BigTV English

Australia vs Pakistan : ఆస్ట్రేలియాతో.. పోరాడి ఓడిన పాకిస్తాన్

Australia vs Pakistan : ఆస్ట్రేలియాతో.. పోరాడి ఓడిన పాకిస్తాన్
Australia vs Pakistan

Australia vs Pakistan : వన్డే వరల్డ్ కప్ 2023లో ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఎందుకంటే రెండు జట్లకి తప్పనిసరిగా గెలుపు కావాలి. ఈ నేపథ్యంలో  బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ హోరాహోరీగా కాకపోయినా ఇంచుమించు అదే రీతిలో సాగింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 368 భారీ పరుగుల లక్ష్యాన్ని చేధించలేక పాకిస్తాన్ 305 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 62 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. కాకపోతే మ్యాచ్ అయితే అంత తేలిగ్గా మాత్రం ఆస్ట్రేలియాకు దక్కలేదు. పాకిస్తాన్ పోరాడి ఓడిందనే చెప్పాలి.


టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ మొదట్లో ఆచితూచి ఆడారు. తర్వాత పాకిస్తాన్ ఫీల్డింగ్ వైఫల్యాలు ఆస్ట్రేలియా పాలిట వరంగా మారాయి. నెమ్మదిగా వీళ్లు జూలు విదిల్చారు. డేవిడ్ వార్నర్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 124 బంతుల్లో 163 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ 121 పరుగులతో సెంచరీ చేశాడు. ఇద్దరూ కలిసి చెరో 9 సిక్సర్లు అంటే 18 సిక్సర్లు కొట్టారు.

వీరిద్దరినీ విడదీయడానికి పాక్ కెప్టెన్ బాబర్ ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలించలేదు. ఎట్టకేలకు 33వ ఓవర్ లో షహీన్ ఆఫ్రిది వీరి  భాగస్వామ్యాన్ని విడదీశాడు. అలా మార్ష్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 259 పరుగులుగా ఉంది.


ఇక అక్కడ నుంచి పాక్ బౌలర్లు విజృంభించారు. ఎక్కడా ఆస్ట్రేలియా బ్యాట్స్ మేన్ ని క్రీజులో కుదురుకోనివ్వలేదు. వచ్చినవాళ్లని వచ్చినట్టుగానే వెనక్కి పంపించారు. మాక్స్ వెల్ (0), స్టీవ్ స్మిత్ (7) వికెట్లు పడ్డాయి. ఈ క్రమంలో 42.2 ఓవర్ లో డేవిడ్ వార్నర్  వికెట్ తీసుకున్నారు. అప్పటికి స్కోరు 4 వికెట్ల నష్టానికి 325 పరుగులుగా ఉంది. తర్వాత 42 పరుగులకు మిగిలిన 6 వికెట్లు పడిపోయాయి. 367 పరుగుల వద్ద ఆస్ట్రేలియా శాంతించింది.

పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది పొదుపుగా బౌలింగ్ చేయడమే కాదు 5 వికెట్లు కూడా తీసుకున్నాడు. రవూఫ్ కు 3, ఉసామా మిర్ కి ఒక వికెట్టు దక్కింది.

అతి పెద్ద ఛాలెంజ్ గా మారిన ఛేజింగ్ చేయడానికి పాక్ ఓపెనర్లు వచ్చారు. వారు చాలా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశారు. ముందే అందరికీ అర్థమైపోయింది. ఇది పాక్ వల్ల కాదని డిసైడ్ అయ్యారు. కాకపోతే ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్, ఇమాముల్ హక్ మాత్రం లక్ష్యాన్ని చూసి బెదరకుండా బ్యాటింగ్ చేశారు. మంచి బిగినింగ్ ఇచ్చారు. 21 ఓవర్ల వరకు వికెట్టు పడలేదు.

అప్పుడు 134 పరుగుల వద్ద తొలి వికెట్టు రూపంలో అబ్దుల్లా షఫీక్ (64) అవుట్ అయ్యాడు. తర్వాత కాసేపటికి కాన్ఫిడెంట్ గా ఆడుతున్న మరో ఓపెనర్ ఇమాముల్ హక్ (70) అవుట్ అయ్యాడు. ఇద్దరు కూడా స్టొయినిస్ బౌలింగ్ లోనే అవుట్ అయ్యారు. తర్వాత మ్యాచ్ నిలబెడతాడు, పికప్ తీసుకుంటాడని అనుకున్న కెప్టెన్ బాబర్ (18) అనూహ్యంగా పెవిలియన్ చేరాడు. అప్పటికి  3 వికెట్ల నష్టానికి 175 పరుగులతో పాకిస్తాన్ పటిష్టంగానే ఉంది. 26 ఓవర్లు మాత్రమే అయ్యాయి.

ఆ తర్వాత బాధ్యతను రిజ్వాన్ భుజాల మీద వేసుకున్నాడు. అయితే షకీల్ (30) క్రీజులో ఉన్నంతవరకు పాక్ వైపే విజయం మొగ్గు చూపింది. అతడు అవుట్ అయ్యాక మళ్లీ ఒడిదుడుకులకు లోనైంది పాక్. తర్వాత ఇఫ్తికార్ అహ్మద్ వచ్చాడు. తను ముందుకు నడిపిస్తాడని అంతా అనుకున్నారు. ఎందుకంటే తను హార్డ్ హిట్టర్. అతను క్రీజులో ఉంటే ఎంత పెద్ద లక్ష్యమైనా క్షణాల్లో చిన్నదైపోతుంది. ఇక్కడ కూడా అదే రిపీట్ అయ్యింది. వచ్చి రాగానే ఫట్ ఫట్ మని మూడు సిక్స్ లు కొట్టాడు. అదే ఊపులో ఉండగా జంపా బౌలింగ్ లో ఎల్బీగా అవుట్ అయి వెనుతిరిగాడు.

ఇక అక్కడ నుంచి జంపా మ్యాజిక్ రిపీట్ అయ్యింది. తర్వాత ఓవర్ లో రిజ్వాన్ ను వెనక్కి పంపాడు. అలా పాక్ నడ్డి విరిచేశాడు. చివరకు 45.3 ఓవర్లలో 305 పరుగుల వద్ద పాక్ కథ ముగిసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో జంపా నాలుగు వికెట్లు తీశాడు. కమిన్స్, స్టొయినిస్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. స్టార్క్, హేజిల్ వుడ్ లకు ఒకొక్క వికెట్టు దక్కాయి. ఈ విజయంతో ఆస్ట్రేలియా టాప్ ఫోర్ లోకి వెళ్లింది. రేస్ లో నేనూ ఉన్నానని చెప్పింది. పాకిస్తాన్ ఒక అడుగు వెనక్కి వేసి ఐదో స్థానంలోకి వెళ్లింది.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×