E-Paper
Advertisement

ఆడు మగాడ్రా బుజ్జి…ట్రోఫీ దొంగిలించి 150 కోట్ల భారతీయులను ఏడిపించాడు !

ఆడు మగాడ్రా బుజ్జి…ట్రోఫీ దొంగిలించి 150 కోట్ల భారతీయులను ఏడిపించాడు !
Advertisement

Kamran Akmal On Mohsin Naqvi:  ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Women’s Asia Cup 2026 Tournament) విజేతగా టీమిండియా నిలిచింది. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (Dubai International Cricket Stadium, Dubai) వేదికగా శ్రీలంక ఉమెన్స్ వర్సెస్ టీమ్ ఇండియా ఉమెన్స్ (India Women vs Sri Lanka Women, Final,) మధ్య ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ జరిగింది. ఇందులో అన్ని విభాగాల్లో రాణించిన టీమిండియా ఉమెన్స్ టీం, 72 పరుగుల తేడాతో విజయం సాధించి ఛాంపియన్ అయింది.

ఇప్పటికే 7 ట్రోఫీలు అందుకున్న టీమిండియా.. నిన్నటి విజయంతో ఎనిమిదవ ట్రోఫీ కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడ దురదృష్టం ఏంటంటే, మొహ్సిన్ నఖ్వీ (ACC Chair Mohsin Naqvi )కారణంగా మరోసారి ట్రోఫీని తీసుకోకుండానే ఉమెన్స్ టీమిండియా, దుబాయ్ నుంచి వచ్చేసింది. ఈ సంఘటనపై రక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ట్రోఫీ తీసుకుంటే బాగుండని కొందరు అంటుంటే, ట్రోఫీ వదిలేసిందే బెటర్ అని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.

ఆడు మగాడ్రా బుజ్జి…ట్రోఫీ దొంగిలించి 150 కోట్ల భారతీయులను ఏడిపించాడు !

Advertisement

ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ట్రోఫీని టీమిండియా ఉమెన్స్ టీం అందుకోకుండా ఇండియాకు రావడం పై, పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ (ACC Chair Mohsin Naqvi ) చేసిన పనిని ప్రశంసిస్తూ.. ఇండియాను కించపరిచేలా మాట్లాడారు. ట్రోఫీ ఇవ్వకుండా, టీమిండియా కు తగిన బుద్ధి చెప్పాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి కాదు రెండు సార్లు 150 కోట్ల భారతీయులను మొహ్సిన్ నఖ్వీ ఏడిపించాడని అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు.

Womens Asia Cup 2026 Finals IND VS SL: శ్రీలంక ఓటమి..8వ సారి ఆసియాకప్ ఛాంపియన్​గా టీమిండియా, ప్రైజ్ మనీ ఎంత అంటే

Advertisement

మొహ్సిన్ నఖ్వీ ఆరా వేరే లెవెల్ లో ఉందని.. అతని చర్యల వల్ల ఇప్పుడు భారతీయులు మొత్తం బాధపడాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. అతడు ఇలాగే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా సూర్య కుమార్ యాదవ్ తో పాటు హార్మన్ ప్రీత్ కౌర్ ఇద్దరు కలిసి వచ్చి మొహ్సిన్ నఖ్వీ దగ్గర ఉన్న ట్రోఫీలు తీసుకు వెళ్ళవచ్చని చురకలు అంటించారు. దీంతో ఆసియా కప్ 2026 ట్రోఫీపై కమ్రాన్ అక్మల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

BCCI ఆదేశాలను పాటించిన ఉమెన్స్ టీమిండియా

బీసీసీఐ ఆదేశాల మేరకు మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన ట్రోఫీని ఉమెన్స్ టీమిండియా జట్టు తీసుకోలేదు. ట్రోఫీ తీసుకోకుండానే ఇండియా ఫ్లైట్ ఎక్కేసింది జట్టు. 2025 టోర్నమెంట్ సందర్భంగా కూడా సూర్య కుమార్ యాదవ్ ఇలాగే చేశాడు. అంటే రెండు ట్రోఫీలు కూడా ఇప్పుడు మొహ్సిన్ నఖ్వీ ఆఫీస్ లోనే ఉన్నాయి. పహాల్గమ్ ఘటన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Why was Vande Mataram played ahead of India vs Afghanistan 1st T20I: అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి..తెరపైకి వందేమాతరం వివాదం !

Related News

ట్రోఫీతో కారులో మొహ్సిన్ నఖ్వీ పరార్…వెంటాడిన టీమిండియా ఫ్యాన్స్

BCCIకి అసలు సిగ్గుందా ? మొహ్సిన్ నఖ్వీతో దేవజిత్ సైకియా మీటింగ్ పై ట్రోలింగ్

సూర్య బాటలోనే హర్మన్‌ప్రీత్ కౌర్…మొహ్సిన్ న‌ఖ్వీని మరోసారి ఛీ కొట్టిన టీమిండియా

శ్రీలంక ఓటమి..8వ సారి ఆసియాకప్ ఛాంపియన్​గా టీమిండియా, ప్రైజ్ మనీ ఎంత అంటే

అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి..తెరపైకి వందేమాతరం వివాదం !

పాకిస్తాన్ జట్టుకు భారతీయుల దిష్టి తగిలింది..అందుకే ఓడిపోతోంది

రాజస్థాన్ ను వదిలేసి LSGలోకి వచ్చేయ్.. నా ఆస్తులు రాసి ఇస్తా !

Big Stories

Advertisement
×