Irfan Pathan Counter To Mohsin Naqvi : ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Women’s Asia Cup 2026 Tournament) ఉత్కంఠ భరితంగా సాగగా.. ఫైనల్స్ లో అందరు ఊహించినట్లుగానే టీమిండియా ఉమెన్స్ టీం ( Women’s Team India) గెలిచింది. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఫైనల్స్ మ్యాచ్ లో శ్రీలంకను చిత్తు చేసి.. 8వ సారి ఛాంపియన్ గా నిలిచింది ఉమెన్స్ టీమ్ ఇండియా. అయితే గెలిచిన సుఖం మాత్రం టీం ఇండియాకు దక్కలేదు. ఆసియా కప్ తీసుకోకుండానే ఇండియా ఫ్లైట్ ఎక్కింది ఉమెన్స్ టీం. ఇదే అలుసుగా తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi) … ఆసియా కప్ 2026 ట్రోఫీని దొంగలించాడు. 2025 ఆసియా కప్ సమయంలో ట్రోఫీని తీసుకు వెళ్లినట్లుగానే.. సేమ్ సీన్ రిపీట్ చేశాడు.
ఆసియా కప్ 2026 ట్రోఫీని మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకోకూడదని ఉమెన్స్ టీమ్ ఇండియా వెనకడుగు వేసింది. బీసీసీఐ ఆదేశాలు ఇచ్చిన ప్రకారం, మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi) ని ఘోరంగా అవమానిస్తూ.. టైటిల్ తీసుకోలేదు. అయితే ఈ అంశంపై తాజాగా ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మొహ్సిన్ నఖ్వీ చెంప చెల్లుమనేలా బిసిసిఐ చేసిందని ప్రశంసించారు. 2025లో మొహ్సిన్ నఖ్వీని అవమానించినట్లుగానే.. ఈ సారి అవమానించి భారతదేశ పరువు కాపాడారని వెల్లడించారు.
పహల్గామ్ సంఘటనలో అన్యాయంగా భారతీయ యాత్రికులను చంపిన పాకిస్తాన్ కు ఇలాంటి బుద్ధి చెప్పాల్సిందేనని ఫైర్ అయ్యారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు తీయాల్సిందేనని.. బీసీసీఐ తాజాగా చేసిన పని కూడా అద్భుతమని ప్రశంసనీయమని తెలిపారు. ట్రోఫీ ఇండియాకు రాకున్నా పర్వాలేదు.. కానీ ఆ దుర్మార్గుడి చేతి ద్వారా తీసుకోవడం కరెక్ట్ కాదన్నారు. దీంతో ఆసియా కప్ ట్రోఫీ వివాదంపై ఇర్ఫాన్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ టీమిండియా గెలిచింది. అయితే మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi) చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకుండానే ఇండియాకు ( Team India) వచ్చేసింది టీమిండియా ఉమెన్స్ టీం. అయితే, టీమిండియా వెళ్లిపోయిన నేపథ్యంలో ట్రోఫీని మాత్రం తన వద్దే పెట్టుకున్నాడు మొహ్సిన్ నఖ్వీ. దీనిపై కమ్రాన్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ లో మగాడు అంటే మొహ్సిన్ నఖ్వీ ఒక్కడేనని… మరోసారి 150 కోట్ల భారతీయులను ఏడిపించాడని ప్రశంసించారు. ఎంత గింజకున్నా ఇండియాకు ట్రోఫీ ఇవ్వకూడదని వెల్లడించారు.