BigTV English

Akhanda 2 : ఇండస్ట్రీలో ఆ నెంబర్ సెంటిమెంట్, అనౌన్స్ చేస్తున్నారు కానీ పాటించట్లేదు

Akhanda 2 : ఇండస్ట్రీలో ఆ నెంబర్ సెంటిమెంట్, అనౌన్స్ చేస్తున్నారు కానీ పాటించట్లేదు
Advertisement

Akhanda 2 : తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అంచనాలు ఈ రేంజ్ లో పెరగడానికి మొదటి కారణం సినిమా కాంబినేషన్. ఈ కాంబినేషన్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ కూడా కమర్షియల్ సక్సెస్ సాధించాయి. బోయపాటి శ్రీను ఎన్ని సినిమాలు చేసినా కూడా బాలకృష్ణతో సినిమా చేయడం అనేది శ్రీనుకి కొంత ప్రత్యేకం.


సింహ సినిమాతో మొదలైన వీరి కాంబినేషన్ ఇప్పటివరకు సక్సెస్ఫుల్ గా కొనసాగుతూనే ఉంది. బాక్స్ ఆఫీస్ వద్ద అఖండ సినిమా విపరీతమైన సక్సెస్ సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ వస్తుంది అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన వీడియో కంటెంట్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు అధికారికంగానే ప్రకటించారు.

ఆ నెంబర్ సెంటిమెంట్ 

ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదో ఒక సెంటిమెంట్ నడుస్తూనే ఉంటుంది. గట్టిగా గమనిస్తే రీసెంట్ టైమ్స్ లో చాలా అనౌన్స్మెంట్ నాలుగు గంటల ఐదు నిమిషాలకు, ఐదు గంటల నాలుగు నిమిషాలకు, నాలుగు గంటల 54 నిమిషాలకు ఇలా నాలుగు నెంబర్ తో కూడుకున్న టైం బట్టి అనౌన్స్మెంట్ చేస్తున్నారు.


అనుదీప్ కేవీ దర్శకత్వంలో విశ్వక్సేన్ నటించిన ఫంకీ సినిమా టీజర్ 4:5 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ టైం మిస్ అయిన వెంటనే 5:4 నిమిషాలకు అంటూ అనౌన్స్ చేశారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మీసాల పిల్ల పాటను కూడా నాలుగు గంటల ఐదు నిమిషాలకు విడుదల చేశారు. అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నారు కానీ ఆ టైం కి అన్ని సందర్భాల్లో విడుదల చేయడం లేదు. ప్రతిసారి లేట్ అవుతూనే ఉంది.

ఇక తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 బ్లాస్టింగ్ రోర్ అక్టోబర్ 24న 4:54 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ డేట్ ని పర్టికులర్ గా గమనిస్తే మొత్తం 24 లో ఒక నాలుగు, తర్వాత టైం లో కూడా రెండు నాలుగులు ఉన్నాయి. దీనిని ప్రస్తుతం ఎవరైనా మారుస్తారేమో వేచి చూడాలి. నాలుగు అని చెప్పి కంటిన్యూ అయితే నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నట్టే అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

డిసెంబర్ లో తాండవం 

ఈ సినిమా వాస్తవానికి ఎప్పుడో విడుదల కావలసి ఉంది. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శివతాండవం అప్పుడు థియేటర్స్ లో స్టార్ట్ అవుతుంది అని చాలామంది అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Nikhil Swayambhu : శివరాత్రికి నిఖిల్ స్వయంభు? ఆ విషయం చిత్ర యూనిట్ ఆలోచించలేదా?

Related News

Telusukada: తెలుసు కదా సినిమా ఫస్ట్  ఛాయిస్ సిద్దు కాదా..చేతులారా హిట్ సినిమా వదులుకున్న హీరో?

Nikhil Swayambhu : శివరాత్రికి నిఖిల్ స్వయంభు? ఆ విషయం చిత్ర ఆలోచించలేదా?

Skn : అగ్రిమెంట్ విషయంలో హీరోయిన్స్ కి ఖచ్చితంగా అది చెప్పాలి

Bandla Ganesh : నేను బ్లాక్ బస్టర్ సినిమాతో బ్రేక్ ఇచ్చా, డిజాస్టర్ సినిమాతో ఆపేయలేదు

Mari Selvaraj : మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్? బైసన్ సినిమా పై సూపర్ స్టార్ రియాక్షన్

Director Maruthi : నానికి కథ చెప్తే, నాలో లోపాలు చెప్పాడు

Hansika Motwani: విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన హన్సిక.. అందుకే పేరు మార్చుకున్నానంటూ!

Big Stories

×