Sanju Samson : ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ టీమ్ మారబోతున్నట్టు గత కొద్ది రోజు నుంచి వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి వెళ్తాడని.. ఇప్పటికే మేనేజ్ మెంట్ కి చెప్పాడని రకరకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. తాజాగా మరోవార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడాలని సంజూ శాంసన్ నిర్ణయించుకోవడానికి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకి ఓపెనర్ గా దిగిన అతను విధ్వంసం సృష్టించాడు. సంజూ శాంసన్ గాయం కారణంగా వైభవ్ ఓపెనింగ్ బ్యాటింగ్ కి వచ్చాడు. అయితే ఇకపైన వైభవ్ సూర్యవంశీనే ఓపెనర్ గా కొనసాగించాలని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం నిర్ణయించుకుదని సమాచారం.
Also Read : Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్
శాంసన్ కి ఓపెనింగ్ లో అడ్డంకి..
ఈ నిర్ణయంతో అప్పటి వరకు యశస్వీ జైస్వాల్ తో కలిసి ఓపెనింగ్ చేసిన సంజూ శాంసన్ కి మొండిచేయి ఎదురైంది. అందుకే అతను జట్టునీ వీడాలనుకుంటున్నట్టు సమాచారం. గతంలో సంజు శాంసన్, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం మధ్య అద్భుతమైన అవగాహన ఉండేది. గత మెగా వేలంలో జోస్ బట్లర్ ను కూడా వదులుకోవడానికి సంజుశాంసన్ ఓపెనింగ్ చేయాలనే ఆసక్తి ఒక కారణం అని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. వాస్తవానికి 2025 ఐపీఎల్ సీజన్ కి ముందు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడంలో సంజూ శాంసన్ కి పెద్ద పాత్ర ఉండేది. కానీ ఇప్పుడు అతని మాట వినబడటం లేదని.. జట్టులో తన ప్రాముఖ్యత తగ్గిందని సంజు శాంసన్ భావిస్తున్నాడని ఆకాశ్ చోప్రా అభిప్రాయ పడ్డారు.
అంతా ఆ కుర్రాడి వల్లే..
వైభవ్ సూర్యవంశీ ఒక ఓపెనర్ గా జట్టులోకి రావడం వల్ల ఇప్పటికే ఓపెనింగ్ లో యశస్వి జైస్వాల్ ఉన్నాడు. దీంతో సుంజూ శాంసన్ కి ఓపెనింగ్ అవకాశాలు తగ్గుతాయి. అదేవిధంగా ధ్రువ్ జురెల్ ను కూడా టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయించాలని జట్టు కోరుకుంటుంది. ఈ కారణాల వల్ల శాంసన్ జట్టులో అదనపు ఆటగాడిగా మారిపోయారని ఆకాశ్ చోప్రా భావిస్తున్నారు. 2025 సీజన్ లో సంజు శాంసన్, రాజస్థాన్ రాయల్స్ మధ్య విభేదాలు తలెత్తాయి. గాయాలు, ఇతర కారణాల వల్ల సంజూ శాంసన్ కి తక్కువ మ్యాచ్ లలోనే అవకాశం లభించింది. ఈ పరిణామాలుకూడా అతనికి సంతృప్తికి కారణం అవ్వొచ్చు. మరోవైపు రాజస్తాన్ రాయల్స్ తో ప్రయాణం ఎప్పుడూ గొప్పగా సాగిందని.. ఎప్పటికీ రుణపడి ఉంటానని అశ్విన్ యూట్యూబ్ ఛానల్ లో సంజు వ్యాఖ్యానించాడు. ఆ జట్టుతో ఉంటాడా..? వీడతాడా..? అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఈ క్రమంలో తన అంతర్జాతీయ టీ-20 భవితవ్యం పై సంజు కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను వరుసగా విఫలమైనా కోచ్ గౌతమ్ గంభీర్ తనకు అవకాశాలు ఇచ్చినట్టు గుర్తు చేశాడు.