Akash deep Car : టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ గురించి చెప్పాలంటే అందరికీ బర్మింగ్ హోమ్ వేదికగా జరిగిన ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ మ్యాచ్ తప్పక గుర్తుకొస్తుంది. ఇంగ్లాండ్ పర్యటనలో రెండో టెస్ట్ తరువాత ఈ టీమిండియా బౌలర్ ఒక్కసారిగా సంచలనంగా మారాడు. ఇంగ్లాండ్ పై టీమిండియా రెండు మ్యాచ్ ల్లో విజయం సాధిస్తే.. ఆ రెండు మ్యాచ్ ల్లో కూడా ఆకాశ్ దీప్ కీలకంగా మారాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ.. తన రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ ద్వారా ప్రపంచ క్రికెట్ కి తానేంటో నిరూపించుకున్నాడు. మరోవైపు 5వ టెస్ట్ మ్యాచ్ లో సాయి సుదర్శన్ ఔట్ కాగానే నైట్ వాచ్ మెన్ గా బ్యాటింగ్ కి దిగి 66 పరుగులు చేశాడు.
Also Read : RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?
ఆకాశ్ దీప్ తొలి హాఫ్ సెంచరీ
టెస్ట్ క్రికెట్ లో అంతర్జాతీయ మ్యాచ్ ల్లో తన తొలి హాప్ సెంచరీ నమోదు చేసుకున్నాడు ఆకాశ్ దీప్. అయితే తాజాగా వార్తల్లో నిలిచాడు. కొత్త కారు ఒకటి కొని సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాడు. ఇటీవలే ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ముగించుకొని ఆకాశ్ తన కలల కారును కొనుగోలు చేసి తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు. తన కుటుంబంతో కలిసి కొత్త కారుతో ఫొటో దిగిన ఆకాశ్ తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. ” కల నెరవేరింది. కీస్ అందాయి. అత్యంత ముఖ్యమైన వారితో” అనే శీర్షిక పోస్ట్ చేశాడు. కారు నలుపు రంగులో ఉన్న టయోటా ఫార్చ్యనర్. ఈ కార్ టాప్ మోడల్ ధర రూ.62 లక్షలకు పైగా ఉంటుంది. ఈ పోస్ట్ వైరల్ అయిన వెంటనే.. టీమిండియా టీ-20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కారు చాలా బాగుంది అని విషెష్ తెలిపాడు.
చెల్లెళ్లకి కారు గిప్ట్
ఆకాశ్ దీప్ కి రాఖీ పండుగ సందర్భంగా తన చెల్లెల్లు రాఖీ కడితే.. వారికి రూ.50లక్షల కారు కొని గిప్ట్ ఇచ్చాడని సమాచారం. ప్రస్తుతం ఈ కారుకి సంబంధించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 2024 ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ తో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా చివరి మూడు టెస్ట్ ల్లో ఆకాశ్ దీప్ తొలిసారిగా భారత టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. తొలి రెండు టెస్టులకు ఎంపికైన ఆవేశ్ ఖాన్ స్థానంలో ఆకాశ్ దీప్ కు చోటు దక్కింది. ఆకాశ్ దీప్ అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఐపీఎల్ ఆడాడు. 7 మ్యాచ్ ల్లో 6 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించి 29 మ్యాచ్ ల్లోనే 103 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. వీటిలో 4 సార్లు 5 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. భారత్ తరుపున ఇప్పటివరకు 10 టెస్టుల్లో 28 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
?igsh=MTlreWZ5NHFwcGpicw==