E-Paper
Advertisement

Australian Open:- క్వార్టర్ ఫైనల్లో జకోవిచ్, సబలెంక..

Australian Open:- క్వార్టర్ ఫైనల్లో జకోవిచ్, సబలెంక..
Advertisement

Australian Open:- ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్, విమెన్స్ సింగిల్స్‌లో టాప్ సీడ్లు దూసుకుపోతున్నారు. పురుషుల సింగిల్స్‌లో సెర్బియా స్టార్, ఐదో ర్యాంకర్ జకోవిచ్, రష్యాకు చెందిన ఆండ్రీ రబ్లెవ్… క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టారు. మహిళల సింగిల్స్‌లో బెలారస్‌కు చెందిన ఐదో ర్యాంకర్ సబలెంక, క్రొయేషియాకు చెందిన డోనా క్వార్టర్స్ చేరారు.

పురుషుల సింగిల్స్‌లో భాగంగా జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన 24 ర్యాంకర్ అలెక్స్ మీద… వరుస సెట్లలో 6-2, 6-1, 6-2 తేడాతో గెలిచాడు…. జకోవిచ్. అయితే అలెక్స్ జకోవిచ్‌కు అంత ఈజీగా లొంగలేదు. అతనిపై గెలిచేందుకు జకోవిచ్ రెండు గంటలకు పైగా శ్రమించాల్సి వచ్చింది. మరో ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్… రష్యాకు చెందిన 6వ ర్యాంకర్ ఆండ్రీ రబ్లెవ్, 10వ ర్యాంకరైన డెన్మార్క్ ఆటగాడు హోల్గర్ మధ్య హోరాహోరీగా సాగింది. 3 గంటలా 37 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన మ్యాచ్‌లో… చివరికి రూనె మీద 6-3, 3-6, 6-3, 4-6, 7-6 తేడాతో గెలిచాడు… ఆండ్రీ రబ్లెవ్. ఇక క్వార్టర్ ఫైనల్లో జకోవిచ్, ఆండ్రీ రబ్లెవ్ తలపడతారు. ఇప్పటికే 9 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన జకోవిచ్… పదోసారి కూడా ఆ గ్రాండ్‌స్లామ్‌ నెగ్గేందుకు మరో మూడు మ్యాచ్‌ల దూరంలోనే ఉన్నాడు.

Advertisement

ఇక మహిళ సింగిల్స్‌లో భాగంగా జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో… బెలారస్‌కు చెందిన 5వ ర్యాంకర్ సబలెంక… స్విట్జర్లాండ్ కు చెందిన 10వ ర్యాంకర్ బెలిండాపై… 7-5, 6-2 తేడాతో సునాయాసంగా గెలిచింది. మరో ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో క్రొయేషియాకు చెందిన 64వ ర్యాంకర్ డోనా వెకిక్… 6-2, 1-6, 6-3 తేడాతో చెక్ రిపబ్లిక్ కు చెందిన 82వ ర్యాంకర్ లిండాపై గెలిచింది. ఇక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్… సబలెంక, డోనా వెకిక్ మధ్య జరగనుంది.

Follow this link for more updates:- Bigtv

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×