Intinti Ramayanam Today Episode February 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. అభి రాజేంద్ర ని ఎవరు తోసేసారు అని తెలుసుకోవడానికి ఫామ్ హౌస్ కి వెళ్తాడు.. అక్కడ రాజేంద్ర ఎలాపడ్డాడు అని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే.. ఒక కుర్రాడు అక్కడ అనుమానంగా కనిపించడంతో పోలీసులు అతన్ని తీసుకొని వస్తారు. ఆ కుర్రాడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయిని ఇక్కడనుంచే నేను చూస్తూ ఉంటాను అని అంటాడు. వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు కాబట్టి ఈ బిల్డింగ్ నుంచి నేను చూస్తూ ఉంటాను అని అతను చెప్తాడు. అంతేకాదు మేము ఇక్కడ రీల్స్ కూడా చేసాము అని ఒక వీడియోని చూపిస్తాడు. ఆ వీడియోని చూసినప్పుడు అభికి వెనకాల రాజేంద్రప్రసాద్ ని ఎవరు తోచినట్లు కనిపిస్తుంది.. అది చూసి షాక్ అవుతాడు.
అవని వెంటనే పోలీస్ స్టేషన్ కి రాగానే ఆ వీడియోని అవినీకి చూపిస్తాడు అభి. ఆ వీడియోని చూసిన అవని షాక్ అవుతుంది. రాజేంద్రని తోసి చంపాలి అనుకునేది ఒక లేడీ అని కన్ఫామ్ చేసుకుంటారు.. అవును ఒక లేడీ లాగే ఉంది. మరి ఈవిడ ఎవరు ఉంటుంది అని అభి ఆలోచిస్తూ ఉంటాడు.. ఈ వీడియోని మీరు ఎవరికి చూపించలేదు కదా.. ఈ వీడియో ద్వారా మనం ఆ లేడీ ఎవరో కనిపెట్టాలి అని అభితో అవని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. పల్లవి బ్రెస్లైట్ ని చూసిన ఆరాధ్య అలాంటి బ్రాస్లెట్ నాకు కావాలి అని అవనిని అడుగుతుంది. అవని పల్లవిని అడిగి ఒకసారి ఎక్కడుందో చూద్దాం పదనేసి అంటుంది. కానీ పల్లవి మాత్రం చూపించడానికి అస్సలు ఒప్పుకోదు. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే నా దగ్గర ఉన్న వస్తువులు వేరే వాళ్ళ దగ్గర ఉంటే నాకు నచ్చవు. అందుకే నేను ఆ బ్రేస్లెట్ ని నీకు చూపించను అని పల్లవి అంటుంది.. చిన్నపిల్లల దగ్గర కూడా ఇలాంటి పనులు చేస్తావా నువ్వు అని అవని పల్లవిని తిట్టేసి వెళ్ళిపోతుంది.
పార్వతి ఏదో ఆలోచిస్తూ వస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది.. అయ్యో పార్వతి ఏంటి నువ్వు ఇలా పడిపోతున్నావు అని భానుమతి ఆమెను పట్టుకుంటుంది. ఏమైంది అమ్మకి బీపీ టాబ్లెట్ ఇవ్వట్లేదా అని అక్షయ్ అడుగుతాడు. అందరూ టెన్షన్ పడిపోతూ నీళ్లు కొట్టి లేపుతారు. అయితే ఆ పార్వతి రాజేంద్రప్రసాద్ కి అలా జరిగినప్పటి నుంచి ఏమీ తినలేదు అని భానుమతి అంటుంది. నువ్వు ఇలా ఉంటే నీ ఆరోగ్యానికి ఇబ్బంది కదమ్మా నువ్వు ఎందుకు తినట్లేదు అని అక్షయ్ అడుగుతాడు.. ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియలేదు కదా నాకు కంగారుగా ఉంది అందుకే తినాలనిపించట్లేదు అని పార్వతి అంటుంది..
మొత్తానికి అక్షయ్ ధైర్యం చెప్పి పార్వతి చేత తినిపిస్తాడు. నువ్వు ఏమి మనసులో పెట్టుకోకు నాన్నగారికి ఏమీ కాదు మేమున్నాం కదా చూసుకుంటాము అని అంటాడు. ఇక హాస్పిటల్ నుంచి కమల్ ఫోన్ చేయగానే అక్కడికి వెళ్లి పోతారు. శ్రేయ ఇంట్లో జరుగుతున్న వాటి గురించి ఆలోచిస్తూ కంగారు పడిపోతూ ఉంటే శ్రీకర్ మా అమ్మ ఎంత బాధ పడిపోతుందో అని అంటాడు. రాజేంద్రప్రసాద్ కి స్పృహ రావడంతో ఇంటికి తీసుకొని వస్తారు.. రాజేంద్రప్రసాద్ రావడం చూసిన పల్లవి దిమ్మతిరిగే షాక్ అవుతుంది.. చస్తాడు అనుకుంటే ఏకంగా ఇంటికి వచ్చేసాడే.. ఈయన గనక నోరు విప్పి నేనే ఆయన్ని తోయాలని అనుకున్నానని చెప్తే నన్ను చంపేస్తారు అని పల్లవి కంగారు పడిపోతూ ఉంటుంది..
ఎలాగైనా సరే రాజేంద్రప్రసాద్ నీ చంపేయాలని అనుకుంటుంది.. కానీ రాజేంద్రప్రసాద్ మాత్రం నోరు తెలిస్తే నా గురించి చెప్పేస్తాడేమో అని కంగారు పడిపోదు ఏదో ఒకటి చేయాలని ప్లాన్ చేస్తుంది.. అయితే అవని ఆరాధ్యకు జ్యూస్ ఇచ్చి రాజేంద్రప్రసాద్ కి ఇవ్వమని చెప్తుంది.. అది చూసిన పల్లవి రాజేంద్రప్రసాద్ ని ఈ జ్యూస్ తోనే చంపేయాలని అనుకుంటుంది.. ఆరాధ్య తీసుకొని వెళ్తుంటే ఆరాధ్య నా ఫోన్ కాస్త తెచ్చి ఇస్తావా ఈ జ్యూస్ నేను పట్టుకుంటాను అని అంటుంది. ఇక ఆరాధ్య ఫోన్ తీసుకొని వచ్చేలోపు అందులో ఏదో కలిపేసి ఇస్తుంది..
Also Read : బాలుకు చింటును దూరం చేస్తున్న రోహిణి.. రాజేష్ కోసం మీనాతో ఫైట్.. ప్రభావతి చిచ్చు..
రాజేంద్రప్రసాద్ ఆ జ్యూస్ ని తాగుతాడా లేదా అన్నది తెలియాలి అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. సోమవారం ఎపిసోడ్ లో రాజంద్ర ప్రసాద్ పల్లవి గురించి నిజాన్ని బయటపెడతాడా? చక్రధర్ జైల్ నుంచి రిలీజ్ అవుతాడా.? అవని తన తండ్రి గురించి అందరికీ నిజం చెబుతుందా? రాజేంద్రప్రసాద్ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది సోమవారం ఎపిసోడ్లో చూడాలి..