BigTV English

BCCI: ఇక హైదరాబాద్, ముంబైలోనే IPL 2025 మొత్తం మ్యాచ్ లు..స్పెషల్ ట్రైన్ లో ప్లేయర్స్

BCCI: ఇక హైదరాబాద్, ముంబైలోనే IPL 2025 మొత్తం మ్యాచ్ లు..స్పెషల్ ట్రైన్ లో ప్లేయర్స్

BCCI:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పైన  ( Indian Premier League 2025 Tournament )
నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటి వరకు చాలా రసవత్తరంగా కొనసాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటుకు బ్రేకులు పడే అవకాశాలు స్పష్టంగా… కనిపిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగడమే. జమ్ము కాశ్మీర్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు ( Pakisthan ) ఏకంగా 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. దానికి బదులుగా ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ పై దాడులు చేస్తోంది ఇండియా. ఇప్పటికే వంద మంది ఉగ్రవాదులను చంపేసింది ఇండియా. అయితే తమ ఉగ్రవాదులను చంపినందుకుగాను పాకిస్తాన్ బోర్డర్లో కుట్రలు చేస్తుంది. జమ్ము కాశ్మీర్ పై దాడి చేసే ప్రయత్నం చేసింది. ఇలాంటి నేపథ్యంలోనే ఇండియా ( India)… కూడా నేరుగా పాకిస్తాన్ ను మట్టికరిపించే ప్రయత్నం చేస్తుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య గొడవ జరుగుతున్న నేపథ్యంలో… ఐపీఎల్ 2025 టోర్నమెంట్కు సంబంధించిన… పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ రద్దయింది.


అర్ధాంతరంగా ఆగిపోయిన ఢిల్లీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్

గురువారం రోజున సాయంత్రం పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఇక అప్పటికే పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మధ్య మ్యాచ్ కూడా ప్రారంభమైంది. పది ఓవర్లు ఆడిన పంజాబ్ కింగ్స్ 122 పరుగులు చేసింది. దీంతో అప్పటికే యుద్ధం ప్రారంభం కావడంతో మ్యాచ్… అర్థంతరంగా ఆపేశారు. స్టేడియంలో ఉన్న అభిమానులు అందరినీ వెళ్ళగొట్టారు. ధర్మశాల స్టేడియాన్ని ఖాళీ చేశారు. అక్కడ ఉన్న ప్లేయర్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సేఫ్టీ ప్లేస్ కు తీసుకువెళ్లారు.


స్పెషల్ ట్రైన్ లో ఐపీఎల్ 2025 ప్లేయర్లు

దేశవ్యాప్తంగా నలుమూలల ఐపిఎల్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన ప్లేయర్లు ఉన్నారు. ఆ ప్లేయర్ లందరినీ సౌత్ ఇండియా వైపు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. యుద్ధం జరిగితే కచ్చితంగా ఉత్తర భారతదేశం పైన ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ఐపిఎల్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన ప్లేయర్లను ప్రత్యేక ట్రైన్ లో హైదరాబాద్ లేదా ముంబై అటు తమిళనాడు వైపు తీసుకువెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం లోగా దీనిపై ఒక క్లారిటీ వస్తుంది.

హైదరాబాదులోనే ఐపిఎల్ 2025 మ్యాచ్ లు

ఐపిఎల్ 2025 టోర్నమెంట్ ఇండియాలో నిర్వహించడం కష్టమే అని చెబుతున్నారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ధైర్యంగా టోర్నమెంట్ నిర్వహిస్తే ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ టోర్నమెంట్ను దక్షిణాఫ్రికాకు తరలించాలని కొంత మంది అంటున్నారు. అయితే దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారి… స్పందించారు. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ రద్దు కాబోదని క్లారిటీ ఇచ్చారు. కావాలంటే హైదరాబాద్, ముంబై, చెన్నై ఇలాంటి స్టేడియాలలో మ్యాచ్లను నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చారు. అవసరం అనుకుంటే విదేశాలకు టోర్నమెంట్ తరలిస్తామని స్పష్టం చేశారు. దీనిపై ఇవాళ అత్యవసర మీటింగ్ కూడా ఉంది. ఆ మీటింగ్ లో… మిగతా టోర్నమెంట్ ఎక్కడ నిర్వహించాలి అనే దాని పైన క్లారిటీ వస్తుంది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×