Team India: టీమిండియా మ్యాజిక్ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా ( Wriddhiman Saha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వికెట్ కీపర్ గా టీమిండియాకు ఎన్నో సేవలు అందించిన వృద్ధిమాన్ సాహా.. ఏకంగా 20 బంతుల్లో సెంచరీ చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, అభిషేక్ శర్మ లాంటి వాళ్ళ వల్ల కూడా కాలేదు. కానీ వృద్ధిమాన్ సాహా ( Wriddhiman Saha Century)మాత్రం కేవలం 20 బంతుల్లోనే రెచ్చిపోయి సెంచరీ నమోదు చేశాడు. ఇందులో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కూడా ఉన్నాయి. ఏకంగా 510 స్ట్రైక్ రేట్ తో బౌలర్లకు నరకం చూపించాడు. ముఖర్జీ లోకల్ టి20 క్రికెట్ టోర్నమెంటులో ( JC Mukherjee Trophy ) భాగంగా జరిగిన మ్యాచ్ లో ఈ సెంచరీ నమోదు చేశాడు వృద్ధిమాన్ సాహా.
టీమిండియా మాజీ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ( Wriddhiman Saha) 20 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. 2018 మార్చి నెలలో కాళీఘాట్ మైదానంలో ముఖర్జీ లోకల్ టి20 టోర్నమెంట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో మోహన్ భవన్ క్లబ్ తరఫున వృద్ధిమాన్ సాహా బరిలోకి దిగాడు. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, వీరేంద్ర సేహ్వగ్ లాంటి వాళ్ళ వల్ల కూడా కానీ రికార్డు నమోదు చేసుకున్నాడు వృద్ధిమాన్ సాహా. కేవలం 20 బంతుల్లోనే భయంకరమైన సెంచరీ చేశాడు. 20 బంతుల్లో 102 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా… 14 సిక్సర్లు అలాగే నాలుగు బౌండరీలు సాధించాడు. ఈ దెబ్బకు 152 పరుగుల లక్ష్యాన్ని 78 పరుగులు మిగిలి ఉండగానే ఛేదించింది మోహన్ భగన్ క్లబ్ జట్టు. అయితే 2018లో జరిగిన ఈ మ్యాచ్ కు సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read: Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండటం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే పనులు ?