BigTV English

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Free Hit  : సాధారణంగా క్రికెట్ లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎక్స్ ట్రాల రూపంలో బౌలర్లు పరుగులను సమర్పించుకుంటారు. అందులో నో బాల్, వైడ్ బాల్, బ్యాట్స్ మెన్ కి బంతి తగలకున్నప్పటికీ కీపర్ మిస్ చేయడం వల్ల లెగ్ బైస్ కింద పరుగులు వస్తుంటాయి. మరోవైపు బ్యాట్స్ మెన్ బంతిని కొట్టినప్పుడు ఫీల్డర్ మిస్ ఫీల్డింగ్ చేస్తే.. మళ్లీ పరుగులు తీయడం ఇలాంటివి చాలా ఎక్స్ ట్రాల కిందికి వస్తాయి. అయితే ఇప్పటికే నో బాల్ కి ఫ్రీ హిట్ ఇస్తుంటారు. అలాగే ఇక నుంచి వైడ్ బాల్ కి కూడా ఫ్రీ హిట్ ఇవ్వాలని కొంత మంది డిమాండ్ చేస్తున్నారు. అదికూడా అమలు కానున్నట్టు తెలుస్తోంది.


Also Read : Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

అది కూడా అమలు కానుందా..? 


వాస్తవానికి ఫ్రీ హిట్ అనేది ఓ ప్రత్యేకమైన బంతి అనే చెప్పవచ్చు. బౌలర్ నో బాల్ వేసినప్పుడు ఆ తరువాత వేసే బంతిని ఫ్రీ హిట్ అంటారు. అయితే ఈ బంతికి బ్యాటర్ బౌల్డ్ అయినా, క్యాచ్ ఔట్ అయినా ఉండదు. బ్యాటర్ ను రనౌట్, బంతిని రెండు సార్లు కొట్టడం ఫీల్డింగ్ అడ్డుకోవడం ద్వారా మాత్రమే ఔట్ చేయగలరు. ఇతర ఏవిధంగా ఔట్ అయినా.. అది ఔట్ కానట్టే లెక్క. బౌల్డ్, క్యాచ్, లెగ్ బిఫోర్ వికెట్(LBW) వంటి సాధారణ ఔట్ పద్దతులు ఫ్రీ హిట్ బంతికి వర్తించవు. ఫ్రీ హిట్ ముఖ్యంగా టీ-20, వన్డే మ్యాచ్ ల్లో కనిపిస్తుంది. బౌలర్ నో బాల్ వేసినప్పుడే ఫ్రీ హిట్ లభిస్తుంది. సాధారణంగా బౌలర్ క్రీజు దాటి బంతి విసిరినప్పుడు లేదా బంతి నముము కంటే ఎత్తులో పుల్ టాస్ విసిరినప్పుడు నోబాట్ అవుతుంది. రనౌట్, బంతిని రెండు సార్లు కొట్టడం, ఫీల్డింగ్ అడ్డుకోవడం వంటి వాటి ద్వారానే బ్యాట్స్ మెన్ ఔట్ అవుతాడు.

ఫ్రీ హిట్.. వైడ్ కి కూడా  

తాజాగా వైడ్ బాల్ కి కూడా ఫ్రీ హిట్ ఇవ్వాలని జేక్ ఫ్రెజర్ డిమాండ్ చేస్తున్నాడు. ఆస్ట్రేలియా కి చెందిన ఓ యువ క్రికెట్ ఆటగాడు. కుడిచేతి వాటం బ్యాట్స్ మెన్. అలాగే కుడిచేతి లెగ్ స్పిన్ బౌలర్. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ప్రధానంగా ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం ఈ ఆస్ట్రేలియా యువ ఆటగాడే కాదు.. చాలా మంది ఆటగాళ్లు కోరుకుంటున్నారు. కానీ అది బహిరంగంగా బయట పెట్టడం లేదని సమాచారం. ప్రస్తుతం వైడ్ బాల్ తరువాత ఫ్రీ హిట్ ఇవ్వడం లేదు. దానిని కూడా అమలు చేసేందుకు ఎవ్వరి మనస్సులో ఏమి ఉంటే వాళ్లు చర్చలు చేసుకుంటున్నారు. ఫ్రీ హిట్ వల్ల బ్యాటర్లకు ధైర్యం ఉంటుంది. బౌలర్లు కూడా నో బాల్ లేదా వైడ్ బాల్ పడితే మరో బంతి వేయాల్సి వస్తుందనే భయం ఉంటుంది. అందుకే ఫ్రీ హిట్ తో బ్యాటర్ కి కలిసి వస్తుంది. 

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×