E-Paper
Advertisement

IND VS SA: రెండో ఇన్సింగ్స్ లో దక్షిణాఫ్రికా ఆలౌట్..టీమిండియా టార్గెట్ ఎంతంటే

IND VS SA: రెండో ఇన్సింగ్స్ లో దక్షిణాఫ్రికా ఆలౌట్..టీమిండియా టార్గెట్ ఎంతంటే
Advertisement

IND VS SA: కోల్ క‌తాలో జ‌రుగుతున్న‌ టీమ్ ఇండియా తో జ‌రుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 153 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. కెప్టెన్ బ‌వుమా 55 నాటౌట్ నిలిచి రాణించాడు. జ‌డేజా 4, కుల్దీప్, సిరాజ్ చెరో 2 వికెట్లు తీయ‌గా.. బుమ్రా, అక్ష‌ర్ ప‌టేల్ ఒక్కో వికెట్ తీశారు. ఈ టెస్ట్ లో టీమిండియా విజ‌యం సాధించాలంటే 124 ప‌రుగులు చేయాలి. ఆదివారం మ్యాచ్ లో మూడో రోజు దక్షిణాఫ్రికా నేడు 93/7 వద్ద ఆటను తిరిగి ప్రారంభించింది. ఈ క్రమంలో మరో 60 పరుగులు జోడించింది. భారత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఈరోజు ఆడటం లేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదివారం సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. గిల్ ఆసుపత్రిలో ఉన్నారని, ఈ మ్యాచ్‌లో ఆడరని బీసీసీఐ పేర్కొంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

Also Read : Gautam Gambhir: ఐసీయూలో కెప్టెన్ గిల్‌.. ప‌ట్టించుకోని బీసీసీఐ.. గంభీర్ తిరుగుబాటు ?

తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఆధిక్యంఎంతంటే..?

Advertisement

రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా కోల్ క‌తాలో టాస్ గెలిచిన ప్రొటిస్ జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్ లో 159 ప‌రుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా 5 వికెట్ల‌తో రాణించి సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డ‌ర్ ను కుదేలు చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో ఓపెన‌ర్ ఐడెన్ మార్క్ర‌మ్ 31 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బ‌వుమా 11 బంతులు ఎదుర్కొని కేవ‌లం 3 ప‌రుగులే చేసి నిష్క్ర‌మించాడు. కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్ ధ్రువ్ జురెల్ కి క్యాచ్ ఇచ్చి బ‌వుమా పెవిలియ‌న్ చేరాడు. అనంత‌రం తొలి ఇన్నింగ్స్ భార‌త జ‌ట్టు 189 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ను ప‌రిశీలించిన‌ట్ట‌యితే.. ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ 12, కే.ఎల్. రాహుల్ 39, వాషింగ్ట‌న్ సుంద‌ర్ 29, శుబ్ మన్ గిల్ 4 రిటైర్డ్ ఔట్, రిష‌బ్ పంత్ 27, ర‌వీంద్ర జ‌డేజా 27, ధ్రువ్ జురెల్ 14, అక్ష‌ర్ ప‌టేల్ 16, కుల్దీప్ యాద‌వ్ 1, బుమ్రా 1 నాటౌట్ గా నిలిచాడు.

టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ను ప‌రిశీలించిన‌ట్ట‌యితే రికెల్ట‌న్ 11, మార్క్ర‌మ్ 4, ముల్డ‌ర్ 11, బ‌వుమా 55, టోనీ 2, స్ట‌బ్స్ 5, వెర్రీయిన్నె09, జాన్స‌న్ 13, బోస్క్ 25, హార్మ‌ర్ 07, మ‌హారాజ్ 0 ప‌రుగులు చేశారు. కెప్టెన్ బ‌వుమా 55 ప‌రుగులు చేసి నాటౌట్ నిలిచాడు. అత‌ను కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. మ‌రోవైపు ఈ మ్యాచ్ హోరా హోరీగా కొన‌సాగుతుంది. టీమిండియా ధీటుగా సౌతాఫ్రికా రాణిస్తుంది. కేవ‌లం 124 ప‌రుగులు చేస్తే.. టీమిండియా విజ‌యం సాధిస్తుంద‌నుకున్న త‌రుణంలోనే ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ 0, మ‌రో ఓపెన‌ర్ కే.ఎల్. రాహుల్ 1 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట్ అయ్యారు. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ప్రారంభంలో కాస్త త‌డ‌బ‌డుతుంద‌నే చెప్పాలి. లంచ్ స‌మ‌యానికి 2 వికెట్లు కోల్పోయింది. కేవ‌లం 10 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. భార‌త్ విజ‌యానికి ఇంకా 114 ప‌రుగులు చేయాల్సి ఉంది. క్రీజులో వాషింగ్ట‌న్ సుంద‌ర్, ధ్రృవ్ జురెల్ ఉన్నారు.

Advertisement

Also Read : IPL 2026 Auction: పర్స్ అమౌంట్ తో KKR కింగ్ మేక‌ర్‌.. ఏ జట్టు దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయంటే

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×