E-Paper
Advertisement

Cricket Australia: మ‌న‌కు ఐపీఎలే ముఖ్యం.. పాకిస్తాన్ టూర్ లైట్ తీసుకోండి

Cricket Australia: మ‌న‌కు ఐపీఎలే ముఖ్యం.. పాకిస్తాన్ టూర్ లైట్ తీసుకోండి
Advertisement

Cricket Australia:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) కొనసాగుతున్న నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా ( Cricket Australia) కీలక నిర్ణయం తీసుకుంది. తమకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు ముఖ్యమని.. పాకిస్తాన్ టూర్ లైట్ తీసుకోవాలని తమ క్రికెటర్లకు ఆదేశాలు జారీ చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. మే 30వ తేదీ నుంచి పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా  ( Pakistan vs Australia ) మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ నేపథ్యంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా ( Cricket Australia) ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ ఆడే వాళ్లు… టెన్షన్ పడి పాకిస్తాన్ కు రాకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఐపీఎల్ లో లేని క్రికెటర్లు మాత్రమే పాకిస్తాన్ తో వన్డే సిరీస్ ఆడాలని దిశా నిర్దేశం చేసింది.

Also Read: Hasin Jahan: షమీ కుటుంబంలో అంద‌రూ దొంగ‌లే..పెళ్లి చేసుకుంటాన‌ని మోసం, ప్రెగ్నెంట్ అయ్యాక !

మనకు ఐపీఎల్ ఏ ముఖ్యం.. పాకిస్తాన్ టూర్ లైట్ తీసుకోండి

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) మే 31వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే ఈ టోర్నమెంటు ఫినిష్ కాక ముందే పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా ( Pakistan vs Australia ) మధ్య 3 వన్డేల సిరీస్ షురూ అవుతుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో ఆడే ఆస్ట్రేలియా క్రికెటర్లందరూ పాకిస్తాన్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా.. బీసీసీఐకి అనుకూలంగా కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ తో జరిగే వన్డే సిరీస్ ను లైట్ తీసుకోమని ఆదేశాలు ఇచ్చింది. ముందుగా ఐపీఎల్ ఫినిష్ చేసుకొని.. అక్కడి ఫ్రాంచైజీ ఓనర్లను సంతృప్తి చేసిన తర్వాత పాకిస్తాన్ కు రావాలని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. పాకిస్తాన్ లో ఏదో పొడి చేద్దామని ఆగ మేఘాల మీద ఐపీఎల్ వదిలి అస్సలు రాకూడదని స్పష్టం చేసింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ( Pakistan Cricket Board) ఊహించని షాక్ తగిలింది. దీంతో కీలక ప్లేయర్లు లేకుండానే ఆస్ట్రేలియాకు సంబంధించిన బచ్చా క్రికెటర్లతోనే పాకిస్తాన్ వన్డే సిరీస్ జరగనుంది అన్నమాట.

పాకిస్తాన్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా వ‌న్డే సిరీస్ ఎప్పుడంటే ?

పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఈ నెల చివరలో 3 వన్డేల సిరీస్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా మే 23వ తేదీన ఇస్లామాబాద్ కు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు చేరుకుంటుంది. అనంతరం మే 31వ తేదీన రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య తొలి వన్డే నిర్వహించనున్నారు. అటు జూన్ రెండవ తేదీన లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా రెండో వన్డే… జూన్ 4వ తేదీన ఇదే స్టేడియం వేదికగా మూడవ వన్డే ఉంటుంది. స్థానిక కాలమానం ప్రకారం ప్రతి మ్యాచ్ సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రారంభం కానుంది.

Advertisement

 

Also Read: Alastair Cook: IPL ఓన‌ర్ల‌కు ప్లేయ‌ర్లు భ‌య‌ప‌డుతూ బ‌తుకుతున్నారు, టార్చ‌ర్ అనుభ‌విస్తున్నారు Alastair Cook !

 

Related News

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×