Mohsin Naqvi On Asia Cup 2026: ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా టీమిండియా ఉమెన్స్ వర్సెస్ శ్రీలంక మహిళల జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అద్భుతంగా రాణించిన ఉమెన్స్ టీమ్ ఇండియా, 72 పరుగుల తేడాతో విజయం సాధించి ఎనిమిదో సారి ఛాంపియన్ గా నిలిచింది. అయితే, ఛాంపియన్ అయిన తర్వాత ఆసియా కప్ 2026 ట్రోఫీని అందుకోకుండా ఇండియా ఫ్లైట్ ఎక్కేసింది మహిళల జట్టు. దీంతో సోషల్ మీడియాలో రక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. టైటిల్ తీసుకొని వస్తే, బాగుండు అని కొంతమంది అంటుంటే, మరికొంతమంది మాత్రం టైటిల్ వదిలేయడం మంచి పని అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీలు మాత్రం ఇండియాను దోషిగా చూపిస్తూ రెచ్చిపోతున్నారు.
ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ ముగిసిన నేపథ్యంలో మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi) పై ఇండియన్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. మొహ్సిన్ నఖ్వీ గజదొంగ అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ ట్రోలింగ్ పై తాజాగా మొహ్సిన్ నఖ్వీ స్పందించారు. టీమిండియా క్రికెటర్లకు ట్రోఫీ అందించాలని తనకు కూడా ఉందని వెల్లడించారు. హర్మన్ ప్రీత్ కౌర్ వచ్చి టైటిల్ తీసుకుంటుందని చాలాసేపు.. వేచి చూశానని గుర్తు చేశారు. కానీ, బిసిసిఐ ఆదేశాల మేరకు చాలా దౌర్జన్యంగా టీమిండియా మహిళల జట్టు వ్యవహరించిందని ఫైర్ అయ్యారు. ఎంతసేపు వెయిట్ చేసినా కూడా, కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ రాకపోవడంతో.. తాను అక్కడ నుంచి వచ్చేసానని వివరించారు.
ACC చైర్మన్ హోదాలో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తన మాట వినాల్సిందేనని.. తన చేతిలో మీదుగానే ట్రోఫీ తీసుకోవాలన్నారు. అదే ప్రోటోకాల్ అంటూ గుర్తు చేశారు. రాజకీయాల్లో ఉన్నట్లుగానే.. ఇక్కడ కూడా ప్రోటోకాల్ ఉంటుందని, ఈ విషయాన్ని బీసీసీఐ తెలుసుకోవాలని హితువు పలికారు. ఇప్పటికైనా ఆసియా కప్ ట్రోఫీ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సూర్య కుమార్ యాదవ్, హర్మన్ ప్రీత్ కౌర్ ఇద్దరు కలిసి తన ఆఫీసుకు రావాలని సూచనలు చేశారు. ఇద్దరు కలిసి వస్తే వాళ్లకు ట్రోఫీ అప్పగిస్తానని ప్రకటన చేశారు.
ఇందులో ఎలాంటి దాపరికం లేదని వ్యాఖ్యానించారు. ఇంకా ఆరు నెలలకు వచ్చినా కూడా ట్రోఫీ ఇస్తానని వివరించారు. ఇది ఇలా ఉండగా.. ఆసియా కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో బీసీసీఐ ఆదేశాల మేరకు మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకునేందుకు వెనుకాడింది ఉమెన్స్ టీమ్ ఇండియా. పహల్గాం సంఘటన నేపథ్యంలో.. పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదు ఇండియన్ క్రికెటర్లు. ఇటు ట్రోఫీ కూడా తీసుకోవడం లేదు.