Shahid Afridi: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament ) అతి త్వరలోనే ప్రారంభం కానుంది. మార్చి 26వ తేదీన అంటే మరో నాలుగు రోజుల్లోనే ఈ మెగా టోర్నమెంట్ షురూ అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కు విదేశీ క్రికెటర్లు వరుసగా షాకులు ఇస్తున్నారు. భద్రత, గాయాల పేరుతో ఈ టోర్నమెంట్ నుంచి సరైన సమయంలో తప్పుకుంటున్నారు. అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు సంబంధించిన ఫ్రాంచైజీ ల నుంచి ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి ఇండియాకు వెళ్తున్నారు. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఫారెన్ క్రికెటర్లు. అయితే ఈ అంశంపై తాజాగా షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi ) స్పందించారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ నుంచి ఐపీఎల్ టోర్నమెంట్లోకి విదేశీ క్రికెటర్లు వెళ్లడం దారుణమని మండిపడ్డారు. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో ఐపీఎల్ అన్ సోల్డ్ ( unsold IPL) ప్లేయర్లు అలాగే రిటైర్మెంట్ ఇచ్చిన ఆటగాళ్లు మాత్రమే ఉన్నారని బాంబు పేల్చారు. దీని అంతటికి కారణం ఐపీఎల్ అని విమర్శలు చేశారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో చాలామంది విదేశీ క్రికెటర్లు జారుకుంటున్నారు. రకరకాల కారణాలు చెప్పి పిఎస్ఎల్ టోర్నమెంటుకు గుడ్ బై చెబుతున్నారు. ఐపీఎల్ నుంచి అవకాశం వస్తున్న నేపథ్యంలో ఇండియా వెళ్ళిపోతున్నారు విదేశీ క్రికెటర్లు. అయితే దీనిపై తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi ) స్పందించారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో ఒకప్పుడు తోపు ఆటగాళ్లు ఉన్నారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని స్పష్టం చేశారు. దీనంతటికీ కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటూ ఫైర్ అయ్యారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో అమ్ముడు పోనీ ప్లేయర్లు అందరూ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడుతున్నారని మండిపడ్డారు. అలాగే రిటర్మెంట్ ఇచ్చిన ప్లేయర్లు కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లో దాపురించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. PSLలో అన్ సోల్డ్, రిటైర్మెంట్ ప్లేయర్లు తప్ప టాలెంట్ ఉన్న ప్లేయర్లు లేరని ఆగ్రహించారు. ఈ అంశం నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో డబ్బులు ఎక్కువగా రావడమే కాకుండా, టాలెంట్ ప్లేయర్లు ఉన్నారని తెలిపారు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi ). అందుకే పాకిస్తాన్ సూపర్ లీగ్ కు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు.
🚨 BIG STATEMENT BY SHAHID AFRIDI ON IPL VS PSL 🚨
"Once upon a time, every big player used to play PSL, but now only unsold IPL, retired players chose PSL, which is so disappointing for Pakistani fans. IPL is way bigger in terms of talent and money."pic.twitter.com/qHhbAZTHA3
— Fan Account Richard Kettlebourogh (@RichKettle07) March 21, 2026