Asian Legends League 2026: ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026 టోర్నమెంట్ (Asian Legends League 2026) ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్లు ప్రాతినిధ్యం వహించే ఈ మెగా టోర్నమెంట్ దాదాపు 12 రోజుల పాటు కొనసాగనుంది. ఇవాల్టి నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ ఆటగాళ్లకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. మహమ్మద్ హఫీజ్ సారథ్యంలోని పాకిస్తాన్ పాంథర్స్ (Pakistan Panthers ) ఆటగాళ్లకు… లీగ్ యాజమాన్యానికి మధ్య మ్యాచ్ ఫీజుల చెల్లింపు విషయంలో గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. 40 శాతం పేమెంట్ ఇస్తేనే ఈ టోర్నమెంట్ లో ఆడతామని.. పాకిస్తాన్ ఆటగాళ్లు ఫ్రాంచైజీ, ఇటు లీగ్ మేనేజ్మెంట్ కు స్పష్టం చేశారట. అప్పటి వరకు టోర్నమెంట్ ఆడేది లేదని భీస్మించుకుని కూర్చున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026 టోర్నమెంట్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్ లు జాంబియాలోని లుసాకా వేదికగా నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్ శ్రీలంక లయన్స్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ పఠాన్స్ మధ్య ఇవాళ మధ్యాహ్నం మూడున్నరకు మ్యాచ్ ఉండనుంది. ఇవాల్టి నుంచి మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ పాంథర్స్ ప్లేయర్లు నిరసనకు దిగారు.
ఈ టోర్నమెంట్ లో భాగంగా తమ ప్రయాణానికి ముందే 40 శాతం పేమెంటు ఇవ్వాల్సిందేనని పాకిస్తాన్ పాంథర్స్ జట్టుకు సంబంధించిన ప్లేయర్లు డిమాండ్ పెట్టారు. అలాగే ఆగస్టు రెండో తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్ కు కంటే ముందు 100% పేమెంటు సెటిల్ చేయాలని…ఫ్రాంచైజీ యాజమాన్యంతో పాటు లీగ్ మేనేజ్మెంట్ కు (Asian Legends League 2026 ) తేల్చి చెప్పారు. అలా అయితేనే ఈ టోర్నమెంట్ ఆడతామని కరాకండిగా చెప్పేశారు.
ఏషియన్ లెజెండ్స్ లీగ్ యాజమాన్యం దీనిపై స్పష్టమైన వైఖరితో ఉంది. టోర్నమెంట్ ప్రారంభాని కంటే ముందు 10% చెల్లింపులు చేస్తామని వెల్లడించింది. అలాగే 50% మ్యాచ్ ఫీజు బదిలీ చేస్తామని వివరించింది. మిగిలిన 50 శాతం తర్వాత ఇస్తామని ఆటగాళ్లను ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. అయినప్పటికీ పాకిస్తాన్ పాంథర్స్ జట్టు ప్లేయర్స్ తగ్గడం లేదు. తమ డిమాండ్ ప్రకారం ముందుగానే 40 శాతం పేమెంట్ సెటిల్మెంట్ చేయాలని కోరుతున్నారు. రెండు రోజుల తర్వాత ఫుల్ పేమెంట్ చేయాల్సిందేనని డిమాండ్ పెట్టారు. దీంతో ఏషియన్ లెజెండ్స్ లీగ్ యాజమాన్యం తల పట్టుకుంటోంది. అంతేకాదు యాజమాన్యం దిగిరాకపోతే, ఈ టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ పాంథర్స్ తప్పుకునే ఛాన్స్ కూడా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026 టోర్నమెంట్ ఇవాల్టి నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు కొనసాగునుంది. రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లు ఇందులో పాల్గొంటారు. ఇండియన్ రాయల్స్, పాకిస్తాన్ పాంథర్స్, శ్రీలంక లయన్స్, బంగ్లాదేశ్ టైగర్స్, ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్ అలాగే ఏషియన్ స్టార్స్ తలపడతాయి. ఈ మ్యాచ్ లను ఇండియాలో ఫ్యాన్ కోడ్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా చూడవచ్చు.
Also Read: Trolls On Virat Kohli: లండన్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవమానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !