E-Paper
Advertisement

Hindupur Politics: వైసీపీ ఆఫీస్ దాడి ఎఫెక్ట్.. హిందూపూర్‌లో ఎమ్మెల్యే బాలకృష్ణ, నేతల హౌస్ అరెస్ట్

Hindupur Politics: వైసీపీ ఆఫీస్ దాడి ఎఫెక్ట్.. హిందూపూర్‌లో ఎమ్మెల్యే బాలకృష్ణ, నేతల  హౌస్ అరెస్ట్
Advertisement

Hindupur Politics: కావాలనే టీడీపీ కేడర్‌ని వైసీపీ రెచ్చగొడుతోందా? ఏదో విధంగా ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందా? ఎప్పుడూ లేని విధంగా ఆ పార్టీ నేతలు ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు? ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదివారం హిందూపూర్ వెళ్లనున్నారా? ఎమ్మెల్యే రానున్న నేపథ్యంలో వైసీపీ నేతలను హౌస్ అరెస్టు చేస్తున్నారా?

హిందూపూర్‌లో ఎమ్మెల్యే బాలకృష్ణ

Advertisement

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ‌లో ఆదివారం పర్యటిస్తున్నారు హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. సోమేందేపల్లి‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. మంత్రి సవిత ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు బాలకృష్ణ.

హిందూపురంలోని వైసీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇరుపార్టీల నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దాడి ఘటనలో 16 మంది టీడీపీ నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయి. హిందూపురం వైసీపీ ఇన్‌ఛార్జ్ దీపిక భర్త వేణు‌రెడ్డి‌తోపాటు మరో ఎనిమిది మందిపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు పోలీసులు.

Advertisement

పలువురు వైసీపీ నేతల హౌస్ అరెస్ట్

ఈ పరిస్థితి నేపథ్యంలో హిందూపూర్ వెళ్లారు ఎమ్మెల్యే బాలకృష్ణ. ఆయనను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో వారిని హిందూపూర్‌కు వెళ్లకుండా నాయకులకు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ మంత్రి ఉష‌శ్రీలను హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ ఘటన గురించి తెలుసుకునేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ అక్కడికి వెళ్లారు. పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి పూర్తి వివరాలు తీసుకున్నట్లు సమాచారం. ఇదిలావుండగా ఘటన ముందు, ఆ తర్వాత వేణురెడ్డి వ్యాఖ్యలు మాత్రం రెచ్చగొట్టేలా ఉన్నాయిని అంటున్నారు టీడీపీ నేతలు.

ALSO READ:  రాజకీయాల్లోకి వస్తే వంగవీటి రంగా మార్క్ చూపిస్తా- ఆశా కిరణ్

ఇంతకీ ఘటన తర్వాత వేణురెడ్డి ఏమన్నారు? అధికారం చేతిలో ఉందని టీడీపీ వాళ్లు హిందూపురంలో మా పార్టీ ఆఫీస్‌పై దాడి చేశారని అన్నారు. ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించడానికి తామేమీ గాంధీలం కాదని, వైసీపీ కార్యకర్తలమని అన్నారు. మీ అరాచకాలు ఇలానే కొనసాగితే.. జగన్ 2.O ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నామని అన్నారు.   ఏ ఒక్కర్నీ వదలమని చెప్పకనే చెప్పారాయన.

Related News

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

Big Stories

Advertisement
×