E-Paper
Advertisement

గ్రౌండ్ ఖాళీ చేయండి అంటూ CSK ఫ్యాన్స్ ను త‌రిమికొట్టిన‌ ఇషాన్ కిష‌న్‌.. విజిల్ వేస్తూ మ‌రీ

గ్రౌండ్ ఖాళీ చేయండి అంటూ CSK ఫ్యాన్స్ ను త‌రిమికొట్టిన‌ ఇషాన్ కిష‌న్‌.. విజిల్ వేస్తూ మ‌రీ
Advertisement

Ishan Whistle Podu:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ (Chennai Super Kings vs Sunrisers Hyderabad) మధ్య కీలక మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన సన్రైజర్స్ హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతేకాదు ప్లే ఆఫ్స్ లోకి దూసుకు వెళ్ళింది హైదరాబాద్. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన ఇషాన్ కిషన్… సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. మ్యాచ్ గెలిచిన వెంటనే, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను దారుణంగా ట్రోలింగ్ చేశాడు. విజిల్ వేస్తూ (Whistle Podu)… ఇక స్టేడియాన్ని ఖాళీ చేయండి అంటూ సైగలు చేశాడు. మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) లాంటి దిగ్గజాలు స్టేడియంలో ఉన్నప్పుడే, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను వెళ్లిపోండి అంటూ హెచ్చరించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో ఇషాన్ కిషన్ పై (Ishan Kishan) చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు సీరియస్ అవుతున్నారు.

Also Read: Sanju VS Klaasen: నీ తోలు తీస్తా..సంజుకు కాటేరమ్మ కొడుకు క్లాసెన్ వార్నింగ్‌, ప్లే ఆఫ్స్ లోకి SRH, గుజ‌రాత్ టైటాన్స్‌

CSK ఫ్యాన్స్ ను త‌రిమికొట్టి ఇషాన్ కిష‌న్‌

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ప్లే ఆఫ్స్ లోకి దూసుకు వెళ్లింది సన్రైజర్స్ హైదరాబాద్. నిన్న ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ను మట్టి కరిపించి, ప్లే ఆఫ్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈ మ్యాచ్ లో కీలకమైన 70 పరుగులు సాధించిన ఇషాన్ కిషన్, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను గెలికాడు. మ్యాచ్ గెలిచిన ఉత్సాహంతో.. విజిల్ వేస్తూ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను ర్యాగింగ్ చేశాడు. స్టేడియం కాళీ చేసి వెళ్లిపోండి.. ఇక మీ పని అయిపోయింది అంటూ హెచ్చరించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

అయితే తమ గడ్డపైకి వచ్చి మమ్మల్ని వెళ్లిపొమ్మంటావా ? ఎన్ని గుండెలు రా నీకు అంటూ ఇషాన్ కిషన్ ను చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆడుకుంటున్నారు. అటు మొన్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ కూడా ఇలాగే చెన్నై సూపర్ కింగ్స్ ను ర్యాగింగ్ చేశాడు. చెన్నై పై మ్యాచ్ గెలిచిన తర్వాత నోట్లో విజిల్ పెట్టుకొని… ట్రోల్ చేశాడు. ఇలా వరుసగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టును టీమిండియా ప్లేయర్లే ర్యాగింగ్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని అభిమానులు మండిపడుతున్నారు. వీళ్ళిద్దరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ఇషాన్ కిషన్ పైన బిసిసిఐ భారీ ఫైన్ వేసే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.

Advertisement

 

Also Read: Mushfiqur Rahim: కాలితో గ‌ట్టిగా త‌న్నిన ముష్ఫిఖర్ రహీం..10 మీట‌ర్ల దూరంలో ప‌డ్డ‌ హెల్మెట్

 

 

 

 

Related News

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

విరాట్ కోహ్లీ నాలాగే ఉంటాడు కానీ, పెద్ద అంద‌గాడు కాదు !

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

టీమిండియాకు ఏది చేత‌కాదు, ఇప్ప‌టికే విండీస్ సిరీస్ గెలిచింది, ట్రోఫీ ఇచ్చేయండి

టీమిండియా రూ.250 కోట్లు దొబ్బుకుపోతే, మాకు ఒక్క రూపాయి ఇవ్వ‌డం లేదు

నోటికి ప్లాస్ట‌ర్ వేసి, 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీశారు!

విడాకులు త‌ర్వాత ప‌చ్చి తాగుబోతున‌య్యా..ధ‌న శ్రీపై యుజ్వేంద్ర చాహల్ సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×