ICC slaps Pakistani players with big fines: పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ (West Indies vs Pakistan) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ (Pakistan tour of West Indies, 2026 ) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ నేపథ్యంలో జూలై 25వ తేదీన మొదటి టెస్ట్ ప్రారంభమైంది. ఇందులో అద్భుతంగా రానించిన వెస్టిండీస్.. 90 పరుగుల తేడాతో పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించడం జరిగింది. అయితే ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్ జట్టుకు మరో ఊహించని తగిలింది. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు ఖుర్రం షెహజాద్, మహమ్మద్ అబ్బాస్ ఇద్దరు పై ఫైన్లు విధించడమే కాకుండా క్రమశిక్షణ చర్యలకు దిగింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ఐసీసీ బాస్ జై షా కావాలనే ఈ చర్యలకు పాల్పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి.
Also Read : టెస్ట్ ప్లేయర్ అంటూ ట్రోల్స్..ఇచ్చిపడేసిన తిలక్..రెండో టీ20లోనూ టీమిండియా విజయం
వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ (West Indies vs Pakistan) మధ్య బ్రియన్ లారా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ( Brian Lara Stadium, Tarouba, Trinidad) వేదికగా తొలి టెస్ట్ జరిగింది. అయితే ఇందులో ఓవరాక్షన్ చేసిన పాకిస్తాన్ బౌలర్ల తోక కట్ చేశారు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షులు జై షా ( ICC Jay Shah). పాక్ బౌలర్లు ఖుర్రం షెహజాద్ (Khurram Shehzad), మహమ్మద్ అబ్బాస్ (Muhammad Abbas ) ఇద్దరు కూడా వెస్టిండీస్ బ్యాటర్లను ఔట్ చేసిన తర్వాత ఓవరాక్షన్ చేశారు. దీంతో క్రమశిక్షణ చర్యలకు జై షా సిద్ధమయ్యారు.
ఖుర్రం షెహజాద్ పైన 15% జరిమానా విధించడం ఏ కాకుండా ఒక డీమెరిట్ పాయింట్ చేర్చింది ఐసీసీ. అటు మహమ్మద్ అబ్బాస్ కు వార్నింగ్ ఇచ్చింది. అలాగే అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఐసీసీ బాస్ జై షా పైన దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. వెస్టిండీస్ క్రికెటర్లు తప్పులు చేస్తే పట్టించుకోని జై షా, కేవలం పాకిస్తాన్ బౌలర్ల పైన వేటు వేశాడని ఫైర్ అవుతున్నారు. కావాలనే పాకిస్తాన్ ను టార్గెట్ చేసి ఇలా చేసినట్లు ఆగ్రహిస్తున్నారు.
పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరిగిన నేపథ్యంలో బాబర్ ఆజం సేన దారుణంగా ఓడిపోయింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెస్టిండీస్ గెలిచేలా మైదానాన్ని తయారు చేశారని ఆరోపణలు చేశారు. అందుకే పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయిందని వివరించారు. దీనంతటికి కారణం వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో పాటు ఐసీసీ అంటూ ఆరోపణలు చేశారు. జై షా కుట్ర ఇందులో కచ్చితంగా ఉందని బాంబు పేల్చారు.
Also Read : టెస్ట్ ప్లేయర్ అంటూ ట్రోల్స్..ఇచ్చిపడేసిన తిలక్..రెండో టీ20లోనూ టీమిండియా విజయం
🚨 PAKISTANI PACERS PENALIZED 🚨
– Khurram Shehzad has been penalized 15% of his match fee + 1 demerit point.
– Muhammad Abbas has received an official reprimand + 1 demerit point.
Both the fast bowlers have been penalised by ICC for aggressive celebrations after dismissing… pic.twitter.com/i89iP40Skc
— Rayham. (@RayhamUnplugged) July 29, 2026