IND VS AUS: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs India, 2nd ODI) మధ్య వన్డే సిరీస్ కొనసాగుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే రోహిత్ శర్మ కెప్టెన్సీని తొలగించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India)… మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ రాణించకపోతే వాళ్ల కెరీర్ ఫినిష్ అయినట్లేనని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు గౌతమ్ గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారట. ఇప్పటికే మొదటి వన్డేలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ విఫలమయ్యారు. రోహిత్ శర్మ ఎనిమిది పరుగులు చేయగా విరాట్ కోహ్లీ డక్ ఔట్ అయ్యాడు. అడిలైడ్ వేదికగా విఫలమైతే, మీరు వన్డేలలో కొనసాగడం కష్టమేనని గౌతమ్ గంభీర్ వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
Also Read: Team India -Divorce: విడాకులు తీసుకున్న మరో టీమిండియా ప్లేయర్…భార్య లేకుండానే దీపావళి వేడుకలు
ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా మధ్య జరిగిన మొదటి వన్డేలో విఫలమైన విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మకు గౌతమ్ గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో మీరిద్దరూ విఫలమైతే, మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడని బాంబు పేల్చారట గౌతమ్ గంభీర్. కచ్చితంగా రెండో వన్డే మ్యాచ్ లో మీరిద్దరూ పర్ఫామెన్స్ చేయాల్సిందేనని ప్రెషర్ పెడుతున్నారట గౌతమ్ గంభీర్. అడిలైడ్ వేదికగా జరగబోయే వన్డే మ్యాచ్ లో కనీసం ఇద్దరూ అర్థ సెంచరీలు చేయాలని పేర్కొన్నారట. అలా కాదని విఫలమైతే మూడో వన్డే నుంచి తొలగించడం జరుగుతుందని హెచ్చరించారట. ఆ తర్వాత జరుగబోయే వన్డే సిరీస్ లో కూడా ఛాన్స్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారట. 2027 వరల్డ్ కప్ ను విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ మర్చిపోవాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారట గౌతమ్ గంభీర్( Gautam Gambhir). దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా గడ్డపై రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ విఫలం అయితే వాళ్లను పక్కకు పెట్టాలన్న ఉద్దేశంతోనే గౌతమ్ గంభీర్ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే వాళ్ళిద్దరికీ అనేక కండిషన్స్ పెడుతున్నారట గౌతమ్ గంభీర్. ఇక దానికి తగ్గట్టుగానే, విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ విఫలమైతే, నిజంగానే వాళ్లు రిటైర్మెంట్ ఇస్తారని చర్చ జరుగుతోంది. గంభీర్ ( Gautam Gambhir) అడుగకముందే, విరాట్ కోహ్లీ ( Virat Kohli), రోహిత్ శర్మ ఇద్దరూ రిటైర్మెంట్ ఇస్తారని సమాచారం.
🚨VIRAT KOHLI AND ROHIT SHARMA COULD BE DROPPED IF THEY FAIL TO PERFORM IN ADELAIDE🚨
According to reports, Coach Gautam Gambhir and selector Ajit Agarkar have made it clear to Rohit Sharma that a poor show in the 2nd ODI against Australia could cost him his place, with Yashasvi… pic.twitter.com/EQ7PgZzCAP
— GillTheWill (@GillTheWill77) October 22, 2025