E-Paper
Advertisement

Big tv Kissik Talks: పుష్ప అనసూయ పాత్ర పై జ్యోతి కామెంట్స్…నా ఫీలింగ్ అదే అంటూ!

Big tv Kissik Talks: పుష్ప అనసూయ పాత్ర పై జ్యోతి కామెంట్స్…నా ఫీలింగ్ అదే అంటూ!
Advertisement

Big tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమంలో భాగంగా ఈవారం సినీనటి జ్యోతి(Jyothi) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఎన్నో సినిమాలలో వ్యాంప్ తరహా పాత్రలలో నటించిన జ్యోతి తన కెరియర్లో సుమారు 85 సినిమాలలో నటించానని ఈ సందర్భంగా వెల్లడించారు.ఇన్ని సినిమాలలో నటించిన ఈమె ఇటీవల కాలంలో సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇలా చాలా రోజుల తర్వాత పలు కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్న జ్యోతి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

చిరంజీవి గారి స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి..

తనకు చిన్నప్పటినుంచి డాన్స్ అంటే చాలా ఇష్టమని చిరంజీవి గారి డాన్స్ నేర్చుకొని సినిమాలలోకి రావాలని ప్రయత్నాలు చేశాను. డమరుకం శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్లో అందం అనే సినిమా షూటింగ్ జరుగుతుంది ఆ సినిమాలో సెకండ్ లీడ్ కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో నేను ఆడిషన్ కి వెళ్ళగా సెలెక్ట్ అయ్యానని, అలా సినిమాలలోకి వచ్చానని తెలిపారు. ఆ వయసులో తనకు ఇలాంటి సినిమాలు లోనే నటించాలి అనే సంగతి తెలియదు వచ్చిన సినిమాలన్నీ చేసుకుంటూ వెళ్లానని జ్యోతి వెల్లడించారు. అయితే తనకు పెళ్ళాం ఊరెళ్తే సినిమా మంచి హిట్ అందించిందని ఈ సినిమాలో సంగీత రక్షిత కంటే నా పాత్ర హైలెట్ అయిందని తెలిపారు.

రంగమ్మత్త లాంటి పాత్రలు చేయాలని ఉంది..

Advertisement

ఇక ఇంటర్వ్యూ సందర్భంగా వర్ష తనని ప్రశ్నిస్తూ ఏదైనా సినిమా చూసినప్పుడు ఇలాంటి పాత్రలలో నటించి ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ కలిగిందా అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు జ్యోతి సమాధానం చెబుతూ అనసూయ (Anasuya)నటించిన రంగస్థలం పుష్ప సినిమా చూసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ కలిగిందని తెలిపారు. సుకుమార్ డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగస్థలం (Rangasthalam) పుష్ప సినిమాలో అనసూయ నటించిన సంగతి తెలిసిందే. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక పుష్ప (Pushpa)సినిమాలో దాక్షాయిని పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ తరహా పాత్రలలో నేను నటించి ఉంటే బాగుండు అనే భావన తనకు కలిగిందని జ్యోతి తెలిపారు.

Advertisement

ఇక అనసూయ ఈ రెండు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తనుకు కూడా ఇలాంటి పాత్రలలో నటించే అవకాశాలు వస్తే కచ్చితంగా చేస్తానని జ్యోతి వెల్లడించారు. ఇక ఇటీవల కాలంలో జ్యోతి తన వ్యక్తిగత కారణాలవల్లే సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానని తెలిపారు. ఇప్పుడు కనుక తనుకు సినిమాలలో నటించే అవకాశాలు వస్తే తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా వెల్లడించారు. మరి సినిమాలకు సిద్ధమే అని చెబుతున్న జ్యోతికి దర్శక నిర్మాతలు అవకాశం కల్పిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Big tv Kissik Talks: జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే… ఎవరూ చేయొద్దు జ్యోతి ఎమోషనల్!

Related News

బిగ్‌బాస్ 10పై పెరిగిన హైప్.. లిస్ట్‌లో ఉన్నది వీళ్లేనా ?

క్యూట్ లుక్స్‌తో దేవజాని మోదక్ రచ్చ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ పిక్!

వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?

కౌశల్ ను తొక్కేశారా? ఇన్నాళ్లకు నోరు విప్పిన బిగ్ బాస్ విన్నర్!

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Big Stories

Advertisement
×