Saurabh Netravalkar: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026) నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ చాలా రసవత్తరంగా సాగుతోంది. ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభమైన ఈ టోర్నమెంట్ మార్చి 8వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే ఈ టోర్నమెంట్లో భాగంగా నిన్న టీమిండియా మొదటి మ్యాచ్ ఆడింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వర్సెస్ టీమ్ ఇండియా ( IND Vs USA) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో 29 పరుగుల తేడాతో కింద మీద పడుతూ టీమిండియా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగినట్లు పాకిస్తాన్ దారుణంగా ట్రోలింగ్ చేస్తోంది. యూఎస్ఏ కు చెందిన సౌరభ్ నేత్రావల్కర్ ఇండియా సంతతికి చెందిన వాడని… అతడు కావాలనే 65 పరుగులు ఇచ్చాడని ఆరోపణలు చేస్తోంది పాకిస్తాన్. టీమిండియాను గెలిపించేందుకు సౌరభ్ నేత్రావల్కర్ ( Saurabh Netravalkar ) విరాళంగా పరుగులు ఇచ్చాడని పరువు తీస్తోంది.
టి20 ప్రపంచక 2026 టోర్నమెంట్లో భాగంగా నిన్న యూఎస్ఏ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి 161 పరుగులు సాధించింది. సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే 84 పరుగులు సాధించాడు. మిగతా ప్లేయర్స్ అట్టర్ ప్లాప్ అయ్యారు. ఒకానొక సమయంలో టీమిండియా వందలోపే ఆల్ అవుట్ అయి ఓడిపోతుందని కూడా అనుకున్నారు. అలాంటి సమయంలో సూర్య కుమార్ యాదవ్ జట్టును ఆదుకున్నాడు. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విఫలమైంది. 20 ఓవర్లలో 132 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. అయితే యుఎస్ఏ ఓటమికి సౌరభ్ నేత్రావల్కర్ కారణమని గణాంకాలు చెబుతున్నాయి. నాలుగు ఓవర్లలో ఏకంగా 65 పరుగులు సమర్పించుకున్నాడు సౌరభ్ నేత్రావల్కర్. కావాలనే ఇలాంటి చెత్త ప్రదర్శన చేశాడని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. బీసీసీఐతో సౌరభ్ నేత్రావల్కర్ ఫిక్సింగ్ చేసుకొని మరి, ఇలా బౌలింగ్ చేశాడని పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇండియాతో జరిగిన మ్యాచ్ లో సౌరభ్ నేత్రావల్కర్ నాలుగు ఓవర్లలో 65 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ లో ఏకంగా 21 పరుగులు సమర్పించుకున్నాడు సౌరభ్ నేత్రావల్కర్. ఈ ఒక్క ఓవర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టు కొంపముంచింది. సూర్య కుమార్ యాదవ్ ఈ ఓవర్ లో బ్యాటింగ్ చేసి 21 పరుగులు సాధించాడు. కావాలని ఈ రేంజ్ లో సౌరభ్ నేత్రావల్కర్ పరుగులు సమర్పించుకున్నాడని ఇప్పుడు పాకిస్తాన్ కామెంట్స్ చేస్తోంది. ఇండియా ఓడిపోతుందనే భయంతో బీసీసీఐ ఫిక్సింగ్ కు తెర లేపిందని ఆరోపణలు చేస్తోంది. దానికి తోడు సౌరభ్ నేత్రావల్కర్ ముంబైకి చెందిన వాడు కాబట్టి… ఇండియాకు అనుకూలంగా బౌలింగ్ చేశాడని వింత వాదనలు చేస్తోంది.
పాకిస్తాన్ చెప్పినట్లుగానే సౌరభ్ నేత్రావల్కర్ ముంబైలో జన్మించాడు. ఇక్కడే చదువుకొని యూఎస్ఏ లో సెటిల్ అయ్యాడు. ఇప్పుడు అక్కడి జట్టు తరఫున ఆడుతున్నాడు. కానీ ఈ మ్యాచ్ లో ఎలాంటి ఫిక్సింగ్ జరగలేదని నివేదికలు, ఇండియన్స్ చెబుతున్నారు. సూర్య కుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి.. అద్భుతంగా ఆడి జట్టును గెలిపించాలని అంటున్నారు ఇండియన్ ఫ్యాన్స్. ఇందులో ఫిక్సింగ్ కు తావు లేదని క్లారిటీ ఇస్తున్నారు. కావాలనే పాకిస్తాన్ బుడద జల్లుతోందని ఫైర్ అవుతున్నారు.
An unwanted record for Mumbai-born Saurabh Netravalkar on his Wankhede homecoming tonight 😢 pic.twitter.com/qbq4KPgvwj
— ESPNcricinfo (@ESPNcricinfo) February 7, 2026