BigTV English

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

RCB – Kohli: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అలాగే ఎబి డివిలియర్స్ చేసిన పనికి ఓ ఛత్తీస్‌ గఢ్ కుర్రాడు వివాదంలో చిక్కుకోవాల్సి వచ్చింది. ఛత్తీస్‌ గఢ్ కుర్రాడికి కోహ్లీ అలాగే డివిలియర్స్ ఫోన్ కాల్ చేసి.. షాక్ ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. అతన్నీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పటిదార్ కు ఫోన్ కాల్ చేయబోయి.. మనీష్ అనే కుర్రాడికి ఫోన్ చేయడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది.


Also Read: Rohit Sharma Lamborghini : రోహిత్ శర్మ కారు నెంబర్ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే.. వాళ్లపై ప్రేమతో

ఛత్తీస్‌గఢ్ యువకుడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. ట్విస్ట్ ఏంటంటే?


అసలు ఛత్తీస్‌గఢ్ కుర్రాడు ఏంటి? ఆ కుర్రాడికి విరాట్ కోహ్లీ అలాగే ఎబి డివిలియర్స్ ఫోన్ కాల్ చేయడం ఏంటి ? అని అనుకుంటున్నారా…? ఈ సంఘటన పూర్తి వివరాలు పరిశీలిస్తే.. 18 సంవత్సరాల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

అయితే ఈ టోర్నమెంట్ ముగిసిన తర్వాత తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త కెప్టెన్ రజత్ కు విరాట్ కోహ్లీ అలాగే ఎబి డివిలియర్స్ ఫోన్ కాల్ చేయబోయారు. ఇందులో భాగంగానే అతని ఫోన్ నెంబర్ కు కాల్ చేశారట. ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సంబంధించిన మనీష్ అనే కుర్రాడు ఆ ఫోన్ లిఫ్ట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా విరాట్ కోహ్లీ అలాగే ఎబి డివిలియర్స్ ఇద్దరు షాక్ అయ్యారట. రజత్ ఫోన్ ను నువ్వెందుకు లిఫ్ట్ చేసావని కోహ్లీ అలాగే ఏ బి డివిలియర్స్ నిలదీసినట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ ఫోన్ నెంబర్ను మళ్ళీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ కు అప్పగించారు.

అసలు ఎందుకు చత్తీస్గడ్ కుర్రాడు ఫోన్ లిఫ్ట్ చేశాడు ?

వాస్తవంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ దాదాపు ఆరు నెలల నుంచి తన ఫోన్ నెంబర్ వాడటం లేదట. దీంతో ఆరు నెలల తర్వాత ఆ నెంబర్ను ఇనాక్టివ్ చేసి మనీష్ అనే చత్తీస్గడ్ రాష్ట్రానికి సంబంధించిన కుర్రాడికి ఇచ్చారట. అది తెలియక ఆ యువకుడు అదే సిమ్ వాడినట్లు తెలుస్తోంది. అయితే కోహ్లీ ఫోన్ చేయగానే తాను కూడా… నీకు పెద్ద ఫ్యాన్ అంటూ సమాధానం ఇచ్చాడట మనీష్. ఆ తర్వాత పోలీసులు ఆ ఫోన్ నెంబర్ తీసుకొని తిరిగి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Tags

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

Big Stories

×