అయింది. ఇప్పటికే ఇంటా బయటా చాలా విజయాలు సాధించిన మహిళల జట్టుకు ఐసీసీ ప్రపంచ కప్ వెలతిగానే ఉంది. దాదాపు 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు సొంతగడ్డ పై జరిగే మెగా ఈవెంట్ లో తెరదించాలని క్రికెట్ అభిమానులు గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు. గతంలో రెండుసార్లు ఫైనల్ కి చేరుకున్నప్పటికీ టీమిండియా కి మాత్రం నిరాశ తప్పలేదు. ప్రస్తుతం భారత జట్టు చాలా మారిపోయింది. ప్రస్తుతం ప్రపంచ కప్ ను గెలిచే సత్తా ఉన్న జట్టుగా కొనసాగుతోంది. ఇక ఈ సారి భారత్ ఆతిథ్యం ఇస్తుండటంతో కాస్త సానుకూలంగా కనిపిస్తోంది.
Also Read : Chahal-Dhanashree : పెళ్లైన రెండు నెలల్లోనే అడ్డంగా దొరికిపోయాడు
ఇవాళ గువాహటిలో తొలి మ్యాచ్ భారత్, శ్రీలంక మధ్య ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లను ఫ్రీగా చూడాలంటే స్టార్స్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ లో ఉచితంగా చూడవచ్చు. భారత్, శ్రీలంక, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు ప్రపంచ కప్ కోసం పోటీ పడుతున్నాయి. రౌండ్ రాబిన్ పద్దతిలో సాగే ఈ టోర్నీలో ప్రతీ జట్టు మిగతా 7 జట్లతో ఒక్కో లీగ్ దశ మ్యాచ్ ఆడనుంది. లీగ్ దశ ముగిసిన తరువాత టాప్ 4 నిలిచే జట్లు సెమీస్ కి చేరుకుంటాయి. అక్టోబర్ 26న గ్రూపు దశ ముగుస్తుంది. అక్టోబర్ 29, 30 తేదీల్లో సెమీస్ మ్యాచ్ లు జరగనున్నాయి. నవంబర్ 02న ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఇక పాకిస్తాన్ తన మ్యాచ్ లన్నింటినీ కొలొంబో వేదికగా ఆడనుంది. ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీలో తన మ్యాచ్ లను భారత్ తటస్థ వేదిక యూఏఈలో ఆడింది.
టీమిండియానే ఫేవరేట్ గా..
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య అగ్గి వేస్తే.. భగ్గుమన్నట్టు ఉండటంతో పాకిస్తాన్ టీమిండియా కి రావడం లేదు. ఒకవేళ పాకిస్తాన్ జట్టు సెమీస్, ఫైనల్ కి చేరుకుంటే ఆ రెండు మ్యాచ్ లు కూడా కొలొంబోలోనే జరుగుతాయి. తొలి మ్యాచ్ లో భారత్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. స్మృతి మంధాన, ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, హర్మన్ ప్రీత్, దీప్తి శర్మ, రిచాలతో భారత బ్యాటింగ్ ఆర్డర్ చాలా బలంగానే కనిపిస్తోంది. రేణుక సింగ్, దీప్తి, రాధ యాదవ్, అరుంధతి రెడ్డి, శ్రీ చరణిలతో బౌలింగ్ కి ఢోకా లేదు. మరోవైపు శ్రీలంక మాత్రం కెప్టెన్ చమరి ఆటపట్టు, ఆల్ రౌండర్ కనిష్క, బ్యాటర్లు విష్మి, హర్షిత, స్పిన్నర్లు సుగంధిక, ఇనోకాలపై ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఈసారి ఎలాగైనా ప్రపంచ కప్ సాధించాలని టీమిండియా చాలా బలమైన టీమ్ తో బరిలోకి దిగుతోంది. ఈసారి మహిళా వన్డే వరల్డ్ కప్ లో తెలుగు అమ్మాయిలు అరుంధతి రెడ్డి, శ్రీచరణిలే కాదు.. తెలుగు వేదిక విశాఖపట్టణం కూడా చాలా కీలకం కానుంది. ప్రపంచ కప్ ఆతిథ్య వేదికల్లో విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం కూడా ఒకటి. ఈ స్టేడియంలో మొత్తం 5 మ్యాచ్ లు జరుగనున్నాయి. అయితే టీమిండియా ఈ స్టేడియంలో 2 మ్యాచ్ లు ఆడనుంది. అక్టోబర్ 09న సౌతాఫ్రికాతో, అక్టోబర్ 12న ఆస్ట్రైలియాతో తలపడనుంది భారత మహిళల జట్టు. ఈ సారి భారత మహిళల ప్రదర్శన ఎలా ఉంటుందో వేచి చూద్దాం.