E-Paper
Advertisement

Vishal Jayswal : విరాట్ కే షాక్ ఇచ్చిన ఆ సెన్షేష‌న‌ల్ బౌల‌ర్ ఎవ‌రో తెలుసా..?

Vishal Jayswal : విరాట్ కే షాక్ ఇచ్చిన ఆ సెన్షేష‌న‌ల్ బౌల‌ర్ ఎవ‌రో తెలుసా..?
Advertisement

Vishal Jayswal : ప్ర‌స్తుతం విజ‌య్ హాజ‌రే ట్రోఫీ సీజ‌న్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ట్రోఫీలో భాగంగా ప‌లువురు కొత్త ఆట‌గాళ్లు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ ట్రోఫీతో పాటు ఐపీఎల్ లో స‌త్తా చాటిన వారు టీమిండియాలో స్థానం సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవ‌లో ఓ స‌రికొత్త బౌల‌ర్ వెలుగులోకి వ‌చ్చాడు. ఆ బౌల‌ర్ టీమిండియా కీల‌క ఆట‌గాడు క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ, ఢిల్లీ జ‌ట్టు కెప్టెన్ రిష‌బ్ పంత్ వికెట్ల‌ను తీసి ఇప్పుడు సెన్షేష‌న్ గా మారాడు. గుజ‌రాత్ వ‌ర్సెస్ ఢిల్లీ మ‌ధ్య జ‌రిగిన విజ‌య్ హాజారే ట్రోఫీ మ్యాచ్ లో ఈ బౌల‌ర్ వెలుగులోకి వ‌చ్చాడు. ఆ బౌల‌ర్ ఎవ్వ‌రో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Also Read : Vaibhav Suryavanshi : విధ్వంస‌క‌ర బ్యాట్స్ మెన్.. విజ‌య్ హాజారే ట్రోఫీ నుంచి ఔట్..!

వ‌రుస మ్యాచ్ ల్లో రెచ్చిపోయిన‌ విరాట్

Advertisement

విజయ్ హజారే ట్రోఫీలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తన మునపటి ఫామ్‌ను కొనసాగిస్తూ వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. కింగ్ కోహ్లీ జోరు చూస్తుంటే.. రెండో సెంచరీ కూడా ఖాయమని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఒక అన్ నోన్ బౌలర్ కోహ్లీని ముప్పుతిప్పలు పెట్టి ఔట్ చేశాడు. అతనే గుజరాత్ స్పిన్నర్ విశాల్ జైస్వాల్. విరాట్ కోహ్లీనే కాదు.. టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను కూడా ఔట్ చేసి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. బెంగళూరు వేదికగా ఢిల్లీ-గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 58 బంతుల్లో 77 పరుగులు చేసి విధ్వంసం సృష్టిస్తున్నాడు. అప్పటికే 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న తరుణంలో 27 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ విశాల్ జైస్వాల్ తన తెలివైన బౌలింగ్‌తో కోహ్లీని ట్రాప్‌లో పడేశాడు.

రెప్ప‌పాటులో స్టంప్ ఔట్..!

ఒక బంతిని వేయగా.. దాన్ని సిక్సర్‌గా మలచాలనే ప్రయత్నంలో కోహ్లీ క్రీజు దాటి బయటకు వచ్చాడు. కానీ బంతి టర్న్ అవ్వడంతో దాన్ని మిస్ అయ్యాడు, వికెట్ కీపర్ రెప్పపాటు కాలంలో స్టంప్ అవుట్ చేశాడు. విశాల్ జైస్వాల్ కేవలం విరాట్ వికెట్‌తో ఆగలేదు. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌తో సహా మొత్తం నలుగురు టాప్ ఆర్డర్ బ్యాటర్లను పెవిలియన్ కి పంపాడు. తన 10 ఓవర్ల కోటాలో కేవలం 42 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి ఢిల్లీ వెన్ను విరిచాడు. దీంతో దేశవాళీ క్రికెట్‌లో విశాల్ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. గుజరాత్‌కు చెందిన ఈ ఆల్‌రౌండర్ రికార్డులు చూస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 2022-23 సీజన్‌లో జరిగిన అండర్-23 సీ.కే.నాయుడు ట్రోఫీలో విశాల్ ఊచకోత కోశాడు. కేవలం 20 ఇన్నింగ్స్‌ల్లో 70 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. ఆ టోర్నీలో ఏకంగా 7 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ఈ అద్భుత ప్రదర్శనకు 2024లో బీసీసీఐ వార్షిక అవార్డుల్లో స్వయంగా జస్‌ప్రీత్ బుమ్రా చేతుల మీదుగా ట్రోఫీని అందుకున్నాడు. ఇప్పటివరకు 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 40 వికెట్లు, బ్యాటింగ్‌లో ఒక సెంచరీ కూడా సాధించి పక్కా ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కోహ్లీ వికెట్‌తో విశాల్ కెరీర్ మలుపు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement

Also Read : Boxing Day : క్రికెట్ హిస్ట‌రీలోనే బిగ్గెస్ట్ డే.. ఒకే రోజు 29 మ్యాచ్‌లు..!

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×