Conistable Kanakam: ప్రతిరోజు ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకోవడమే కాకుండా ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తూ ఉన్నాయి. ఇలా సినిమాలు వెబ్ సిరీస్ లను ప్రమోట్ చేసుకోవడం కోసం కూడా దర్శక నిర్మాతలు కొత్త కొత్త పద్ధతులను అనుసరిస్తూ ఉన్నారు. అలాగే ప్రేక్షకులకు సరికొత్త ఆఫర్లు కూడా ఇటీవల కాలంలో ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో ప్రేక్షకులు చూస్తుండగానే డబ్బులు వర్షం పడటం ఐఫోన్లు గిఫ్ట్ గా ఇవ్వడం వంటివి ఇటీవల కాలంలో సినిమా ప్రమోషన్లలో భాగం అయ్యాయి.
తాజాగా మరో వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకులకు ఈ విధమైనటువంటి ఆఫర్ కల్పించింది. ఫ్రీగా సినిమా చూసి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితే చాలు ఐఫోన్ 17 గిఫ్టుగా పొందవచ్చు. మరి ఇలాంటి బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆ వెబ్ సిరీస్ ఏది ఏ విధంగా ఐఫోన్ గెలుచుకోవాలి అనే విషయానికి వస్తే.. ఇప్పటికే ఈటీవీ విన్(etv win) ఓటీటీలో వర్ష బొల్లమ్మ(Varsha Bollamma) ప్రధాన పాత్రలో నటించిన కానిస్టేబుల్ కనకం(Conistable Kanakam) సిరీస్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సిరీస్ ను ప్రేక్షకులు ఉచితంగా చూసే వెసులుబాటును కల్పించారు. ఈ నెల 24, 25, 26 తేదీలలో ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించింది.
ఇక ఈ సిరీస్ చూసి చంద్రిక కనిపించకుండా పోవడానికి గల కారణాలు ఏంటి? ఆమె ఏమైంది? అనే విషయాలను ఈ టీవీ విన్ ఎక్స్ లేదా ఇంస్టాగ్రామ్ ఖాతాలకు మెసేజ్ చేస్తే చాలు. సరైన సమాధానం పంపిన వారికి ఐఫోన్ 17 కానుకగా ఇవ్వబోతున్నట్లు ఈ టీవీ విన్ వెల్లడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక కానిస్టేబుల్ కనకం సినిమా విషయానికి వస్తే.. ప్రశాంత్ కుమార్(Prashanth Kumar) దిమ్మెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ లో కనకమహాలక్ష్మి పాత్రలో వర్ష బొల్లమ్మ నటించారు.
Chandrika has vanished, but the mystery is far from over… 🕵️♀️
Rewatch #ConstableKanakam Season 1 FREE on 24, 25 & 26 October only on @ETVWin, and find the secrets everyone missed the first time! 👀💡 Crack the mystery.
📩 DM your theory to @etvwin on Instagram or X.
📱 And you… pic.twitter.com/9YRhvI95sJ— ETV Win (@etvwin) October 22, 2025
ఈ సిరీస్ లో ఈమె కానిస్టేబుల్ పాత్రలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇలా కానిస్టేబుల్ గా ఆమె ఉద్యోగంలో చేరే సమయంలోనే చంద్రిక పరిచయమవుతుంది.ఇలా కనకం చంద్రిక ఇద్దరు మంచి స్నేహితులుగా మారిపోతారు అయితే ఒకరోజు వీరిద్దరూ బండిమీద వెళ్తున్న సమయంలో ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం తరువాత చంద్రిక కనిపించకుండా పోతుంది? అసలు చంద్రిక ఏమైంది? చంద్రిక కనిపించకపోవడం వెనుక గల కారణాలు ఏంటి? చివరికి కనకం చంద్రిక జాడను గుర్తిస్తుందా? అనేది ఈ సిరీస్ కథాంశం. ఇలా మొదటి భాగం పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో నవంబర్ ఏడవ తేదీ నుంచి కానిస్టేబుల్ కనకం సీజన్ 2 కూడా ప్రసారం కానుంది.
Also Read: Hansika Motwani: విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన హన్సిక.. అందుకే పేరు మార్చుకున్నానంటూ!