BigTV English

ASU vs PAK : ఆ క్యాచ్.. పాక్ కొంప ముంచిందా?

ASU vs PAK :  ఆ క్యాచ్.. పాక్ కొంప ముంచిందా?
ASU vs PAK

ASU vs PAK : ఆ క్యాచ్ నేల పాలు చేయడమే పాకిస్తాన్ కొంప ముంచిందా? అంటే అంతా అవుననే అంటున్నారు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా జరిగిన ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మ్యాచ్ లో నేలపాలైన ఒక క్యాచ్ గురించే సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏమిటా క్యాచ్ కథ అనుకుంటున్నారా..


బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో మొదట టాస్ ఓడి ఆస్ట్రేలియా బ్యాటింగ్ కి వచ్చింది. ప్రమాదకర ఓపెనర్ గా పేరున్న డేవిడ్ వార్నర్ కి తోడు మిచెల్ మార్ష్ వచ్చాడు. అయితే అప్పుడు వార్నర్ 10 పరుగులతో ఆడుతున్నాడు. 5వ ఓవర్ నడుస్తోంది. షాహిన్ ఆఫ్రిది బౌలింగ్ లో వార్నర్ బాల్ ను గాల్లోకి లేపాడు. అయితే మిడ్ ఆఫ్ లో ఉన్న ఉసామా మిర్ చేతుల్లో పడిన బాల్ ను.. పుసుక్కున జార వదిలేశాడు. అది మ్యాచ్ భవిష్యత్తునే మార్చేసింది. అయితే ఇది ఉసామా మిర్ ఆరంగ్రేటం మ్యాచ్.

దీని ముందు చిన్న కథ ఉంది. ఆస్ట్రేలియా జట్టులోకి వార్నర్ ను తీసుకుందామా? లేదా అనే మీమాంసలో బోర్డు తర్జనభర్జన పడింది. ఎందుకంటే తను వరుస వైఫల్యాలతో ఉన్నాడు.అంతేకాదు 36 ఏళ్లు వచ్చేశాయి. కాకపోతే 2015, 2019 వరల్డ్ కప్ ల్లో వార్నర్ కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఆ ఒక్క కారణంతోనే ఈసారి అవకాశం ఇచ్చారు. అలా దొరికిన అవకాశాన్ని, అలాగే బ్యాటింగ్ లో వచ్చిన లైఫ్ ను తీసుకుని రెచ్చిపోయాడు. 124 బాల్స్ లో 163 పరుగులు చేశాడు. 9 సిక్స్ లు, 14 ఫోర్లు ఎడాపెడా బాదేశాడు. సెంచరీ చేసిన తర్వాత తగ్గేదేలే.. అంటూ అల్లు అర్జున్ స్టయిల్ లో సింబాలిక్ గా చెప్పడంతో స్టేడియం హోరెత్తిపోయింది.


ప్రపంచకప్ మ్యాచ్ ల్లో అంతకు ముందు రెండుసార్లు 178, 166 పరుగులు తన పేరు మీదే ఉండటం విశేషం. అలా 5వ ఓవర్ లో వచ్చిన లైఫ్ తో 43 ఓవర్ల వరకు క్రీజులో ఉన్నాడు. 163 పరుగులు చేశాడు. పాకిస్తాన్ బౌలింగ్ ను ధనాధన్ ఉతికి ఆరేశాడు.

అయితే పాకిస్తాన్ తరఫున ఆరంగ్రేటం చేసిన ఉమర్ మిర్ కి ఈరోజు మ్యాచ్ చేదు జ్నాపకంగా మిగిలిపోతుంది. అంతేకాదు బౌలింగులో కూడా పెద్ద ప్రభావం చూపించలేదు. 10 ఓవర్లు వేసి 82 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్టు తీసుకున్నాడు. ప్రపంచకప్ టోర్నీలో 80 పరుగులకన్నా ఎక్కువ ఇచ్చిన బౌలర్లలో ఒకడిగా నిలిచాడు.

మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ మాట్లాడుతూ ఆ క్యాచ్ డ్రాప్ చేయడం ఓటమికి ప్రధాన కారణమని తేల్చి చెప్పాడు. అయితే పాకిస్తాన్ ఫీల్డింగ్ వైఫల్యాలు వరల్డ్ కప్ లో వెంటాడుతున్నాయి. బౌండరీ లైను దగ్గర కూడా ఫోర్లు ఆపలేక ఇబ్బందులు పడ్డారు. అదే  ఆస్ట్రేలియన్లు ఫోరు వచ్చేదగ్గర ఒకటి, రెండు చొప్పున ఇచ్చారు. కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్టు పాకిస్తాన్ ఓటమికి ఎన్నో కారణాలున్నాయి. కాకపోతే ఈరోజు ఒమర్ మిర్ బలైపోయాడు. అదే వార్నర్ వెంటనే అవుట్ అయిపోయి, మ్యాచ్ ఓడిపోయినా అంత బాధ ఉండేది కాదు. మొత్తానికి డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ కి దగ్గరగా ఉండి..కొత్తగా వచ్చిన పాకిస్తాన్ క్రీడాకారుని భవిష్యత్తుకి పరీక్ష పెట్టాడు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×