E-Paper
Advertisement

Costa Rica shocked Japan : జపాన్‌కు షాక్!

Costa Rica shocked Japan : జపాన్‌కు షాక్!

Costa Rica shocked Japan : ఫిఫా వరల్డ్‌కప్‌లో చిన్న జట్లు తమకన్నా మెరుగైన జట్లకు షాకిస్తూనే ఉన్నాయి. జర్మనీతో పోలిస్తే చాలా తక్కువ ర్యాంకర్ అయిన జపాన్ తొలి మ్యాచ్‌లో ఆ జట్టుకు షాకిస్తే… ఇప్పుడు జపాన్ వంతు వచ్చింది. జపాన్ కన్నా తక్కువ ర్యాంకర్ అయిన కోస్టారికా… 1-0 గోల్స్ తేడాతో ఆ జట్టుపై గెలిచింది. మ్యాచ్ ఆరంభం నుంచే జపాన్, కోస్టారికా గోల్స్ చేసేందుకు తీవ్రంగా శ్రమించాయి. ముఖ్యంగా జర్మనీపై గెలిచిన జోష్ మీదున్న జపాన్… ఎటాకింగ్ గేమ్ ఆడింది. అయితే… ఆ జట్టు ఆటగాళ్లు చేసిన గోల్ ప్రయత్నాల్ని కోస్టారికా ఆటగాళ్లు సమర్థంగా అడ్డుకున్నారు. జపాన్ ఆటగాళ్లు కోస్టారికా గోల్ పోస్ట్ మీద పదే పదే దాడులు చేసినా… బంతిని మాత్రం నెట్లోకి పంపలేకపోయారు. దాంతో… తొలి అర్ధభాగం ఒక్క గోల్ కూడా నమోదు కాకుండానే ముగిసింది. రెండో అర్ధభాగంలో కూడా జపాన్ దూకుడు తగ్గలేదు. 46 నిమిషంలో ఆ జట్టు ఆటగాడు బంతిని కోస్టారికా గోల్ పోస్టులోకి పంపే ప్రయత్నం చేసినా… గోల్ కీపర్ సమర్థంగా అడ్డుకున్నాడు. ఆట 63వ నిమిషంలోనూ జపాన్‌కు గోల్ చేసే అవకాశం వచ్చినా… సఫలం కాలేకపోయింది. 70 నిమిషంలో జపాన్ ఆటగాడు బంతితో కోస్టారికా గోల్ పోస్టు వైపు దూసుకెళ్తున్న సమయంలో… ఆ జట్టు ఆటగాడు అడ్డుకోవడంతో మరో ఫ్రీ కిక్ వచ్చింది. కానీ దాన్ని కూడా జపాన్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. కానీ… కోస్టారికా మాత్రం వచ్చిన ఒకే ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఆట 81 నిమిషంలో కీషర్‌ ఫుల్లర్‌ గోల్‌ కొట్టి కోస్టారికాను ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత జపాన్‌ ఎంత ప్రయత్నించినా… గోల్‌ చేయలేకపోయింది. చివరికి కోస్టారికా 1-0 గోల్స్ ఆధిక్యంతో జపాన్‌పై విజయం సాధించింది. కోస్టారికాపై గెలిచి ఆరు పాయింట్లతో జపాన్ ప్రీక్వార్టర్స్ చేరుకుంటుందని అనుకుంటే… అనూహ్యంగా ఓడిపోవడంతో ఆ జట్టు అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు… ఈ గెలుపుతో కోస్టారికా గ్రూప్‌-Eలో మూడో స్థానానికి చేరింది.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×